Thank You CM Sir Survey
తల్లికి వందనం పధకం Thalliki Vandanam Scheme Payment Acknowledgement - Thank You CM Sir Survey - Thalliki Vandanam Payment Acknowledgement కోసం Thank You CM Sir Survey ను ప్రభుత్వం చేస్తుంది . తల్లికి వందనం పధకం పేమెంట్ Thalliki Vandanam Scheme Payment Credit అందినదా ? అందలేదా ? [ Payment Acknowledgement ] అని తెలుసుకునేందుకు, అందిన వారికి అందింది అని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రజలందరికీ వారి గ్రామ వార్డు సచివాలయాలలో Thank You CM Sir Survey అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది .
Check Thalliki Vandanam Payment Status Now
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల GSWS Employees App V8.4 లో కొత్తగా ఇచ్చిన THANK YOU CM SIR అనే ఆప్షన్ లో సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన క్లస్టర్లలో ఎవరైతే తల్లికి వందనం పథకం Thalliki Vandanam Scheme ద్వారా నగదు క్రెడిట్ అయినవారు ఉంటారో వారి పేర్లు చూపిస్తుంది. సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు Biometric / Face / Irish ధ్రువీకరణ ద్వారా Payment అందినది అదే Thalliki Vandanam Scheme ద్వారా మాకు నగదు క్రెడిట్ అయినది అని చెప్పి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలా ఇలా ధ్రువీకరించినట్టు అయితే ప్రభుత్వానికి మీరు ఉన్నట్టు, మీకు నగదు అందినట్టు తుది ధ్రువీకరణ అయినట్టు అర్థము తద్వారా తరువాత విడత నగదు విడుదలకు మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు అంటే మీరు బ్రతికే ఉన్నారు అర్హులై ఉండి నగదు పొందారు అని ప్రభుత్వం తుది నిర్ణయానికి వస్తుంది .
Thank You CM Sir Survey 2025 Process
ముందుగా సచివాలయ సిబ్బంది కింద ఇవ్వబడిన Mobile App ను డౌన్లోడ్ చేసుకోవాలి.
సచివాలయంలో ఉన్న సిబ్బందికి వారి User Name ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా మొబైల్ యాప్ లో లాగిన్ అవ్వాలి.
Home Page లో ఉన్నటువంటి Thank You CM Sir అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.
Cluster Number ద్వారా లేదా Aadhaar Number ద్వారా Search చేసే అవకాశం ఉంది. సిటిజన్ ఉద్యోగి వద్దకు వెళ్లి నేరుగా ఆధార్ నెంబర్ చూపించు కూడా సర్వే ను చేయించుకోవచ్చు లేదా ఉద్యోగి వారికి కేటాయించిన క్లస్టర్ వెళ్ళినప్పుడు వారి యొక్క క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- తల్లి పేరు
- ఎకౌంటు నెంబరు
- ఎంత నగదు జమైందో వివరాలు
- మదర్ యొక్క ఆధార చివర నాలుగు అంకెలు
- ఎంతమంది పిల్లలు వారి సంఖ్య
- మొబైల్ నెంబరు
- క్రెడిట్ అయిన నగదు అమౌంటు
- బ్యాంకు పేరు
- అకౌంట్ నెంబరు వివరాలు చూపిస్తాయి
పేరు పై సెలెక్ట్ చేసి బయోమెట్రిక్ లేదా ఐరిస్ లేదా ఫేస్ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసినట్లయితే వారికి ఈ సర్వే పూర్తి అయినట్టు అర్థము.
సచివాలయ సిబ్బంది అందరూ కూడా వారికి కేటాయించిన క్లస్టర్లలో ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సర్వేను పూర్తి చేసుకున్న ప్రజలకు ప్రభుత్వం నుండి వారికి నగదు క్రెడిట్ అయినది మరియు నగదు క్రెడిట్ అయినట్టు వారి ద్వారా సమ్మతి వచ్చినది అని చెప్పి సమాచారం అందుతుంది తద్వారా తదుపరి విడత నగదు విడుదల చేసే సమయంలో ఎవరైతే ఇప్పుడు బయోమెట్రిక్ వేస్తారో వారికి సమస్య అనేది ఉండదు
Thalliki Vandanam Payment Not Received ? Do This...
Thank You CM Sir Survey Report
తల్లికి వందనం పథకం ద్వారా నగదు అందిన వారికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తున్న Thank You CM Sir Survey సర్వే రిపోర్ట్ తెలుసుకునేందుకు కింద లింక్ పై క్లిక్ చేసి General Report పై క్లిక్ చేసి Thank You CM Sir [ Thalliki Vandanam Scheme Payment Acknowledgement Report ] పై క్లిక్ చేయండి