How to Check Thalliki Vandanam Scheme Payment Status Online
Thalliki Vandanam Scheme Payment Status : ఒక్క OTP తో తల్లికి వందనం పథకం పేమెంట్ స్టేటస్ మీ మొబైల్ లోనే ఉచితంగా తెలుసుకునే ఆప్షను Andhra Pradesh ప్రభుత్వం కల్పించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను Thalliki Vandanam Scheme ను June 12, 2025 నా ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతూ. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను వారి యొక్క తల్లి యొక్క ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. తల్లి మరణించినట్టయితే తండ్రికు, తండ్రి కూడా మరణించినట్లయితే అప్పుడు సంరక్షకుల ఖాతాలో నగదు జమ అవుతుంది. నగదు క్రెడిట్ అవ్వడం అనేది రోజు జరుగుతున్న ప్రక్రియ కేవలం జూన్ 12 మాత్రమే కాదు రోజు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైతే అర్హులై ఉండి జాబితాలో ఉంటారో వారికి, మొదటి తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా July 5, 2025 నగాదు క్రెడిట్ అవ్వనుంది. పేమెంట్ స్టేటస్ ను WhatsApp ద్వారా, OTP ద్వారా వెబ్ సైట్ లో, SMS ద్వారా తెలుసుకోవచ్చు.
Thalliki Vandanam Scheme Amount
Thalliki Vandanam Scheme Amount : తల్లికి వందనం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో మరియు కాలేజీలలో అనగా మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లులకు ఒక విద్యార్థికి 15000 చొప్పున ప్రభుత్వం క్రెడిట్ చేయనుంది. అందులో 2000 రూపాయలు స్కూలు / కాలేజీ నిర్వహణ నిమిత్తం ఆయా ఖాతాలలో ఆయా జిల్లాల కలెక్టర్ల వారి ఆమోదం మేరకు క్రెడిట్ అవ్వగా మిగిలిన 13వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి చొప్పున వారి యొక్క తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవ్వనుంది. రాష్ట్రంలో ఉన్న తల్లులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత నగదు అనగా ఒకరు ఉంటే 13,000, ఇద్దరూ ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000, నలుగురు ఉంటే 52,000 ఇలా క్రెడిట్ అవుతుంది.
Thalliki Vandanam Scheme Bank Account
Thalliki Vandanam Scheme Bank Account : తల్లికి వందనం పథకం ద్వారా నగదు తల్లులకు నేరుగా అందించకుండా వారి ఆధార్‌కు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో మాత్రమే ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా జమ అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ బ్యాంకు అయినా సరే ఆధార్ కార్డుకు రీసెంట్గా ఏ బ్యాంకు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు మాత్రమే నగదు జమ. చాలామందికి నగదు జమ అయినప్పటికీ కూడా ఏ బ్యాంకు ఖాతాలో జమ అయినదో తెలియకపోవడం వలన పలుమార్లు వారి యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అడుగుతున్నారు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారికి ఎన్ని ఖాతాలు ఉన్నప్పటికీ రీసెంట్గా ఆధార్ కార్డుతో NPCI Link తో ఏ బ్యాంకుకు లింకు చేసి ఉంటారో ఆ బ్యాంకులో మాత్రమే నగదు జమ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు ఖాతా లింక్ అయినదో కింద ఇచ్చిన లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
పై లింకును మీ మొబైల్ లో ఓపెన్ చేసిన తర్వాత Consumer --> BASE --> Aadhaar Mapped Status ద్వారా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న బ్యాంకు ఖాతాకు మాత్రమే నగదు జమ అవుతుంది.
How To Check Thalliki Vandanam Scheme Status Online
Know Thalliki Vandanam Scheme Status : తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అని తెలుసుకునేందుకుగాను ముందుగా మీరు మీ యొక్క గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులను [ WEA / WEDPS ] కాంటాక్ట్ అయినట్టు అయితే వారు మీయొక్క అర్హతను వారి యొక్క వెబ్సైట్లో చూసి చెప్తారు. లేదా మీ సచివాలయ నోటీసు బోర్డులో అంటించిన అర్హుల మరియు అనర్హుల జాబితాను చూసి దాని ప్రకారం మీరు అర్హుల లేదా అనర్హుల అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సచివాలయానికి వెళ్ళలేని వారు లేదా సొంతంగా తెలుసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రెండు విధాలుగా అప్లికేషన్ స్టేటస్ లు తెలుసుకొని అవకాశం కల్పించింది.
Thalliki Vandanam Scheme Status in WhatsApp :
Manamitra - WhatsApp Governance లో తల్లికి వందనం పథకం యొక్క స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలో చూడండి.
ముందుగా కింద ఇచ్చిన నెంబర్ పై క్లిక్ చేసినట్లయితే నేరుగా వాట్సాప్ తీసుకుని వెళుతుంది.
HI అని మెసేజ్ చేయండి. Choose Services పై క్లిక్ చేయండి.
చేసి Thalliki Vandanam ఆప్షన్‌ను ఎంచుకొని
తల్లి యొక్క ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే
ఇంట్లో ఎంతమంది అర్హులు ఉన్నారో ఎంత నగదు వస్తుందో చూపిస్తుంది.
అదే ఇంట్లో ఎవరూ అర్హులు లేకపోతే డేటా బేస్ లో పేరు లేదు లేదా అనర్హులు అని చెప్పి చూపిస్తుంది.
Thalliki Vandanam Scheme Status in NBM Website
Thalliki Vandanam Scheme Status in NBM Website : తల్లికి వందనం పథకం అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్‌ను సొంతంగా ఎవరికి వారు ఆన్లైన్లో మొబైల్ లోనే ఉచితంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలామంది ఇది పనిచేయడం లేదు అని అంటున్నారు కానీ పనిచేస్తుంది ఉదయం లేదా సాయంత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు దీనికి కేవలం ఒక ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP ఉంటే సరిపోతుంది. Website లో ఎలా Thalliki Vandana Scheme Application & Payment Status తెలుసుకోవాలా ఇప్పుడు చూద్దాం.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
Step 2 : ఇలా ఓపెన్ అవుతుంది.
కింది వివరాలు నమోదు.
Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి ఆధార్ నెంబర్
పై వివరాలు నమోదు చేసి చూపిస్తున్నటువంటి కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి Click Here to Know Aadhar Linked Mobile Number వస్తుంది. ఓటీపీ ను ఎంటర్ చేసి Submit చేయండి.
వెంటనే కింద చూపించినట్టుగా వివరాలు కనిపిస్తాయి..
అందులో Basic Details లో జిల్లా మండలం సచివాలయం కోడు సచివాలయం పేరు క్లస్టర్ కోడు తల్లికి వందనం పథకం అర్హుల పేరు మొబైల్ నెంబరు చివరి 4 అంకెలు . Application Details లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి అప్లికేషన్ నెంబరు, విద్యార్థి పేరు, అప్లికేషన్ తేదీ, ప్రస్తుత అప్లికేషన్ స్టేటస్, Remarks రావటం జరుగును. Application Status లో Eligible అని ఉన్న వారికి మాత్రమే నగదు క్రెడిట్ అవుతుంది. అలాకాకుండా అక్కడ అనర్హతకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఉదాహరణకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు ఉన్నాయని గాని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని గాని, సరైన ఆదాయ ధ్రువీకరణ పత్రము లేనందున అని గాని, రైస్ కార్డు లేనందువలన అనగానే ఇలా ఏమున్నా సరే వారికి నగదు మాత్రం క్రెడిట్ అవ్వదు. వారు వారి యొక్క గ్రామా లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులను కాంటాక్ట్ అయ్యి అర్జీలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అర్హులకు మాత్రమే అర్జీ పెట్టినట్లయితే వారి సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంది అనర్హులు అర్జీ పెట్టినా కూడా వారికి ఎటువంటి పరిష్కారం అనేది ఉండదు వారికి నగదు మాత్రం క్రెడిట్ అవ్వదు. Details లో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారి యొక్క స్టేటస్ మరియు ఏ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయినదో వాటి యొక్క వివరాలు చూపిస్తుంది.
Not work site
ReplyDeleteremarks under process chupistundi money credit avaledu
ReplyDelete6301438625
ReplyDeleteRemarks lo aadhar mapping doesn't exist ani chupistundi, sbi bank ki velli aadhar ekyc process, chesina kuda remarks chupistundi, npci app lo enable for debit option chupistundi, sbi nundi aadhar mapping success ani msg vachina kuda remarks chupistundi
ReplyDelete