Yogandhra - Yoga Daily Attendnace Process in GSWS Employees App
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ యోగా దినోత్సవంను అత్యంత ప్రాధాన్యత వరుసలో ఉంచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా యోగాలో పాలుపంచుకునే విధంగా వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ Yoga Citizen Registration గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకుగాను సచివాలయ పరిధిలో ట్రైనర్ లను కూడా గుర్తించి వారికి కూడా రిజిస్ట్రేషన్ Yoga Trainer Registration చేయించడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత ట్రైనర్లకు ఆ గ్రామ సచివాలయ పరిధిలో లేదా వార్డు సచివాలయ పరిధిలో ప్రజలకు మ్యాపింగ్ Trainer to Citizen Mapping ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21 వరకు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో రోజువారీగా యోగా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా ఎవరైతే ప్రజలు యోగాకు హాజరు అవుతారో వారి యొక్క హాజరు Citizen Yoga Daily Attendnace తీసుకునేందుకుగాను కొత్తగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ వాడే మొబైల్ యాప్ అయిన GSWS Employees App కొత్తగా రోజువారి యోగ హాజరు Yoga Daily Attendance ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే గ్రామా లేదా అవార్డు సచివాలయ పరిధిలో రోజు జరిగే యోగ కార్యక్రమాలకు హాజరవుతారు వారి యొక్క హాజరును సంబంధిత గ్రామా లేదా వార్డు సచివాలయ సిబ్బంది వారు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
How to Update Citizen Yoga Daily Attendance in GSWS Employees App
ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి కొత్తగా అప్డేట్ అయిన గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులు వాడే మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పని కేవలం గ్రామ లేదా వార్డు సచివాల సిబ్బంది వారి లాగిన్ లో మాత్రమే అవుతుంది , ప్రజలకు వారి హాజరును నమోదు చేసుకుని సొంత ఆప్షన్ అంటూ ఏమీ లేదు .
Download GSWS Employees App
మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కింద చూపించిన విధంగా పేజీ చూపిస్తుంది.
సచివాలయ ఉద్యోగులు వారి User Name ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
తర్వాత Home Page లో అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి కిందకి వెళ్లినట్టు అయితే Yoga Daily Attendnace అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయాలి.
వెంటనే QR Scanner / Enter Registration Number లో ఏదైనా డేటా ఉంటే ఆ డేటా ప్రకారం ఆ యొక్క సిటిజన్ కు హాజరు అనేది వేయవచ్చు.
QR Code సిటిజెన్ను యోగ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయి సమయంలో చూపిస్తుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి హాజరను నమోదు చేయవచ్చు. అక్కడే సిటిజన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబరు లేకపోతే ఏం చేయాలో కింద చూపించడం జరిగింది. ఆ ప్రాసెస్ ప్రకారం మీరు సిటిజన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు. రెండిటిలో ఏదో ఒకటి నమోదు చేసి యోగ చేసిన విధానం ప్రకారం వారికి ఎంత రేటింగ్ ఇవ్వవచ్చు 1 నుండి 10 వరకు [ 1 అంటే బాగాలేదు అని, అలా 2 >3>4>5>6>7>8>9 అలా 10 అంటే చాలా బాగా చేశారు అని అర్థం ] రేటింగ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి . location On లో ఉంచి చేయాలి . చేసిన వెంటనే కింద చూపించిన విధముగా చూపిస్తుంది. ఈ విధముగా యోగాకు హాజరైన వారందరి హాజరు కూడా తప్పనిసరిగా మొబైల్ యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
How to Know Yogandhra Citizen Registration Number Online ?
యోగా ఆంధ్రాలో ఎవరైతే సిటిజన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి యొక్క QR కోడ్ / రిజిస్ట్రేషన్ నెంబర్ను సిటిజన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరన తెలుస్తుంది అందులోనే క్యూఆర్ కోడ్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది .
ప్రజలు యోగ చేసే వెన్యూ వద్ద చూపించినట్టయితే గ్రామ లేదా వార్డు సచివాల సిబ్బంది పైన చెప్పిన ప్రాసెస్ ద్వారా వారి యొక్క హాజరు తీసుకుంటారు.
పైన చెప్పిన QR కోడ్ / రిజిస్ట్రేషన్ నెంబర్ అందుబాటులో లేని పక్షాన సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయానికి ఇచ్చినటువంటి యోగాంధ్ర యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించుకొని కూడా సిటిజన్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను తెలుసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
Step 1 : ముందుగా యోగాంధ్ర అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి
Step 2 : కింద చూపిన విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది .
Login పై క్లిక్ చేసి, సచివాలయం కి ఇవ్వబడిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
User Name : YOGA_SACHIVALAYAM VODE,
Password : Ask To Manadal / Municipality Level Staff
తర్వాత Trainings > Trainer to Citizen Mapping అని ఆప్షన్ పై టిక్ చేయండి చేయండి.
Add Mapping పై టిక్ చేయండి.
Trainer Name ను సెలెక్ట్ చేయండి.
వెంటనే ఆ ట్రైన్ ఆకు ట్యాగ్ చేసిన ప్రజలు మరియు వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మొబైల్ నెంబరు పేర్లు వస్తాయి .
అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా పైన చెప్పిన ప్రాసెస్ లో ఉద్యోగులు హాజరను మొబైల్ యాప్ లో నమోదు చేయవచ్చు.
Yoga Daily Attendnace Process in GSWS Employees App Key Points
- ఈ ప్రాసెస్ ద్వారా ఏ సచివాలయంలో ప్రజలను ఆ సచివాలయ లాగిన్ లో మాత్రమే తెలుసుకోవడానికి అవుతుంది.
- మ్యాపింగ్ చేయకముందు పూర్తి ఎక్సెల్ గాని డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఆ ఫైల్ లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్లు అనేవి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రజలందరికీ ఒకే దగ్గర ఉంటాయి.
- ప్రజలకో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాట్స్అప్లో కూడా మెసేజ్లు వెళ్తున్నాయి ఒకసారి వారికి అడిగి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ను తెలుసుకోవచ్చు.