Member Deletion in Ration Card, Andhra Pradesh
రైస్ కార్డు / రేషన్ కార్డులో సభ్యుల తొలగింపుకు Rice Card - Ration Card Member Deletion కు ప్రభుత్వం కొత్తగా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది . గతంలో రేషన్ కార్డులో ఎవరైనా సభ్యులు Death చనిపోయిన వారు ఉంటే మాత్రమే వారిని తొలగించేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం ఎవరైతే Migration వలసలో ఉంటారో వారిని కూడా తొలగించే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కరిని కూడా కార్డు నుడి తీసివేయవచ్చు . వేరే రాష్ట్రం/దేశం వాళ్ళని వివాహం చేసుకుని మైగ్రేట్ అయిన వారు, వేరే రాష్ట్రం/దేశంలోకి మైగ్రేట్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వారు, వేరే రాష్ట్రం/వేరే దేశంలో చదువు నిమిత్తం మైగ్రేట్ అయిన వారు, ఇతర కారణాలు ఉన్న వారు ఈ ఆప్షన్ సద్వినియోగం చేసుకోగలరు.
Application Process For Member Deletion in AP Ration Card
గతంలో రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించాలి అంటే ముందుగా గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తును సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత రెవెన్యూ అధికారి అనగా గ్రామాల్లో VRO పట్టణాల్లో వార్డు రెవెన్యూ సెక్రటరీ WRO వారు వారి లాగిన్ లో ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సంబంధిత మండల రెవెన్యూ అధికారి MRO వారి లాగిన్ కు తుది ఆమోదం కొరకు వెళ్లేది. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఆప్షన్లో ఎవరైతే రైస్ కార్డు నుండి సభ్యులను తొలగిస్తారో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో అప్లికేషన్ చేసిన తర్వాత VRO లేదా WRO వారి లాగిన్ తో సంబంధం లేకుండా వారి రికమండేషన్ తో నేరుగా MRO వారి ఆమోదం కు వెళ్ళనుంది . ఈ కొత్త ప్రాసెస్ లో VRO / WRO వారి లాగిన్ లో వారి వెబ్సైట్లో ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత నేరుగా ఎమ్మార్వో వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది అక్కడ తుది వస్తే సరిపోతుంది. SLA Period - దరఖాస్తు చేసిన 21 రోజుల లోపు తుది ఆమోదం అవుతుంది .
Options Available To Remove From AP Ration Card
చనిపోయిన వారిని రైస్ కార్డు నుండి తొలగించే ఆప్షన్ గతం నుండే ఉంది కొత్తగా , ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డులో ఉన్న సభ్యులలో ఎవరైనా సరే వలసలో ఉన్నట్టయితే అనగా వేరే రాష్ట్రంలో గాని వేరే దేశంలో గాని కింద తెలిపిన కారణాలలో ఏదైనా ఒక కారణంతో
Memeber Deletion In Rice Card Due to Migration Options
- వేరే రాష్ట్రం/దేశం వాళ్ళని వివాహం చేసుకుని మైగ్రేట్ అయిన వారు,
- వేరే రాష్ట్రం/దేశంలోకి మైగ్రేట్ అయ్యి ఉద్యోగం చేస్తున్న వారు,
- వేరే రాష్ట్రం/వేరే దేశంలో చదువు నిమిత్తం మైగ్రేట్ అయిన వారు,
- ఇతర కారణాలు ఉన్న వారు
వలసలో ఉంటే వారు లేదా ఇంట్లో ఒకరు తప్పనిసరిగా రైస్ కార్డు ప్రస్తుతం ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉందో అక్కడికి వెళ్లి వారి యొక్క బయోమెట్రిక్ వేసి వేయాల్సి ఉంటుంది. OTP ద్వారా వారిని తొలగించేందుకు దరఖాస్తు చేసే ఆప్షన్ లేదు. అంటే ఎవరినైతే వలసలో ఉన్నారు అనే కారణం చేత తీసివేయాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది .
Require Documents For Member Deletion In Ration Card
- Application Form [ DOWNLOAD ]
- Rice Card Xerox
- Aadhar Card Xerox [ HOF ]
- Aadhar Card Xerox [ Migrated Person ]
- Proof Of Migration [ If Available ]
Application Fee For Member Deletion in AP Ration Card
రేషన్ కార్డు నుండి సభ్యులను తొలగించేందుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం Application Fee Rs. 24/- రూపాయలుగా ఖరారు చేయడం జరిగింది. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు కేవలం అప్లికేషన్ ఫీజు 24 రూపాయలు మాత్రమే. దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫీజును నేరుగా అయినా ఇవ్వవచ్చు లేదా ఫోన్ పే ద్వారా కూడా నేరుగా సర్వీసు చేసే సమయంలోనే పేమెంట్ చేసే ఆప్షన్ కూడా కలదు.
AP Ration Card Member Deletion - Know Application Status
దరఖాస్తు చేసిన తర్వాత దరఖాస్తు చేసిన రోజు నుంచి 21 రోజుల లోపు సంబంధిత మండల రెవెన్యూ అధికారి వారి లాగిన్ లో మీ యొక్క అప్లికేషన్ తుది ఆమోదం అవడం లేదా రిజెక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఈలోపు మీయొక్క అప్లికేషన్ స్టేటస్ను మీరు సొంతంగా చెక్ చేసుకునే ఆప్షన్ ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసిన తర్వాత మీకు సచివాలయంలో ఇచ్చేటువంటి రసీదులో
అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ను మీరు నోట్ చేసుకొని కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి
అందులో Service Request Status Check అనే ఆప్షన్ దగ్గర మీరు ముందుగా నోట్ చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ను నమోదు చేసి అడిగినటువంటి క్యాప్చకోడ్ ని నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే ప్రస్తుతం అప్లికేషన్ ఆమోదం పొందిందా ? రద్దు అయిందా ? అనే విషయం మీకు తెలుస్తుంది . దీనిని మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ లోనైనా చెక్ చేసుకోవచ్చు చెక్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు .
How to get new Rice Card After MRO Approval ?
సంబంధిత తహసీల్దారు MRO వారి తుది ఆమోదం పొందిన తర్వాత రైస్ కార్డులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో లేదు. ప్రభుత్వమే ప్రజలకు సర్వీసులన్నీ దరఖాస్తు పూర్తయిన తర్వాత మరియు గతంలో ఎటువంటి దరఖాస్తు చేయకుండా రైస్ కార్డు కలిగిన వారికి కొత్తగా QR Code Enabled Smart Ration Card క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డును అనగా ATM Card సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డును రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈలోపు సభ్యులను జోడించడం సభ్యులను తొలగించడం ఒక కార్డును రెండు కార్డుగా విభజించడం వంటి సేవలను దరఖాస్తు చేసి తుది ఆమోదం పొందిన వారు కింద ఇవ్వబడిన ప్రాసెస్ ద్వారా నేరుగా మీ మొబైల్ లోనే రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్న కార్డును ప్రింట్ తీసుకొని దేశంలో ఎక్కడైనా సరే రేషన్ కార్డుగా మీరు ఉపయోగించుకోవచ్చు .