Member Migration on Marriage Grounds
Member Migration on Marriage Grounds - వివాహం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాహమైన మహిళ తప్పనిసరిగా కన్నవారి ఇంటి నుండి అత్తవారింటికి లేదా భర్త ఎందులో హౌస్ఫుల్ మ్యాపింగ్ ఉంటే అందులోకి యాడింగ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ను "Member Migration on Marriage Grounds" అని పిలుస్తారు. దీనివలన భవిష్యత్తులో కుటుంబంగా ప్రభుత్వం ప్రకటించే ఏదైనా సరే పథకాలు, భర్త చిరునామా వద్ద భార్య ఏవైనా సర్వీసులు పొందాలన్నా, సేవలు పొందాల, కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటించే ఇతర ప్రోత్సాహకాలు పొందాలి అన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వారి ఇంటికి మార్పు తప్పనిసరి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పు సులువుగా భర్త ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఉన్నారో అక్కడే చేసుకోవచ్చు. సొంతంగా హౌస్ మాపింగ్ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దీనివలన ఉపయోగం ఏమిటి ?
- భార్య ఉద్యోగి అయ్యే వివాహమైన తర్వాత భార్య యొక్క ఇంట్లో వారికి ఈ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు అనగా ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా భార్య కుటుంబం పొందవచ్చు.
- ప్రభుత్వం కాలానుగుణంగా చేసే సర్వేలలో భార్య పేరు ఇకమీదట భర్త ఎక్కడ ఉంటే అక్కడే వస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం వంటి సర్వేలు నిర్వహించే సమయంలో భార్య కన్నవారి ఇంట్లో హౌస్ మ్యాపింగ్ లో ఉన్నట్టయితే పేరు అక్కడే వస్తుంది దాని వలన సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా హౌస్మపింగ్ మార్చుకున్నట్లు అయితే ఎక్కడ మీరు ఉన్నట్లయితే అక్కడే మీ పేరు సర్వేలకు రావటం జరుగుతుంది.
- రేషన్ కార్డులో, ఆరోగ్యశ్రీ కార్డులో, ఉపాధి హామీ జాబ్ కార్డులో, డ్వాక్రాలో, అన్నదాత సుఖీభవ వంటి పథకాలలో భార్య పేరు యాడ్ అవ్వాలి అంటే భార్య కన్నవారి ఇంటి నుండి అత్తవారింటికి లేదా భర్త హౌస్ హోల్ మ్యాపింగ్ లోకి యాడింగ్ అవ్వటం తప్పనిసరి.
- అత్తవారి ఇంటి పరిధిలో లేదా భర్త ఇంటి పరిధిలో లేదా వివాహమైన తర్వాత ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ సేవలు సర్వీసులు పథకాలు పొందాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్పు తప్పనిసరి.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
హౌస్ మ్యాపింగ్ మార్పు కన్నవారి ఇంటి గ్రామా లేదా వార్డు సచివాలయంతో సంబంధం లేకుండా భర్త రాష్ట్రంలో ఏ గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో హౌస్ మాపింగ్ లో ఉన్నారో అక్కడ మాత్రమే చేసుకోవలసి ఉంటుంది. గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయం అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి ఏం కావాలి ?

- దరఖాస్తు ఫారం
- భర్త భార్య ఆధార్ కార్డు జెరాక్స్ లు
- ఆధార్ కార్డు అందుబాటులో లేకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా రైస్ కార్డ్ లేదా ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేదా పాస్పోర్ట్
- చిరునామా ప్రూఫ్ కింద భర్త యొక్క పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాటర్ ఐడి లేదా ఆధార్ కార్డు అవసరం..
- భర్త భార్య భర్త యొక్క సచివాలయంలో బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.
భార్య పిల్లలతో కలిసి ఉంటే ఎలా?
గతంలో కేవలం భార్య మాత్రమే భర్త యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఆడ్ అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇటువంటి ఆప్షన్ ఉన్నదని తెలియక పోవడం వలన భార్య భర్త యొక్క హౌస్మల్ మ్యాపింగ్ లో ఆడ్ అవ్వకుండా కన్నవారి ఇంట్లోనే లేదా స్వతహాగా పిల్లలతో కలిసి హౌస్వోల్ మ్యాపింగ్ లో ఉన్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా పిల్లలతో సహా భార్య భర్త యొక్క హౌస్ మ్యాపింగ్ లో ఆడ్ అయ్యేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీనికిగాను సంబంధిత అధికారుల వారి లాగిన్ లో " Are You Willing To Migrate The Children?" అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా పిల్లలతో సహా భార్య భర్త యొక్క కార్డు లోకి ఆడ్ అవ్వవచ్చు.
ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ముందుగా పైన చెప్పిన డాక్యుమెంట్లతో భార్య మరియు భర్త భర్త యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయం అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు వారి యొక్క లాగిన్ లో AP Srva --> Other Service --> GSWS --> Household Migration And Marriage Grounds --> Member Migration On Marriage Grounds అనే సర్వీస్ లో దరఖాస్తు చేస్తారు. ముందుగా భర్త యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన వెంటనే భర్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారు అని పూర్తి వివరాలు అనగా పేరు వారి ఆధార్ చివరి 4 అంకెలు వయసు లింగము వంటి వివరాలు వస్తాయి. తర్వాత భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే భార్య పేరు ఆధార చివర నాలుగు అంకెలు వయసు జెండారు హౌస్ హోల్డ్ ఐడి వంటి వివరాలు వస్తాయి. తర్వాత పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్పు చేయాలని అడుగుతుంది పిల్లలతో కలిసి తల్లి ఉన్నట్టయితే అదే భారీ ఉన్నట్టయితే ఒకేసారి మార్పు చేయవచ్చు. తర్వాత సంబంధిత అధికారులు భర్త మరియు భార్య సచివాలయంలో అందుబాటులో ఉన్నట్టయితే బయోమెట్రిక్ ద్వారా లేదా ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్టయితే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసి వివాహమైన తేదీ వివాహమైన స్థలము నమోదు చేసి పైన చెప్పిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తారు.
వెంటనే దరఖాస్తు సంబంధిత పంచాయతీ కార్యదర్శి వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. అదే వార్డులో అయితే వార్డ్ అడ్మిన్స్ సెక్రటరీ వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. వారు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే వారి లాగిన్ లో ఆమోదం తెలిపే సంబంధిత MPDO / MC వారి లాగిన్ కు ఫార్వర్డ్ చేస్తారు. MPDO / MC వారి లాగిన్ లో ఆమోదం తెలిపినట్లైతే అక్కడనుండి 24 గంటల తర్వాత భార్య భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడ్ అవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత ?
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో భార్యా భర్త యొక్క మ్యాపింగ్ లోకి ఆడ్ అవ్వడానికి దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి ఫీజు ఉండదు. పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే ప్రింట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి చార్జి లేకుండానే ఈ సర్వీస్ ని మీరు పొందవచ్చు. ఈ సర్వీసు పూర్తిగా ఉచితం.
హౌస్ మ్యాపింగ్ మారిందని ఎలా తెలుసుకోవాలి?
హౌస్ మ్యాపింగ్ మార్పు కొరకు దరఖాస్తు చేసిన తర్వాత మీకు రసీదు ఇవ్వటం జరుగుతుంది. హౌస్ మ్యాపింగ్ మారిందా లేదా అని తెలుసుకునేందుకుగాను మీరు భర్త ఏ గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉంటున్నారో ఆ సచివాలయంలో ఎవరైనా సరే సచివాలయ సిబ్బందిని మీరు కాంటాక్ట్ అయినట్లయితే సంబంధిత అధికారులు వారి GSWS Employees App లొ భర్త ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తే ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకుని భర్త ఏ మ్యాపింగ్ లో ఉంటే హౌస్ హోల్డ్ ఓపెన్ చేసినట్లయితే భార్య పేరు కనిపిస్తే మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్టు.
హౌస్ మ్యాపింగ్ చేసుకోకపోవడం వలన వచ్చిన ఒక సమస్య ? [ Case Study ]
ఒక మహిళ వివాహమైన తర్వాత భర్త ఇంటి వద్దకు హౌస్మాపింగ్ మార్పు చేసుకోలేదు. తను వారి కన్నవారి ఇంట్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంది. కానీ వ్యక్తి మాత్రం అత్తవారింట్లో ఉంటుంది. పిల్లలు కూడా కలిగారు. వారి కన్నవారి ఇంట్లో వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తుంది. దురదృష్టవశాత్తు వారి భర్త మరణించారు. ఆవిడకు వితంతు పెన్షన్ దరఖాస్తు చేస్తుంటే హౌస్ మాపింగ్ లో ఇద్దరూ పెన్షన్ దారులు ఉన్నందున పింఛను ఇవ్వటం కుదరదు అని వస్తుంది. అలా అని అత్తవారింటికి హౌస్ మాపింగ్ మార్పు చేద్దాము అంటే భర్త మరణించారు మరియు అతని మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదు. ఈ సమస్య వలన అంటే వివాహమైన వెంటనే హౌస్ మ్యాపింగ్ పూర్తి చేసుకోకపోవడం వలన ఆవిడ ప్రభుత్వం ద్వారా ఆవిడకి రావాల్సిన వితంతు పింఛన్ను కోల్పోయింది. అందరికీ ఇలా సమస్యలు వస్తాయని కాదు కానీ జాగ్రత్త పడడం మంచిది.