Aadhaar Card Address Update with Self Declaration Form via HOF
Aadhaar Card Address Update : ఆధార్ కార్డులో అడ్రస్ ను ఎవరికి వారు సొంతంగా మొబైల్ లోనే కేవలం Rs.50/ తో అప్డేట్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకు, పెద్దలకు, కొత్తగా పెళ్లయిన మహిళలకు వారి అత్తవారింటి అడ్రస్ మార్చుకోవాలన్న, జిల్లాలు మారిన వారికి అడ్రస్ మార్చుకోవాలన్న , తాత్కాలికంగా వలసలో ఉంటూ అక్కడికి ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలన్న , అడ్రస్ సెక్షన్ లో ఇంటికి నెంబరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, వీధి పేరు లేదా ల్యాండ్ మార్క్ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా గ్రామము లేదా ఏరియా పేరు తప్పుగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డులో అడ్రస్ ను సొంతంగా ఆన్లైన్లో రెండు విధాలుగా మార్చుకోవచ్చు. ఒకటి సరైన ప్రూఫ్ ను డాక్యుమెంట్ గా అప్లోడ్ చేస్తూ, రెండు కుటుంబ పెద్ద ధ్రువీకరణతో కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
Document Based Aadhaar Card Address Update
ఇక్కడ డాక్యుమెంట్స్ తో అంటే ఏదైనా సరే ఆధార్ అడ్రస్ ప్రూఫ్
- బ్యాంకు పాస్ బుక్
- దివ్యంగుల కార్డు
- కరెంటు బిల్
- గ్యాస్ కనెక్షన్ బిల్
- లేబర్ కార్డు
- ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
- భారత పాస్ బుక్
- లైఫ్ / మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
- మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్
- మ్యారేజ్ సర్టిఫికెట్ With పాత POI డాక్యుమెంట్ ( మ్యారేజ్ సర్టిఫికెట్ పై ఫోటో లేకపోతే)
- ఆస్తి పన్ను రసీదు
- రేషన్ కార్డు / e రేషన్ కార్డు
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC)
- రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
- ఓటర్ ఐడి
- వాటర్ బిల్
- ఆధార్ డాక్యుమెంట్ - గ్రామా సర్పంచ్ / పంచాయతీ సెక్రటరీ / గ్రూప్ A / గెజిట్ ఆఫీసర్ వారి ఆమోదం తో (పైవి ఏవి లేని పక్షాన)
పైన ఇచ్చిన ఏ డాక్యుమెంట్ ఉన్నా సరే, ఆధార్ కార్డులో అడ్రస్ ను అప్డేట్ చేసుకోవచ్చు కానీ అడ్రస్ అప్డేట్ చేసుకునేందుకు పైన ఇచ్చిన డాక్యుమెంట్లో తప్పనిసరిగా పూర్తి చిరునామా ఉండాలి మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు అడ్రస్ గ్రూపులో ఉన్న పేరు సరిగా మ్యాచ్ అవ్వాలి. పై డాక్యుమెంట్స్ ఏవి లేని వారు కూడా వారి గ్రామ సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా మండల స్థాయి జిల్లాస్థాయి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగుల వారి ధ్రువీకరణతో కూడా ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు.
HOF-Based Aadhaar Card Address Change Online
ఇప్పుడు కుటుంబ పెద్ద ధ్రువీకరణతో ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా మార్చుకోవాలో పూర్తి ప్రాసెస్ చూద్దాం . ఉదాహరణకు కొత్తగా వివాహమైన మహిళ చిరునామా గతంలో వారి కన్నవారి ఇంటిది ఉంటుంది వివాహమైన తర్వాత వారి భర్త వారి ఇంటి చిరునామాకు అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారికి ఉదాహరణతో సహా ఎక్కడ చూపించడం జరుగుతుంది.
Requirements for HOF-Based Aadhaar Card Address Change
వివాహమైన మహిళ అడ్రస్ మార్చుకునేందుకు కావాల్సినవి
- భర్తకు, భార్యకు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉండాలి.
- అప్లికేషన్ ఫారం ముందుగానే ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి భర్త సంతకం చేయాలి. Self Declaration Form For HOF Address Sharing అని పిలుస్తారు .
- 50 రూపాయలు ఫీజు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి.
- భార్య మరియు భర్త ఆధార్ కార్డులు పనిచేస్తూ ఉండాలి , అంటే యాక్టివ్గా ఉండాలి.
Check Aadhaar - Mobile Number Link Status Online
ముందుగా ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్లు లింకు ఉన్నాయో తెలుసుకునేందుకు కిందపడిన లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన
Aadhaar Mobile Number Link Status
తర్వాత ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి పక్కనే ఉన్న క్యాప్ చాక్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు చివరి మూడు అంకెలు చూపిస్తాయి.
వాటి ఆధారంగా ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లో సొంతంగా చేయాలి అంటే తప్పనిసరిగా అక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండి తీరాల్సిందే, ఎందుకంటే OTP ఆ మొబైల్ కి వస్తుంది. వాటిని ఎంటర్ చేస్తేనే మనకి ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా భర్త మరియు భార్య ఇద్దరు ఆధార్ కార్డులు ఎంటర్ చేసి మొబైల్ నెంబర్లు ఏవి లింక్ ఉన్నాయో తెలుసుకోవాలి. అక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్ మనవద్ద ఉన్నాయని ధ్రువీకరించుకున్న తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ ని ప్రారంభించండి అక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్ మన దగ్గర లేకపోయినా లేదా మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఇక్కడితో ఆపేయండి ఎందుకంటే మొబైల్ నెంబర్ లింక్ లేకుండా ఈ ప్రాసెస్ లో మనం సొంతంగా అడ్రస్ అప్డేట్ చేసుకోలేము. మొబైల్ నెంబర్ లింక్ లేనివారు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో అడ్రస్ ని అప్డేట్ చేసుకోవాలి.
Self Declaration Form For HOF Address Sharing
అడ్రస్ అప్డేట్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ఇవ్వటం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
Download Self Declaration Form
డౌన్లోడ్ చేసుకున్న, Black & White లో ప్రింట్ తీసుకోండి తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా ఫీల్ చేయండి.
అన్ని వివరాల కూడా తప్పులు లేకుండా, క్యాపిటల్ లెటర్లో, దిద్దుబాట్లు లేకుండా, వైట్ నర్ వాడకుండా, English Capital Letters లొ జాగ్రత్తగా ఫీల్ చేయాలి.
1 👉 భర్త ఆధార్ కార్డులో ఉన్న పూర్తి పేరు
2 👉 భర్త ఆధార్ కార్డు లో ఉన్న పూర్తి చిరునామా.
3 👉 భర్త ఆధార్ కార్డు నెంబరు
4 👉భార్య పేరు ఆధార్ కార్డు లో ఉన్నట్టు
5 👉భార్య ఆధార్ కార్డు నెంబరు
6 👉 భర్తకు భార్య ఏమవుతుందో రిలేషన్ [ WIFE ]
7 👉 భార్య పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టు
8 👉 భార్య పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టు
9 👉 భర్త పేరు ఆధార్ కార్డులో ఉన్నట్టు రాస్తూ కింద భర్త సంతకం చేయాలి.
10 👉 అప్లికేషన్ రాస్తున్న తేదీ
రాసిన అప్లికేషన్ ఒక సారి చుడండి .
How to Change Aadhaar Address Online with HOF Self Declaration Form : Step-by-Step Process
Step 5 :(HOF) Based Address Update పై క్లిక్ చేయాలి.
Step 6 :ప్రస్తుత అడ్రస్ చూపిస్తుంది. Details of HoF Required for Update లొ కుటుంబ పెద్ద అనగా భర్త ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Select HoF's Relation with the Applicant లొ దరఖాస్తు దారునితో కుటుంబ పెద్ద సంబంధం - Spouse ఎంచుకోవాలి.
Step 7 : Select Valid Document లొ Self-declaration as per notified format for HoF based Address update (To be used only for address update of immediate family member / members of HoF) డాక్యుమెంట్ ను ఎంచుకోవాలి.
Step 8 : PDF రూపం లొ ఒరిజినల్ ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. Next పై క్లిక్ చేయాలి.
Step 9 : పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. Payment Rules పై టిక్ చేసి RazorPay పై క్లిక్ చేయండి. Make Payment పై క్లిక్ చేయండి.
Step 10 : Pay With UPI QR అని స్కాన్ చూపిస్తుంది.
Step 11 : ఆ స్కాన్ ను మీ వద్ద ఉన్న PhonePay / GooglePay / PayTM / BHIM / Any Other App తో స్కాన్ చేయండి. బ్యాంకు అకౌంట్ సెలెక్ట్ చేసుకోని UPI నెంబర్ ద్వారా పేమెంట్ చేయండి.
Step 12 : Payment Completed అని సందేశం వస్తుంది.
Step 13 : మరలా బ్యాక్ కు వచ్చి చుస్తే Download Acknowledgment చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి .
Step 14 : అందులో ఉండే SRN నెంబర్ ద్వారా స్టేటస్ ను ఆధార్ నమోదు / అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానం - Click Here ద్వారా తెలుసుకోవచ్చు.