AP Pension FAQs 2025: Key Appeals & Deadline Info
1. సెప్టెంబర్ 2025 నెల పింఛన్ పంపిణీలో పింఛను రద్దు ఎవరికి అవ్వనుంది ?
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులో సదరం శాతం 40 కన్నా తక్కువ ఉన్నప్పటికీ అప్పీల్ చేసుకొని వారికి సెప్టెంబర్ 2025 నెలలో పింఛను రద్దు అవ్వనుంది.
2. పింఛను రద్దు అవ్వకూడదు అంటే ఏం చేయాలి?
సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించి పింఛను రద్దు అవకూడదు అంటే నోటీసు అందుకున్న అందరూ కూడా తప్పనిసరిగా అప్పిల్కు దరఖాస్తు చేసుకోవాలి.
3. అప్పీల్ ఎక్కడ చేసుకోవాలి?
గ్రామాల్లో ఉన్న వారు సంబంధిత మండల ఎంపీడీవో వారి ఆఫీసులో మునిసిపాలిటీలో ఉన్నవారు లేదా వార్డులో ఉన్నవారు సంబంధిత మున్సిపల్ కమిషనర్ వారి ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.
4. అప్పీల్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎంత ?
ఆన్లైన్ సదుపాయం ఉన్న ఏరియాలలో ఆగస్టు 30 సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్లైన్ ఏరియాలలో ఆగస్టు 29 సాయంత్రం 5 వరకు మాత్రమే ఈ అర్జీలు స్వీకరణ జరుగును.
5. ప్రభుత్వం కల్పించిన నోటీసు నందు సదరం శాతం 40 కన్నా ఎక్కువ ఉంటూ ప్రస్తుతం పొందుతున్న వికలాంగుల పింఛను నుండి వృద్ధాప్య పింఛనుకు మారినట్లు కనిపిస్తే వారు అప్పీల్ చేసుకోవాలా ?
ఆపిల్ చేసుకోకపోతే వారికి వికలాంగుల పింఛన్ నుండి వృద్ధాప్య పింఛనుకు మార్పు జరుగును అంటే 6000 పింఛను 4000 పింఛనుగా మార్పు జరుగును. అప్పీల్ చేసుకుంటే మంచిది.
6. అసలు అప్పీల్ అంటే ఏంటి ?
అప్పీల్ అంటే అర్జీ పెట్టుకోవడం అని అర్థం.
7. అర్జీ పెట్టుకోవడానికి ఏం కావాలి ?
ప్రభుత్వం ఇచ్చిన నోటీసు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మెడికల్ రిపోర్టులు పాతవి ఉంటే వాటి జిరాక్స్లు పాత సదరం సర్టిఫికెట్ అందుబాటులో ఉంటే వాటి జిరాక్స్ తో ఒక లెటర్ రాస్తూ పైన చెప్పిన అధికారులకు అర్జీ నమోదు చేసుకోవాలి అర్జీ పెట్టుకోవాలి.
8. కొత్త సదరం సర్టిఫికెట్ ఎక్కడ పొందాలి ?
ఎవరైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసు ఆధారంగా మెడికల్ పింఛన్దారులకు ఇంటివద్ద వికలాంగుల పింఛన్దారులకు ఆసుపత్రిలో రీ అసెస్మెంట్ జరిగింది. రీ అసెస్మెంట్లో డాక్టర్ వారి రికమండేషన్ ప్రాప్తికి వారి వారి గ్రామ లేదా వార్డు సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు రావటం జరిగింది.
9. కొత్త సదరం సర్టిఫికెట్ లో ఎంత శాతం ఉంటే పించను వస్తుంది ?
కొత్తగా విడుదల అయిన సదరం సర్టిఫికెట్లో తప్పనిసరిగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. అప్పుడే వారికి వైకల్య లేదా మెడికల్ పింఛన్లు ఒకటి వస్తుంది.
10. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటూ తాత్కాలిక సర్టిఫికెట్ వస్తే వారి పరిస్థితి ఏమిటి? పెన్షన్ రద్దు అవుతుందా?
పెన్షన్ రద్దు అవదు యధావిధిగా పెన్షన్ కంటిన్యూ అవుతుంది.
11. 15వేల రూపాయలు పించను పొందుతున్న మెడికల్ పింఛన్దారులకు కొత్త సదరం సర్టిఫికెట్ నందు ఎంత శాతం వస్తే మెడికల్ పింఛను యధావిధిగా కొనసాగుతుంది ?
85% కంటే ఎక్కువ వస్తే మెడికల్ పింఛను యధావిధిగా కొనసాగుతుంది.
12. గతంలో 15 వేల రూపాయల మెడికల్ పింఛన్ తీసుకుంటున్న వారికి కొత్త సదరం సర్టిఫికెట్ నందు 40 శాతం కంటే ఎక్కువ 85% కంటే తక్కువ సదరం శాతం వస్తే వారికి ఏ పెన్షన్ వస్తుంది ?
వారి పించను వైకల్య పింఛనుగా మార్పు జరిగి 15000 రూపాయలకు బదులు 6000 రూపాయల పింఛను వస్తుంది.
13. మెడికల్ పింఛను తీసుకుంటున్న వారికి సదరం శాతం 40 కన్నా తక్కువ వస్తే వారి పింఛను ఏమవుతుంది ?
వారి పించను రద్దు అవుతుంది. అదే మెడికల్ పింఛన్దారుని యొక్క వయసు వృద్ధాప్య పింఛను అర్హులైతే వృద్ధాప్య పింఛన్ గా మార్పు జరుగుతుంది 15000 రూపాయలకు బదులు నాలుగువేల రూపాయల పింఛను అందుతుంది. అదే ఇతర వృత్తిపరమైన పింఛనుకు అర్హులైతే ఆయా పింఛన్లు వస్తాయి.
14. వికలాంగుల పింఛను పొందుతున్న వారి సదరం శాతం 40 కంటే తక్కువ ఉంటూ వృద్ధాప్య పింఛన్కు అర్హులైతే వారి పింఛను ఏమవుతుంది ?
వృద్ధాప్య పింఛనుగా మార్పు జరిగి ఆరువేల రూపాయలకు బదులు నాలుగువేల రూపాయలు పెన్షన్ నగదు అందుతుంది.
15. ప్రభుత్వం అందించిన నోటీసు అందుకున్న వారిలో ఎవరైనా వితంతువులు ఉంటే వారి సంగతేమిటి వారికి పింఛను రద్దు అవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా ?
నోటీసులు అందుకున్న వారిలో సదరం శాతం 40 కంటే తక్కువ ఉంటూ వితంతువులు ఉన్నట్లయితే వారి పింఛను మెడికల్ లేదా వైకల్య పింఛన్ నుండి వితంతు పింఛనుగా మార్పు చెందుతుంది దీనికి తప్పనిసరిగా దరఖాస్తుదారులు వారి గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకొని సంబంధిత మండలా లేదా మున్సిపల్ ఆఫీసులో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
16. నోటీసు అందిన తరువాత పింఛను మార్పు లేదా రద్దుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఎక్కడ అర్జీ పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది ?
అర్జీను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత మరల ఆసుపత్రి లేదా ఇంటి వద్ద రీ అసెస్మెంట్ కొరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నోటీసు అందుతుంది ఆయా నోటీసులో ఇచ్చిన తేదీ సమయం నాటికి ఆసుపత్రికి లేదా ఇంటి వద్ద సంబంధిత పింఛన్దారులకు మరల అసెస్మెంట్ జరిగి కొత్త సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది ఆ సర్టిఫికెట్ లో ఉన్న సదరం ప్రకారం పెన్షన్ అనేది కంటిన్యూ రద్దు రకము మార్పు జరుగుతుంది.
17. ఎంత శాతం ఉంటే ఎంత పెన్షన్ వస్తుంది?
వైకల్య పింఛల్లో భాగంగా 40 నుండి 100% మధ్య ఉన్నవారికి వికలాంగుల పింఛను 6000 రూపాయలు, మెడికల్ పింఛల్లో భాగంగా 40 నుండి 85% మధ్య ఉన్న మెడికల్ పింఛన్దారులకు 6000 పింఛను, 85% కంటే ఎక్కువ ఉన్నవారికి 15 వేల రూపాయల పెన్షన్ అందును.
18. పించను నోటీసు సదరం సర్టిఫికేట్ పించను రద్దు వీటిపై సమస్యలు ఉంటే మొదట ఎవరికీ అడిగి తెలుసుకోవాలి ?
పించని నోటీసుపై గాని లేదా సదరం సర్టిఫికెట్ పై గాని లేదా ఇతర పెన్షన్ కు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధికారులను మీరు కాంటాక్ట్ అవ్వండి అక్కడ నుండి వారి ద్వారా మండల లేదా మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
19. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పెన్షన్లు కోసం దరఖాస్తు ఓపెన్ చేసిందా?
కొత్త పెన్షన్ల కోసం ఈ పోస్టు రాసిన సమయానికి ఎటువంటి కొత్త ఆప్షన్ ప్రభుత్వం కల్పించలేదు. కేవలం పెన్షన్ పొందుతూ భర్త చనిపోయినట్లయితే భార్యకు వితంతు పెన్షన్ మాత్రమే ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుంది మరే ఇతర పెన్షన్లకు దరఖాస్తు తీసుకోవడం లేదు.
20. నోటీసు అందిన ఎన్ని రోజులలోపు అర్జీ నమోదు చేసుకోవాలి ?
నోటీసు అందిన 30 రోజులలోపు అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే మొదటి విడతలో ఆగస్టు నెలలో నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 30 తారీకు లోపు అర్జీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్జీ నమోదు చేసుకున్న వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పైన చెప్పిన రూల్స్ ప్రకారం కాకుండా అందరికీ పెన్షన్ రావడం జరుగుతుంది. అయితే అర్జీ నమోదు చేసుకోవడం తప్పనిసరి.
21. ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తున్న నోటీసును పింఛనుదారుడు నిరాకరిస్తే ఏమవుతుంది ?
అలా నిరాకరిస్తే పెన్షన్ హోల్డ్ లోకి వెళ్తుంది అంటే మరుసటి నెల నుండి వచ్చే పెన్షన్ ఆగిపోతుంది అలా అని రద్దు అవదు. అలా మరోసారి చేస్తే అప్పుడు రద్దు అవుతుంది.
22. ప్రభుత్వం రీసెస్మెంట్ కోసం గతంలో ఇచ్చిన నోటీసు అందుకొని వారి పరిస్థితి ఏమిటి ?
గతంలో వివిధ కారణాల వలన వి అసెస్మెంట్ నోటీసు అందుకొని వారికి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు గ్రామ వార్డు సిబ్బంది ద్వారా అందిస్తుంది. నోటీసులో ఇచ్చిన తేదీ సమయం ఆసుపత్రికి రీ అసెస్మెంట్ కొరకు పింఛన్దారుడు వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది ఆ సదరం శాతం ప్రకారం పెన్షన్ రద్దు పెన్షన్ రకము మార్పు పెన్షన్ యధావిధిగా కొనసాగింపు అనేది జరుగుతుంది.
Answar
ReplyDelete