అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా? పరిష్కారం ఇదే! | Annadata Sukhibhava Status Check 2026 AP

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా? పరిష్కారం ఇదే! | Annadata Sukhibhava Status Check 2026 AP

AP Annadata Sukhibhava Grievance Redressal Guide 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఒక భారీ అప్‌డేట్ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava Scheme) పథకం కింద మూడవ విడత నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ (PM Kisan) కింద ఇచ్చే రూ. 2,000 మరియు ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద అందించే రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి జమ అయ్యాయి.

ఈ నెల 13న నిధులు విడుదల చేయడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి రైతుకు అందాల్సిన రూ. 20,000 మొత్తం జమ పూర్తయింది. ఎన్నికల హామీ మేరకు ఏడాదికి రూ. 20,000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇప్పటికీ నిధులు జమ కాని రైతుల కోసం అధికారులు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు.

Annadata Sukhibhava Status Check Online 2026

ప్రభుత్వం మొత్తం 6.85 లక్షల మంది రైతులకు ఈ విడతలో నిధులను రిలీజ్ చేసింది. మీ ఖాతాలో నగదు జమ అయిందో లేదో తెలుసుకోవడానికి Annadata Sukhibhava Website అందుబాటులో ఉంది. స్టేటస్ చెక్ చేయడానికి క్రింది పద్ధతిని అనుసరించండి:

ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Status):
1. అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజీలో "Know Your Status" ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3. మీ Aadhar Number మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
4. సెర్చ్ బటన్ పై క్లిక్ చేయగానే మీ పేమెంట్ వివరాలు మరియు e-KYC Status కనిపిస్తాయి.

Annadata Sukhibhava Ineligible Reasons List

పథకానికి అర్హత ఉన్నా కూడా క్రింద పేర్కొన్న 10 కారణాల వల్ల చాలా మంది రైతులకు నిధులు నిలిచిపోయాయి. అవేంటో ఒకసారి సరిచూసుకోండి:

క్రమ సంఖ్య అనర్హతకు గల కారణాలు (Ineligibility Factors)
01ఈకేవైసీ (e-KYC) పూర్తి చేయని రైతులు
02భూమి యజమానులు మరణించి, రికార్డుల్లో పేరు మార్పు జరగకపోవడం
03వారసులకు కొత్త పాసుపుస్తకాలు జారీ కాకపోవడం
04భూమికి ఆధార్ లింకింగ్ (Aadhaar Seeding) సమస్యలు
05ఎన్‌పీసీఐ (NPCI) అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం
06వ్యవసాయేతర భూములు (అక్వా సాగు, నిర్మాణాలు ఉన్న స్థలాలు)
07ప్రస్తుత లేదా మాజీ ప్రజాప్రతినిధులు
08నెలకు ₹20,000 కంటే ఎక్కువ జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగులు
0910 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు
10మైనర్‌ల పేరిట ఉన్న భూములు

16 Payment Problems and Solutions for Farmers

రైతులకు మొదటి విడత లేదా మూడవ విడత నగదు క్రెడిట్ అవ్వకపోతే, ఏ సమస్యకు ఏ పరిష్కారం చేయాలో ఇక్కడ సమగ్రంగా వివరించబడింది:

1. Name Correction (పేరు సవరణ)

1B రికార్డులోని పేరుకు, ఆధార్ కార్డులోని పేరుకు స్పెల్లింగ్ తేడా ఉంటే డబ్బులు పడవు. దీనికి సచివాలయంలో "Mutation For Correction" ద్వారా దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ లాగిన్‌లో ధృవీకరణ జరగాలి.

2. Wrong Aadhaar Seeding

వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే.. సచివాలయం లేదా మీ-సేవలో "Pattadar Aadhaar Seeding" సర్వీస్ ద్వారా VRO/MRO ధృవీకరణ పొందాలి.

3. Institutional Pattadar Names

వ్యక్తిగత రైతు పేరు కాకుండా గుడి, సంస్థల పేర్లు ఉంటే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ వారు రిజెక్ట్ చేస్తారు. ఇవి "Reason for Rejection" కిందకు వస్తాయి.

4. Joint Khata Problems

భూమి పంచుకున్నా ఒకరి ఆధార్ మాత్రమే సీడ్ అయితే, తహసీల్దార్ గారు వెరిఫై చేసి "Joint Khata" ఆప్షన్ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది.

5. Non-Agricultural Activity

పొలంలో ఇళ్లు కట్టినా లేదా ఆక్వా సాగు చేస్తున్నా "Non-Agriculture Activity" కింద నిధులు నిలిపివేస్తారు.

6. Permanent Migration

రైతు శాశ్వత వలస వెళ్తే తహసీల్దార్ లాగిన్‌లో "Forward to MAO" ఆప్షన్ ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది.

7. Notional Khata & Wrong Aadhaar

నోషనల్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉంటే, జాయింట్ కలెక్టర్ (JC) గారి ద్వారా "Suo-moto Module" ఉపయోగించి సరిచేయాలి.

8. Unseeded Aadhaar Numbers

ఆధార్ సీడింగ్ అవ్వని వారు వెంటనే రైతు సేవా కేంద్రంలో ఆధార్ నెంబర్ ఇచ్చి లింక్ చేయించుకోవాలి.

9. Deceased Aadhaar to Active Khata

చనిపోయిన వారి ఆధార్ వేరే ఖాతాకు లింక్ అయితే.. సచివాలయంలో "Fresh Aadhaar Seeding" చేయాలి.

10. Pattadar Deceased

రైతు చనిపోతే వెంటనే వారసులు Mutation చేయించుకుని తమ పేరుపై భూమి మార్చుకోవాలి.

11. Succession Disputes

కోర్టు కేసులు లేదా వారసత్వ తగాదాలు ఉంటే ఆ సమస్య క్లియర్ అయ్యే వరకు పేమెంట్ రాదు.

12. Ineligible (అనర్హులు)

అర్హత ఉండి కూడా అనర్హులు అని వస్తే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అధికారులకు అర్జీ పెట్టుకోవాలి.

13. NPCI Inactive (ముఖ్యమైనది)
పరిష్కారం: వెంటనే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ బేస్డ్ కొత్త ఖాతా తెరవండి లేదా మీ బ్యాంకులో NPCI సీడింగ్ చేయించండి.
14. eKYC Not Done

చాలా మందికి గత బయోమెట్రిక్ ఆధారంగా eKYC అయిపోతుంది. కానీ పెండింగ్ ఉంటే రైతు సేవా కేంద్రంలో పూర్తి చేయాలి.

15. One Credited Other Not

పీఎం కిసాన్ పడి, అన్నదాత సుఖీభవ పడకపోతే 10 రోజులు వెయిట్ చేయాలి. అప్పటికీ రాకపోతే ఆన్‌లైన్ రిమార్క్స్ చెక్ చేయాలి.

16. Eligible But Not Credited

ఏ సమస్య లేకపోయినా డబ్బులు రాకపోతే రైతు సేవా కేంద్రంలో కొత్తగా అర్జీ (New Grievance) పెట్టుకోవాలి.

How to Raise Grievance at Raithu Seva Kendram

నిధులు జమ కాని రైతులు తమ గ్రామ వ్యవసాయ కార్యదర్శిని (VAA) కలవాలి. వెళ్లేటప్పుడు క్రింది పత్రాలు వెంట తీసుకెళ్లండి:

  • రైతు ఆధార్ కార్డు (Aadhaar Card)
  • పట్టాదారు పాసుబుక్ లేదా ROR 1B జిరాక్స్
  • బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్

 పరిష్కారమైన వారికి త్వరలోనే నగదు జమ అవుతుంది.

Annadata Sukhibhava Scheme FAQs

Post a Comment

5 Comments
  1. Kuruva knagareddy

    ReplyDelete
    Replies
    1. Anadhatha sukibhava pads ledhu sir

      Delete
  2. Sir my wife is eligible for annadata sukhibhava scheme as per your guidelines, already given greviane in local rbk, still remark shows as you are not in gsws survey, si you are not eligible for credit.. but no body has enquired us before starting of scheme before release of first installment release.. after that we have done gsws survey and e kyc both offline and online.. but still you are not considered for eligibility.. so we request you please do justice as soon as possible

    ReplyDelete
  3. Annadata Suchi Bhavana No

    ReplyDelete
  4. hi sir my mother is eligible for annadata sukhibhava scheme
    frist installment released in my account
    but second & third installment realeased in another account but this account is not linked to my family members how to refund to my account

    ReplyDelete