SGSW Department Grievance Redressal Mechanism
రాష్ట్రంలోని ప్రతి అర్హులైన విద్యార్థికి పథకం ప్రయోజనాలు అందాలనే లక్ష్యంతో స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు (SGSW) డిపార్ట్మెంట్ ప్రత్యేక ఆన్లైన్ డాష్బోర్డ్లను (Online Dashboards) సిద్ధం చేసింది. విద్యా సహాయం పొందే విషయంలో ఎటువంటి వ్యత్యాసాలు రాకుండా ఉండేందుకు, సకాలంలో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించారు.
ఈ మెకానిజం ద్వారా అభ్యంతరాలు తెలియజేయడం, అర్హతల సవరణ (Eligibility Correction), మరియు నూతన విద్యార్థుల వివరాల నవీకరణను నిర్దేశిత సమయ 4పరిమితిలోగా (Time-Bound Manner) పూర్తి చేయనున్నారు.
తల్లికి వందనం 2026-27 :: అర్హుల / అనర్హుల జాబితా WEA/WWES BM పోర్టల్ నందు Dt. 21/07/2026 నాడు ఎనేబుల్ చేయడం జరిగింది.
Talliki Vandanam / SGSW Beneficiary List Timelines 2026
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, మొత్తం 64,76,590 మంది అర్హులైన విద్యార్థులకు మొదటి విడత ఆర్థిక సహాయం అందించనున్నారు. పథకానికి సంబంధించి విడుదల చేసిన పూర్తి గడువు తేదీలను క్రింది పట్టికలో పరిశీలించవచ్చు.
| క్రమ సంఖ్య (S. No) | కార్యక్రమం (Activity / Task) | సమయ పరిమితి (Timelines) |
|---|---|---|
| 1 | 64,76,590 మంది అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం (Financial Assistance) జమ చేయడం | 22.07.2026 |
| 2 | స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు (SGSW) కార్యాలయాలలో అర్హుల మరియు అనర్హుల జాబితాల (Eligible & Ineligible List) ప్రదర్శన | 21.07.2026 |
| 3 | SGSW కార్యాలయాల్లో అభ్యంతరాలు / ఫిర్యాదుల స్వీకరణ (Receiving Grievances) | 22.07.2026 నుండి 03.08.2026 వరకు |
| 4 | ఫిర్యాదుల పరిశీలన మరియు అనుబంధ అర్హుల జాబితా (Supplementary Eligible List) రూపకల్పన | 04.08.2026 నుండి 10.08.2026 వరకు |
| 5 | 1వ తరగతి & ఇంటర్మీడియట్ (Class-I & Class-XI/Jr.Inter) కొత్త ప్రవేశాలకు చివరి తేదీ | 25.08.2026 |
| 6 | అదనపు అర్హుల 1st Class & Jr. Inter జాబితా మరియు పరిష్కరించిన ఫిర్యాదుల జాబితా ప్రదర్శన | 30.08.2026 |
| 7 | అదనంగా ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ (Disbursal of Funds) | 30.08.2026 |
How to Submit Online Grievance at SGSW Office
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే లేదా ఏవైనా సాంకేతిక సమస్యల (Technical Issues) వల్ల దరఖాస్తు నిలిచిపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందించిన కాలక్రమం ప్రకారం జూలై 22 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మీ సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాన్ని సందర్శించి రాతపూర్వక అభ్యంతరం సమర్పించవచ్చు.
- మీ రేషన్ కార్డ్ (Ration Card), ఆధార్ కార్డ్ (Aadhaar Card) మరియు బ్యాంక్ పాస్బుక్ ప్రతులను జతచేయాలి.
- విద్యార్థి పాఠశాల/కళాశాల ఐడీ కార్డ్ లేదా అడ్మిషన్ రసీదును సమర్పించాలి.
- SGSW సిబ్బంది మీ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి ఆమోదం కోసం పంపుతారు.
New Admissions & Supplementary Eligible List Details
నూతనంగా పాఠశాలల్లో (Class-I) లేదా జూనియర్ కళాశాలల్లో (Jr. Inter) చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఆగస్టు 25, 2026 నాటికి ప్రవేశాలు పూర్తి చేసుకున్న విద్యార్థుల వివరాలను పరిశీలించి, వారిని అదనపు జాబితాలో చేర్చుతారు. ఈ సవరించిన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆగస్టు 30న నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది.



తల్లికి వందనం ఎలా చెక్ చేయాలి
రిప్లయితొలగించండిEligible list
తొలగించండిList
తొలగించండితల్లికి వందనం ఎలా చెక్ చేయాలి
తొలగించండి