AP Seva Portal Bill Desk UPI Payment Process AP Seva Portal Bill Desk UPI Payment Process

AP Seva Portal Bill Desk UPI Payment Process

AP Seva Portal Bill Desk UPI Payment Process


AP Seva Portal Bill Desk UPI Payment Process

సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ ( పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ VI) / వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు అందించు ఈ-సర్వీస్ లా ద్వారా వచ్చిన అమౌంట్ ను పేమెంట్ చెయ్యటానికి సచివాలయం లు ఏర్పాటు అయిన కొత్తలో WALLET సదుపాయం ఉండేది, కానీ అందులో 5000/- రూపాయలు మాత్రమే లిమిట్ ఉండేది దాని వల్ల సెర్వుస్ లు ఇవ్వటం లో చాలా ఇబ్బందులు వచ్చేవి. తరువాత వాలెట్ ను తీసివేసి UPI/ ICICI చలానా ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. వీటిలో లిమిట్ లేక పోయినప్పటికి పేమెంట్ విషయం లో అందరికి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ లేక పోవటం, సచివాలయం కు బ్యాంకు చాలా దూరం లో ఉండటం, మహిళా పోలిస్ వారు అందుబాటులో లేక పోవటం ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పై విషయాలను అదిగమించటానికి ప్రభుత్వం వారు Bill Desk Payment ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఇందులో Credit Card,Debit Card, Internet Banking,Wallet / Cash Cards, QR, UPI ఆప్షన్స్ ఉంటాయి. అందులో UPI పేమెంట్ ఆప్షన్ ద్వారా త్వరగా పేమెంట్ అవుతుంది మరియు కచ్చితం గా అవుతుంది.


Bill Desk UPI Payment Process

  1. UPI ద్వారా పేమెంట్ చెయ్యు విధానం లో భాగం గా మొదట GSWS అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి. Login ఆప్షన్ పై క్లిక్ చేసి డిజిటల్ అసిస్టెంట్ ( పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ VI) / వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ ID & పాస్వర్డ్ ఎంటర్ చేసి "LOGIN NOW" పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
  2. హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది అందులో పైన మెనూ బార్ లో ఉండే "services" అనే ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి. Bill Desk Payment ద్వారా పేమెంట్ చేయుటకు "Pay Amount - Servicesఅనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 
  3. ఒక వేల పేజీ ఓపెన్ చేసి ఎక్కువ సేపు అయితే పేజీ Refresh చేసి క్లిక్ చేయాలి లేదంటే తరువాత పేజీ ఓపెన్ అవ్వదు.తరువాత top లో ఉండే "SERVICES WISE CHALLAN GENERATION" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  4. ఈ-సర్వీస్ వివరాలు,అమౌంట్ వివరాలు, మొత్తం అమౌంట్ సరి చూసుకొని "ONLINE BILL DESKఅనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.Bill Desk హోమ్ పేజీ చూపిస్తుంది. అందులో Credit Card,Debit Card, Internet Banking,Wallet / Cash Cards, QR, UPI ఆప్షన్స్ ఉంటాయి.
  5. అందులో UPI అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత BHIM అనే ఆప్షన్ దగ్గర tick చేయాలి. తరువాత "Make Payment" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ పేమెంట్ రద్దు చేయాలి అంటే Cancel అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.మొత్తం అమౌంట్ చూపిస్తుంది, చూపిస్తున్న అమౌంట్ అకౌంట్ లో ఉందొ లేదో సరి చూసుకొని పేమెంట్ ప్రాసెస్ మొదలుపెట్టాలి.
  6. Merchant Name : APGVWVVSWS అని వస్తుంది దాన్ని,అమౌంట్ సరిచేసుకొని Enter Your UPI ID/VPA అని చూపిస్తున్న దగ్గర UPI ID ఎంటర్ చేయాలి. "Make Payment" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  7. Phone pay లేదా Google Pay లో profile ఆప్షన్ లో Your UPI ID లో లేదా Payment Methods ఆప్షన్ లో Account Number పై క్లిక్ చేస్తే UPI ID చూపిస్తుంది.
  8. Phone pay లేదా Google Pay ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ లో అమౌంట్ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది అందులో "PAY" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి UPI PIN ఎంటర్ చేయాలి. పేమెంట్ పూర్తి అయ్యే వరకు అప్లికేషన్ క్లోజ్ చెయ్యకూడదు.
  9. తరువాత amount,transaction ID,Transaction Date, Status Remarks అనే ఆప్షన్స్ తో రసీదు చూపిస్తుంది. Cntl+P ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవాలి. తరువాత Click Here to Proceed Further లో Here అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
  10. పేమెంట్ dashboard ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేసిన ట్రాన్సక్షన్ విజయవంతం అయి నట్టు చూపిస్తుంది. అందులో Mode of Payment Bill desk గమనించగలం.