AP Seva Portal Challan Payment Process AP Seva Portal Challan Payment Process

AP Seva Portal Challan Payment Process

AP Seva Portal Challan Payment Process


AP Seva Portal ICICI Challan Payment Process

గ్రామ వార్డు సచివాలయాల్లో PS Gr-VI(DA) / WEDPS అందించే ఈ - సర్వీసులలో ఎక్కువ భాగం ఫీజు తో ముడిపడేవే. వాటిని చలానా రూపంలో లో జనరేట్ చేసి ప్రభుత్వం వారికి జమ చెయ్యాలి. కలెక్ట్ చేసిన వాటిలో ముందుగా తక్కువలో తక్కువ మధ్యాహ్నం 2 గంటల లోపు రోజుకు ₹500/- జమ అయినచో ఆ రోజు రుసుమును ప్రభుత్వానికి జమ చెయ్యాలి అని ప్రభుత్వం నియమం విధించింది. ఇక్కడ Panchayat Secretary Gr VI ( Digital Assistant ) / WEDPS చలానా ను మూడు విధాలుగా పేమెంట్ చెయ్యవచ్చు. మొదటిది ICICI Challan Payment ద్వారా పేమెంట్ చేయడం, రొండోది Paytm UPI ద్వారా పేమెంట్ చెయ్యటం, మూడోది Bill Desk UPI ద్వారా పేమెంట్ చెయ్యటం.


AP Seva Portal Challan Payment Process

మొదటిది అయిన ICICI Challan Payment లో  ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా నేరుగా బ్యాంకు కు వెళ్లి పేమెంట్ చేసే విధానం లో భాగం గా మొదటగా గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్ నందు AP Seva Portal లో  Panchayat Secretary Gr VI ( Digital Assistant ) / WEDPS లాగిన్ ను ఓపెన్ చేసిన తర్వాత "Challan Payment" సెక్షన్ పేమెంట్ చేయవల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి . తరువాత Select Payment Mode లో "ICICI Challan Generation" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.



సర్వీసు పేరు సర్వీస్ లో ఇచ్చిన మొత్తం ట్రాన్సాక్షన్ ల సంఖ్య మొత్తం డబ్బులు సరిచూసుకొని "New Challan / UPI Payment"ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


కొత్త ట్యాబ్లో చలానా అనేది చూపిస్తుంది, "PRINT" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి.ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నటువంటి ఏ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా ట్రాన్సాక్షన్ లను పూర్తి చేయవచ్చు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలో తెలుసుకుందాం.

గూగుల్ లో SBI INB అని టైప్ చేసి ఎంటర్ పై క్లిక్ చేయండి. మొదటగా చూపించిన వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క Username, Password, Security Code లను ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.




హోం పేజీలో చూపిస్తున్న టువంటి Payments / Transfer అనే ఆప్షన్ పై క్లిక్ చేసి Quick Transfer అనే ఆప్షన్ ఎంచుకోవాలి. Quick Transfer అనే ఆప్షన్ ద్వారా ఒక ట్రాన్సాక్షన్ కు గరిష్టంగా 25,000 రూపాయలు మాత్రమే పంపించకు వీలవుతుంది.


ఎకౌంటు సెలెక్ట్ చేసుకొని,
Beneficiary Name వద్ద Commissioner GSWS అని టైపు చెయ్యాలి, Beneficiary Account Number దగ్గర చలానా లో ఉండే Account Number ఎంటర్ చేయాలి. Re-enter Beneficiary Account Number వద్ద మరలా చలానా లో ఉండే Account Number ఎంటర్ చేయాలి, Payment Option వద్ద Other Bank Transfer ను సెలెక్ట్ చేయాలి, IFSC Code వద్ద చలానా లో ఉండే కోడ్ ఎంటర్ చేయాలి ( ICIC0000104 ఎప్పటికి మారదు ), Select Transfer Mode వద్ద NEFT మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి,Amount వద్ద చలానా లోని Amount ను ఎంటర్ చేయాలి, Purpose అనేది ఏది సెలెక్ట్ చేసిన పర్వాలేదు, తరువాత Accept బాక్స్ వద్ద Tick చేసి Submit పై క్లిక్ చేయాలి.



అన్ని వివరాలు అన్ని సరి చూసుకొని Confirm అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.అకౌంట్ నెంబర్ కు లింక్ అయిన నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేసి Confirm పై క్లిక్ చేయాలి.పేమెంట్ పూర్తి అయిన తరువాత స్క్రీన్ మొత్తం గ్రీన్ కలర్ లోకి మారుతుంది. అలా అయ్యిందంటే పూర్తి అయినట్టు అర్థం అలా కాకుండా ఎరుపు రంగులో ఉంటే పూర్తి అవ్వలేదని అర్థం. 




ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పేమెంట్ రసీదును ప్రింట్ తీసుకోవాలి. ముందుగా తీసుకున్న చలానా మరియు పేమెంట్ రసీదు లను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం భద్రపరచుకోవాలి మరియు "చలానా రిజిస్టర్" లో రాసుకోవాలి.

పేమెంట్ కు ముందు ట్రాన్సాక్షన్ హిస్టరీ లో పెండింగ్ అని చూపిస్తున్న చలానా.పేమెంట్ కు తరువాత ట్రాన్సాక్షన్ హిస్టరీ లో విజయవంతం అని చూపిస్తున్న చలానా.

Post a Comment

2 Comments
  1. quick transfer not working from office current account

    ReplyDelete
  2. Please provide E-Services 0 charges GO

    ReplyDelete