Digital Certificate For Dappu Artists and Cobblers For Pension
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కళాకారులకు మరియు చెప్పులు కుట్టే వారికి (చర్మ కళాకారుల) అందరికీ డిజిటల్ సర్టిఫికేట్ ను పొందే అవకాశాన్ని కల్పించింది. గ్రామ వార్డు సచివాలయ లోనే దరఖాస్తు చేసుకునే విధంగా విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ / డిప్యూటీ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు సర్టిఫికెట్ను తుది దశలో జారీ చేయడం జరుగుతుంది.ఈ సర్టిఫికెట్ ఆధార్తో అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే వైయస్సార్ పెన్షన్ కానుక లో భాగంగా డప్పు కళాకారులు మరియు చర్మ కళాకారులు పెన్షన్ పొందడానికి అర్హత ఉంటుంది.
విధి విధానాల్లో భాగంగా మొదట గ్రామ సచివాలయం లో అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్,వార్డ్ సచివాలయం వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వారు వారి పరిధి లో ఉన్నటువంటి డబ్బు మరియు చర్మ కళాకారుల నుండి దరఖాస్తులను స్వీకరించాలి.
స్వీకరించిన దరఖాస్తులను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిమార్క్ నమోదు చేసి తరువాతి దశలో భాగంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ASWO) వారికి ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. వారు వారికి అందినటువంటి మొత్తం అప్లికేషన్లలో కనీసం 25% అప్లికేషన్లను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి సంబంధిత జాయింట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి డిజిటల్ సర్టిఫికెట్ రికమెండ్ చేస్తూ ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. జాయింట్ డైరెక్టర్ / డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వారికి అందిన అప్లికేషన్లలో కనీసం 10 శాతం అప్లికేషన్లను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి డిజిటల్ కార్డు కు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.