Pensions Unfreez Process Pensions Unfreez Process

Pensions Unfreez Process

Pensions Unfreez Process

Pensions Unfreez Process 

వైయస్సార్ పెన్షన్ కానుక కు సంబంధించి స్పందనలో అర్జీ పెట్టుకొని అనర్హులుగా ఉన్నవన్నీ కూడా ఆరు దశ దృవీకరణ లో ( Beneficiary Management System ) అర్హులు అవ్వటం జరుగుతుంది.  Social Security Pension (SSP) సాఫ్ట్వేర్ లో కొత్తగా పెన్షన్ కు దరఖాస్తు చేయు సమయం లో "Pension ID already Exists" ఇలా వాస్తే వాటికి ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం లేదు.


నవశకం సర్వేలో అనర్హులుగా అయినవారికి, గ్రామ వార్డు సచివాలయం వెబ్ పోర్టల్ లో అనర్హులుగా అయిన వారికి, పూర్తిగా మైగ్రేషన్ అయిన పెన్షన్ దారులు అనేక కారణాలు చేత అనర్హులు అయిన వారికి, వారి స్థితిని మార్చుకునే ఆప్షన్ను (Status : Unfreeze) ఇవ్వటం జరుగుతుంది. స్థితి మారిన తరువాత కొత్తగా పెన్షన్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా గ్రామ వార్డు సచివాలయం పోర్టల్ లో ఇవ్వటం జరుగుతుంది. ఆఖరికి స్పందనలో అర్జీల సంఖ్య తగ్గడం జరుగుతుంది.


పెన్షన్ స్థితిని మార్చుకోటానికి (Unfreeze) ప్రస్తుతం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ / వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి SS పెన్షన్స్ పోర్టల్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా WEA/WDS వారు అనర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ దారుల నుండి, GSWS పోర్టల్ లో అనర్హుల నుంచి , వలస పెన్షన్ దారుల నుంచి రాతపూర్వకంగా అర్జీలు మరియు ఆధార్ వివరాలను తీసుకోవలసి ఉంటుంది. వివరాలును ఎంటర్ చేసి సంబంధిత MPDO/MC వారికి ట్రాన్స్ఫర్ చేస్తారు.


MPDO / MC వారు రికమెండ్ / రిజెక్ట్ చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ DRDA వారి ఆమోదం కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రాజెక్టు డైరెక్టర్ DRDA వారు MPDO/MC వారి పరిశీలన మేరకు చివరి ఆమోదం తెలపడం జరుగుతుంది. ఏ అప్లికేషన్లకు అయితే ఆమోదం తెలియజేయడం జరుగుతుందో ఆయా అప్లికేషన్లు సోషల్ సెక్యూరిటీ వెబ్ పోర్టల్ స్థితి అనర్హుల నుంచి అర్హులుగా మార్పు ( Unfreeze )అవ్వడం జరుగుతుంది. తరువాత ఆయా అప్లికేషన్లు గ్రామ వార్డు సచివాలయం లో కొత్తగా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. పాత విధానంలోనే 21 రోజుల లోపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి ఆమోదం తెలుపవలసిందిగా ఉంది. ప్రాజెక్టు డైరెక్టర్ DRDA వారు రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు మరలా కొత్తగా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండదు. త్వరలో పై సమాచారానికి సంబంధించి ఆప్షన్లు ఓపెన్ అవటం జరుగుతుంది. 

Pension unfreezeing Circular Link  : Click Here