ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉన్నత అధికారులు అనగా ముఖ్య కార్యదర్శి / కార్యదర్శులు / డిపార్ట్మెంట్ అధికారులు / జిల్లా కలెక్టర్ వారు/ జిల్లా జాయింట్ కలెక్టర్ వారు గ్రామ వార్డు సచివాలయ లకు తప్పనిసరిగా ప్రతినెల విజిట్ చేయాలి.
గ్రామ వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి వారు తేదీ 29-9-2020 నాడు విడుదల చేసిన SOP ప్రకారం జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు మరియు ఇతర ఉన్నత అధికారులు సచివాలయ మెరుగైన పనితీరు కోసం తప్పనిసరిగా సచివాలయాలు ప్రతినెల సందర్శించాలి. అదేవిధంగా సందర్శించిన సమయంలో రిమార్క్ లను PMU అప్లికేషన్ నందు నమోదు చేయాలి.
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ IAS వారు రాష్ట్రంలో ఉన్న అందరూ కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్ లకు గ్రామ వార్డు సచివాలయం లో తప్పనిసరిగా సందర్శన రిజిస్టర్ [ VISIT REGISTER ] ను మెయింటైన్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయమని ఆదేశించడం జరిగింది.
సచివాలయాలను సందర్శించే అధికారులు తప్పనిసరిగా VISIT REGISTER ను వెరిఫికేషన్ చేయడంతో పాటుగా వారి యొక్క రిమార్క్ లను రాసే విధంగా మరియు ముందుగా సందర్శించిన అధికారి వారు గుర్తించిన సమస్యలు లేదా రీమార్కులు పై పరిష్కరించే అయ్యిందో లేదో చూడాలి.
Visit Register Format :
1. S.No: సీరియల్ నెంబరు
2. Officer Visited : సందర్శనకు వచ్చిన ఆఫీసర్ పేరు, హోదా
3. Date Of Visit : సందర్శించిన తేదీ
4.Weather Visit Details Filled in PMU App (YES or NO) : సందర్శన సమయంలో రిమార్కులు అప్లికేషన్ లో నమోదు చేశారా లేదా?
5. Major Issued Identified : సందర్శన సమయంలో ముఖ్యంగా గుర్తించిన సమస్య
6. Issues / Remarks Identified By Previous Visiting Officer Addressed : గతంలో సందర్శనకు వచ్చిన వారు గుర్తించిన సమస్య క్లియర్ అయిందా లేదా
7. Volunteers And Infrastructure Issues Meeting Conducted (YES or NO) : వాలంటీరు మరియు హార్డ్వేర్ కు సంబంధించిన మీటింగ్ ప్రతినెల నిర్వహిస్తున్నారు లేదా?
8. Other Remarks Any : ఇతర రిమార్కులు
Download Visit Register Format
గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా 9 రిజిస్టర్లును DDO వారు నిర్వహించ వలెను.
Visitor Register Compulsory - Circular