One Time Settlement OTS Scheme Latest Updates
What is One Time Settlement OTS Scheme
ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రుణం ద్వారా ఇల్లు కట్టుకున్న వారికి ఇళ్ల పై పూర్తి హక్కులను కల్పిస్తూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కల్పిస్తూ రుణ గ్రహీతలకు One Time Settlement (OTS) కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రభుత్వం తేదీ 22.10.2021 GO:82 ను విడుదల చేయడం జరిగింది.
What is the Use Of One Time Settlement OTS Scheme
1983-84 నుంచి 2017-18 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 56,69,891 ఇళ్లను మంజూరు చేసి పూర్తి చేయటం జరిగింది ఇళ్ల మంజూరు లో భాగంగా సబ్సిడీ మరియు గ్రాండ్ తో పాటు లోన్ (ఋణం)ను కూడా ఇవ్వడం జరిగింది.తీసుకున్నప్పటి నుంచి ఋణం పెరుగుతూ వస్తూ ఉండటం వలన లబ్ధిదారు గృహం పై హక్కుల కోసం పేమెంటు సమయంలో ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. లబ్ధిదారుడు పై ఉన్నటువంటి ఆ రుణము దానిపై వచ్చే వడ్డీని పూర్తిగా తొలగించేందుకు OTS మరలా తీసుకురావటం జరిగింది.
One Time Settlement Scheme Backdrop
ప్రభుత్వం మొదట OTS ను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. పొడిగింపు లో భాగంగా మరలా GO. 47 తేదీ 7.3.2013లో తీసుకురావడం జరిగింది. అప్పట్లో తేదీ 31.3.2014 వరకు అవకాశం ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఇప్పటివరకు రావాల్సిన మొత్తం బకాయిలు అసలు 9109.65 & అసలు 5151.65 కోట్లు, మొత్తం 14261.31 కోట్లు.
One Time Settlement OTS Scheme Need
లబ్ధిదారుల పై రుణభారం పెరుగుతుండటం వలన రానున్న రోజుల్లో, గృహము పై పూర్తి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మరలా తీసుకురావడం జరిగింది.ఇందులో భాగంగా MD, APSHCL వారు OTS విధానం లో రుణ గ్రహీతలకు రీపేమెంట్ ఆప్షన్ మరల ఇచ్చేందుకు అవకాశం కల్పించారు.
హోసింగ్ పథకం ద్వారా వచ్చిన వాటికి OTS చేయటానికి ఎలా అవకాశం ఉంటుంది?
Andhra Pradesh Assigned Land Prohibition Of Transfer Act 1977కు సవరణ అయినా AP Ordinance No.16 of 2021 ప్రకారం రుణ గ్రహీతలకు రుణము చెల్లించిన తరువాత వారికి హక్కు పత్రం కల్పించు అవకాశం ఉంటుంది.
OTS పథక ముఖ్య విషయాలు ఏంటి ?
1. రుణ గ్రహీతలు స్వతహాగా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా ఐచ్చికం (Optional).
2. ప్రభుత్వం నిర్ణయించిన స్లాబ్ విలువ కంటే ఋణం విలువ+దాని పై వడ్డీ తక్కువ ఉంటే ఎంత మొత్తం మో అంతే కడితే సరిపోతుంది.
ఉదా : గ్రామాల్లో స్లాబ్ విలువ 10000 అనుకుంటే ఋణం 3000 దానిపై వడ్డీ 2300 అనుకుంటే వారు కట్టవలసినది 3000+2300=5300 మాత్రమే..10000 కాదు.
3. రుణ గ్రహీతలు తో పాటుగా వారి యొక్క వారసులు ఈ పథకానికి అర్హులు.
One time Settlement OTS Charge ఎంత ?
( ఒక ఋణ గ్రహీతకు )
1. గ్రామాల్లో 10,000 రూపాయలు
2. మునిసిపాలిటీల్లో 15,000 రూపాయలు
3. నగర పంచాయతీల్లో ( Municipal Corporation ) లో 20,000 రూపాయలు
One time Settlement OTS ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 21, 2021 నాడు ప్రారంభమవుతుంది.
ఏ ఏ డిపార్టుమెంటు వారు One time Settlement OTS పనిని చూస్తున్నారు ?
Revenue(Land), Revenue (Registration), Panchayat Raj, Housing, GSWS Department
Download One Time Settlement OTS GO 82