Covid-19 Death Rs 50,000/- Ex Gratia Application Process
COVID-19 వైరస్ ( కరోనా ) తో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Ex-Gratia గా ₹50 వేల చొప్పున అందించనుంది.జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(NDMF), కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDMF) ద్వారా , జిల్లా కలెక్టర్ వారి అనుమతితో ఇవ్వనున్నట్టుగ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది.
జిల్లా స్థాయిలో DRO ఆధ్వర్యంలో ఓ సెల్ ఏర్పాటు చేసి కరోనా వలన మృతి చెందిన కుటుంబికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటి పరిశీలన సెల్ సభ్యులద్వారా పూర్తి అయ్యాక ఆయా జిల్లా కలెక్టర్ సిఫార్సు చేసాక జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) వారి ద్వారా ₹ 50,000/- అందుతాయి. దరఖాస్తులో స్థానిక ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, వైద్యాధికారి సంతకాలు కూడా అవసరమని ఉత్తర్వుల్లో పేర్కొనారు.
కరోనా వైరస్ సోకినట్లు తెలిసినప్పటి నుండి 30 రోజుల్లో సంభవించిన మరణాలను covide- 19 మరణాలు గా పరిగణిస్తారు.ఆసుపత్రిలో చేరి 30 రోజులు దాటి మరణించిన ఆది covid-19 మరణం కిందకే వస్తుంది.వ్యక్తి మరణించినట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేస్తేనే దరఖాస్తు చేసుకోవాలి.కమిటీ నివేదిక ఇచ్చిన 14 రోజుల్లోగా నష్టపరిహారం కింద దరఖాస్తు చేసిన వారికి మాత్రమే 50 వేలు అందజేస్తారు.
బాధిత కుటుంబం నుంచి దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలి.RTPCR / MALICULER TEST / RAPID ANTIZEN / CLINICAL ( CITY SCAN, OTHER ) పద్ధతుల్లో చేసిన పరీక్షల ద్వారా కోవేడ్ సోకినట్లు నిర్ధారణ జరిగిన పాజిటివ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. Covide సోకి విషం తాగిన వారు, ప్రమాదంలో మరణించిన వారు, ఆత్మహత్య చేసుకున్న వారు అనర్హులు.DRO నేతృత్వంలో డిస్టిక్ లెవెల్ Covide డెత్ అసిస్టెంట్ కమిటీ బాధిత కుటుంబాలు (CDAC) నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Covid-19 Death Rs 50,000/- Ex Gratia Application Process
కరోనా తో మరణించిన వారి కుటుంబానికి చెందిన వారు "COVID-19 DEATH DECLARATION" పత్రం కొరకు అర్జీ ను రెవెన్యూ ఆఫీస్ నందు పెట్టుకోవాలి. CDAC చైర్మన్ వారి ఆమోదం పూర్తి అయిన తరువాత Document Number తో కోవిడ్-19 మరణ ధ్రువీకరణ పత్రం అందజేయటం జరుగుతుంది.
తరువాత దరఖాస్తు ఫారం లో వివరాలు నమోదు చేసి సంబంధించిన ఆశ వర్కర్, ఏఎన్ఎం, వైద్యాధికారి వారి పేరు, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో కౌంటర్ సంతకం తీసుకోని మీకు సంబంధించిన కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన విభాగంలో (MRO / RDO / Other Revenue Dpt Office ) దరఖాస్తు అందజేసి, దరఖాస్తు అద్దినట్టు తిరిగి రసీదు పొందాలి.
Covid-19 Ex Gratia Application Forms Required
- లోకల్ లో ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం
- CDAC వారు ఇచ్చిన డాక్యుమెంట్
- దరఖాస్తు దారుని ఆధార్ కార్డు జిరాక్స్
- దరఖాస్తు దారుని బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్
- కుటుంబ ధ్రువీకరణ పత్రం
- అప్లికేషన్ ఫారం ( Click Here )
Covid-19 Ex Gratia Eligibility
కింద తెలిపిన వాటి ద్వారా ముందుగా నగదు పొందిన వారు
1. Pradhan Mantri Garib Kalyan Package (PMGKP)
2. GO. 299 Dt. 14.6.2021
3. GO 243 Dt. 19.5.2021
Covid 19 Ex Gratia Related GOs