One Time Settlement OTS Question & Answers
Qn : లబ్దిదారు పట్టాలో ఇచ్చిన భూమి కంటే ఎక్కువ భూమిని
ఆక్రమించినట్లయితే ఆ లబ్దిదారునికి ఆక్రమించిన మొత్తం భూమికి హక్కు కల్పించబడుతుందా? లేదా పట్టాలో ఇచ్చినంత వరకు మాత్రమే హక్కు కల్పించబడుతుందా?
Ans : GO ఆధారంగా పట్టా (లేదా) స్వాధీన ధృవీకరణ పత్రంలో ఇవ్వబడిన భూమి మేరకు మాత్రమే హక్కులు కల్పించబడుతాయి. లోన్ ఉన్న వారి (Loanee cases) పత్రాలు మాత్రమే APSHCL కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.లోన్ లేని లబ్ధిదారుల నుండి పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Qn : గ్రామ పంచాయతీలో లేని లబ్ధిదారుడుని సంబంధిత PS కి తప్పుగా ట్యాగ్ చేశారు?
Ans : రికార్డును తిరిగి AE లాగిన్‌కు పంపడానికి PS లాగిన్లో ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
Qn : డూప్లికేట్ లబ్దిదారు/ నకిలీ ఆధార్/ మరణం లాంటి
సందర్భాలలో..?
Ans : కారణాన్ని తెలియజేస్తూ రికార్డును తిరిగి AE లాగిను
పంపడానికి PS లాగిన్లో ఆప్షన్ ఇవ్వబడింది.
Qn : పంచాయతీ కార్యదర్శి ఎవరైనా లబ్ధిదారున్ని తప్పుగా డిజిటల్ అసిస్టెంట్'కు కేటాయించారు?
Ans : రికార్డును తిరిగి PS కి పంపడానికి DA కి అవకాశం
కల్పించబడింది. PS దానిని వేరే సచివాలయానికి లేదా AE కి
పంపవచ్చు.
Qn : DA లాగిన్లో క్లస్టర్ తప్పుగా మ్యాప్ చేయబడింది.
Ans : PS కు రికార్డును తిరిగి పంపడానికి DA కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
Qn : భార్య మరియు భర్తకు రెండు వేర్వేరు ఐడీలతో రెండు ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఒక ఇల్లు మాత్రమే నిర్మించి అందులో నివాసం ఉంటున్నారు. ఇంకో ఇల్లు నిర్మించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి?
Ans : నిర్మించిన ఇంటి వివరాలు తీసుకోవలెను.నిర్మించబడని ఇంటి వివరాలు వాలంటీర్ యొక్క ఎంట్రీ ఫాం లో పార్ట్-D లో 'గృహము ఉన్నదా: అనే ఆప్షన్ దగ్గర “లేదు" అని
ఎంటర్ చేయవలెను.
Qn: ఎల్టీఆర్ చట్టం వాడుకలో ఉన్న ఐటీడీఏ ప్రాంతాల్లో భూమి బదిలీకి అనుమతి లేదు. కానీ ఆ ప్రాంతంలో ఒకవేళ భూమి గిరిజనేతరుడికి బదిలీ చేయబడితే?
Ans : ప్రతిపాదిత OTS ఏ విధంగానూ ITDA ప్రాంతాల్లో ఉన్నచట్టాలు/నిబంధనలను అధిగమించదు. చట్టానికి వ్యతిరేకంగా బదిలీ జరిగిన సందర్భాలలో, తప్పును నమోదు చేయడానికి DAIVRO లాగిలో ప్రొవిజన్ అందించడం జరిగినది.
Qn : లబ్ధిదారులు ఫారాలపై సంతకం చేయని సందర్భాలలో..?
Ans : లబ్ధిదారులు అంగీకరించలేదు అని నమోదు చేయవచ్చు. లబ్ధిదారుల నుండి అటువంటి ప్రతిస్పందనను నమోదు చేయడానికి DA లాగిన్లో ఆప్షన్ ఉంది. లబ్ధిదారుని అంగీకారం మార్చడానికి కూడా సదుపాయం ఉంది.
Qn : లబ్ధిదారుడి యొక్క రుణ దరఖాస్తు ఫారంలో (పార్ట్ సి) పేర్కొన్న వివరాలు.. క్షేత్రస్థాయి సర్వేలో పేర్కొన్న వివరాలకు భిన్నంగా ఉన్నట్లైతే డేటా ఎంట్రీ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రొవిజన్ అందించాలి.
Ans : అలాంటి డాక్యుమెంట్స్ ని మార్చడానికి ప్రొవిజన్ ఆప్షన్ ఉంది. అయితే, ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి VRO ఏదైనా చర్యను ప్రతిపాదించే ముందు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఏ డాక్యుమెంట్ తనఖాగా ఉంచబడిందో AE హౌసింగ్ ద్వారా తనిఖీ చేయవచ్చు.
Qn : రెవెన్యూ డిపార్ట్ మెంట్'లో సర్వే వివరాలను మార్చటానికి చాలా సమయం పడుతుంది.
Ans : లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పై ముద్రించబడేది ప్రస్తుత వివరాలు కనుక పాత సర్వే నంబర్లు కాకుండా ప్రస్తుత నంబర్లు సేకరించాల్సి ఉంటుంది.
Qn : పొజిషన్ సర్టిఫికెట్ భర్త పేరు మీద తీసుకొని, భార్య పేరు మీద ఇళ్ళు మంజూరు అయితే ఏమి చేయాలి?
Ans : రుణం తీసుకోని లబ్ధిదారుల విషయంలో బహుశా ఈ సమస్య తలెత్తవచ్చు.రుణం తీసుకున్న లబ్ధిదారుల విషయంలో, అందుబాటులో ఉన్న పట్టాల డేటా నమోదు చేయబడింది కావున లోపం వచ్చే అవకాశం తక్కువ. లోన్ తీసుకోని వారి విషయంలో డేటా ఎంట్రీకి ఒక ఆప్షన్ ఉంది. అటువంటి వాటిని ఆ ఆప్షన్'లో నమోదు చేయవచ్చు.
Qn: ఏమిటీ జగనన్న శాశ్వత గృహ, భూహక్కు పథకం ?
సమాధానం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి 1983 - 2011 సంవత్సరాల మధ్య గృహనిర్మాణానికి రుణాన్ని తీసుకొన్న వ్యక్తుల కోసం రూపొందించిన ఒన్ టైం సెటిల్‌మెంట్ పథకమే జగనన్న శాశ్వత గృహ భూహక్కు పథకం. రాష్ట్ర ప్రభుత్వం 1983-84 నుంచి 2017-18 మధ్య వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా దాదాపు 56 లక్షల గృహాలను నిర్మించింది. ఈ పథకాల కింద ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా లబ్దిదారులకు రుణాలను మంజూరు చేసింది. ఇళ్ల లబ్దిదారులు తమ ఇంటి స్థలానికి సంబంధించిన డి-పట్టాలు, పొసెషన్ సర్టిఫికెట్లు వంటి పత్రాలను తనఖా పెట్టిన మీదట ఈ రుణాలను మంజూరు చేయడం జరిగింది. గడచిన కొన్నేళ్లలో కొద్ది మంది లబ్దిదారులు మాత్రమే తాము తీసుకున్న గృహరుణాలకు సంబంధించిన అసలు, వడ్డీలను సకాలంలో చెల్లించి తమ డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగింది. రుణాన్ని గడువులోగా చెల్లించలేని వివిధ గృహనిర్మాణ పథకాల లబ్దిదారులకు ఆయా రుణాలను మాఫీ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. ఆర్.టి.నెంబరు 82 లో పేర్కొన్న మేరకు ఇళ్లు మంజూరైన లబ్దిదారుడు గ్రామీణ ప్రాంతాల్లో గృహాన్ని నిర్మిస్తే రూ.10,000 , మునిసిపాలిటీల్లో నిర్మిస్తే రూ.15,000, నగరపాలక సంస్థల పరిధిలో నిర్మిస్తే రూ.20,000 ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించడం జరిగింది. నిర్దేశించిన ఈ మొత్తాన్ని నవంబరు 7 నుంచి డిసెంబరు 15వ తేదీల మధ్య చెల్లించడం ద్వారా లబ్దిదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని చెల్లించిన మీదట రెవిన్యూ అధికారులు లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను డిసెంబరు 21వ తేదీన సంబంధిత లబ్దిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి రిజిష్టరు చేసిన పట్టా అందజేస్తారు.
Qn : ఈ పథకం పరిధిలోకి ఎవరు వస్తారు?
సమాధానం; ఏ) ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ నుంచి 1983 నుంచి మార్చి, 2011 మధ్య గృహనిర్మాణ రుణాలను పొందిన లబ్దదారులు
బి) ఏ.పి.గృహనిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొందిన వారు స్వచ్ఛందంగా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు
సి) గృహనిర్మాణ రుణాలు పొందిన లబ్దిదారులు గృహనిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన బకాయి మొత్తం అసలు, వడ్డీతో కలుపుకొని పైన నిర్దేశించిన కనీస మొత్తం కంటే తక్కువగా ఉన్నట్లయితే బకాయి పడి వున్న మొత్తాన్ని చెల్లించి ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
Qn : ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సమాధానం; గృహనిర్మాణ లబ్దిదారుల గృహాలను వలంటీర్లు సందర్శించి వారికి దరఖాస్తులు అందజేసి వాటిని పూర్తిచేయడంలో సహకరిస్తారు. లబ్దిదారులు తమకు అందజేసిన దరఖాస్తు పత్రంపై సంతకం చేయడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తమ సమ్మతి తెలపాల్సి వుంటుంది. లేదంటే తమ గ్రామ/ వార్డు సచివాలయం వద్దకు వెళ్లి ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.
Qn : ఈ పథకాన్ని వినియోగించుకోవడం ఎలాం?
సమాధానం; గృహ లబ్దిదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వి.ఆర్.ఓ., ఇంజనీరింగ్ సహాయకుడు క్లెయిమ్‌లను క్షేత్రస్థాయి తనిఖీ చేసే నిమిత్తం సందర్శిస్తారు. క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం సిబ్బంది డిమాండ్ నోటీసులు తయారుచేస్తారు. ఆ డిమాండ్ నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని సంబంధిత లబ్దిదారుడు తమ సమీప సచివాలయంలో గాని, వలంటీరు ద్వారా గాని చెల్లించవచ్చు.
Qn : ఈ పథకం వినియోగించుకోడానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?
సమాధానం; రుణాల చెల్లింపు గడువు మీరిన తర్వాత సంస్థకు బకాయిపడి వున్నవారంతా ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఈ పథకం అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొనేందుకు తమ సమీప సచివాలయాన్ని గానీ, వలంటీరును గాని సంప్రదించవచ్చు.
Qn : ఈ పథకం స్వచ్ఛందమేనా, తప్పనిసరి చెల్లింపు పథకమా?
సమాధానం; ఒన్ టైం సెటిల్‌మెంట్ కింద లబ్దిదారులకు అవకాశం కల్పించే స్వచ్ఛంద పథకం ఇది.
Qn : లబ్దిదారుడు మరణించిన తర్వాత వారి వారసులు ఈ పథకాన్ని వినయోగించుకోవచ్చా?
సమాధానం; అవును, ఆయా లబ్దిదారుడు చనిపోయిన తర్వాత అతని కుటుంబ వారసులు లీగల్ హయర్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్ వంటి అధీకృత ధ్రువపత్రాలు సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.
Qn : లబ్దిదారుడు గతంలో గృహనిర్మాణ రుణాన్ని పొందనట్లయితే ఈ పథకం వినియోగించుకోవచ్చా?
సమాధానం; అవును, సంబంధిత లబ్దిదారుడు గతంలో రుణాన్ని పొందనట్లయితే, రూ.10 రిజిస్ట్రేషన్ మొత్తాన్ని చెల్లించి రిజిష్టరు చేసిన ఇంటి పట్టాను పొందవచ్చు.
Qn : దరఖాస్తుపై లబ్దిదారుని సంతకం తప్పనిసరా?
సమాధానం; డేటా ఎంట్రీ అవసరాల నిమిత్తం దరఖాస్తుపై లబ్దిదారుని సంతకం తప్పనిసరి. ఈ పథకం వినియోగించుకోవాలనే లబ్దిదారుని సమ్మతి ఈ పత్రం ద్వారా తెలుస్తుంది. అంతేగాని ఈ దరఖాస్తుపై సంతకం చేయడం వల్ల ఎలాంటి బలవంతపు చెల్లింపులు చేయాల్సిన అవసరం వుండదు.
Qn : ఈ పథకం వల్ల పొందే ప్రయోజనాలు ఏమిటి?
సమాధానం;
ఏ) రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న గృహనిర్మాణ రుణానికి సంబంధించి చెల్లించాల్సిన అసలు, వడ్డీ బకాయిలన్నీ పూర్తిగా మాపీ అవుతాయి
బి) దీనివల్ల లబ్దిదారులు తమ ఇంటి స్థలంపై రిజిష్టర్డ్ డీడ్/పట్టా పొందుతారు. ఇంటి స్థలానికి సంబంధించి క్లియర్ టైటిల్‌ను, పొసెషన్ ను రెవిన్యూ శాఖ జారీచేస్తుంది.
సి) లబ్దిదారులు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు/యాజమాన్యం/అనుభవం కలిగి వుంటారు
డి) లబ్దిదారులు తమ ఇంటిని తనఖా పెట్టి రుణం పొందేందుకు అర్హత సాధిస్తారు