JVD Amount Credited to Aadhaar Linked Bank Account
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కు సంబంధించిన నగదు ను APBS విధానం లో అనగా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే విధానాన్ని అమలులోకి తీసుకు రావడం జరిగింది. పై విధానంలో విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా లో నగదు జమ కానున్నాయి .
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం లో ఉన్నటువంటి వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు గతం లో అప్డేట్ చేసినటువంటి తల్లుల ఆధార్ నెంబర్ లను వారి బ్యాంకు ఖాతా ఆక్టివ్ లో ఉందొ లేదో తెలుసుకోటానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వారి డేటాబేస్ తో వెరిఫికేషన్ చేసిన తర్వాత
- 2% తల్లుల ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలు ఇన్ ఆక్టివ్ స్థితిలో ఉన్నాయి
- 5 % తల్లుల ఆధార్ కార్డు లకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వలేదు
- 93% తల్లుల ఆధార్ కార్డులకు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలు యాక్టివా స్థితిలో ఉన్నాయి
ఆధార్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయుటకు సంబంధించిన సమస్యలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాలు :
1.తల్లుల ఆధార్ కార్డులకు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆక్టివ్ స్థితిలో ఉన్నట్లయితే :
కారణం : తల్లులు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండి ఎక్కువగా ఒకే ఖాతా ను ఉపయోగిస్తూ, ఉపయోగించని ఖాతా కు ఆధార్ నెంబర్ను లింకు చేసినట్లయితే పై సమస్య వచ్చే అవకాశం ఉంటుంది
పరిష్కారం : JVD కు ఇచ్చినటువంటి బ్యాంకు ఖాతా కలిగిన బ్యాంకు ను సందర్శించి వీరి యొక్క ఆధార్ కార్డు కు అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి , బయోమెట్రిక్ వేసి లింక్ చేసుకోవలెను. ఈ మధ్య ఏ బ్యాంకు ఖాతాకు అయితే ఆధార్ లింక్ అయ్యి ఉంటుందో దానికి మాత్రమే నగదు జమ అవుతుంది.
2.తల్లి యొక్క ఆధార్ కార్డ్ ఏ బ్యాంకు ఖాతా కూడా లింక్ అవ్వకపోతే :
కారణం : తల్లి ఏ బ్యాంకు ఖాతాలో కూడా వారి ఆధార్ కార్డు ను ఇవ్వకుండా లింక్ చెయ్యకపోతే పై సమస్య వస్తుంది
పరిష్కారం: తల్లి ఎక్కువగా ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతా కలిగిన బ్రాంచ్ మేనేజర్ ను కలిసి వారి యొక్క ఆధార్ కార్డు అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి బయోమెట్రిక్ వేసి వారి యొక్క ఆధార్ బ్యాంకు లింకు పూర్తి చేసుకోగలరు. ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తు JVD కు ఇచ్చిన బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవడం మంచిది.
3.తల్లి యొక్క ఆధార్ కార్డు యాక్టివ్ లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా కు లింక్ అయినట్లయితే :
ఇటువంటి సందర్భంలో ఎలాంటి సమస్య రాదు అయినప్పటికీ తల్లి రెండు బ్యాంకు ఖాతాలను కలిగి ఉండి ఒక ఖాతా కు మాత్రమే ఆధార్ లింకు చేసినట్లయితే అది ఏ ఖాతాకు లింక్ చేసుకున్నారో Click Here లింకు ద్వారా తెలుసుకొని నగదు జమ అయిన తర్వాత నగదు చెక్ చేసుకోవాలి అలా కాకుండా వేరే ఖాతాలో జమ అవ్వాలి అని కోరుకున్నట్టు అయితే వెంటనే సంబంధిత బ్యాంకు ను సందర్శించి ఆధార్ కార్డు లింక్ చేసుకోవలసి ఉంటుంది నగదు పేమెంట్ సమయానికి ఆధార్ కార్డు ఏ బ్యాంకు ఖాతా కు లింక్ అయ్యి ఉంటుందో ఆ ఖాతాలో మాత్రమే నగదు జమ అయి ఉంటుంది.
Aadhaar Bank Account Link Status
4.నవశకం లాగిన్ లో తల్లి యొక్క ఆధార్ నెంబర్ ను తప్పుగా నమోదు చేసినట్టు అయితే
ఇటువంటి సందర్భంలో పూర్తి బాధ్యత సచివాలయం లో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిపై ఉంటుంది. సంబంధిత అధికారులు కింద ఇవ్వబడిన మెయిల్ ఐడి కు మార్పు కు సంబంధించిన రిపోర్టు మరియు ఆధార్ కార్డు నకలును మెయిల్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డు మార్పు కు సంబంధించిన ఆప్షను నవశకం లాగిన్ లో ముందుగానే ఇవ్వడం జరిగింది. సంబంధిత విద్యార్ధి తల్లులకు విషయాన్ని తెలియజేసి వారి యొక్క సరైన ఆధార్ కార్డు నమోదు చేయించగలరు.
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న విద్యా దీవెన కు సంబంధించిన నగదు మార్చి 8వ తేదీన విడుదల చేయనున్నారు మరియు అన్ని బిల్స్ కూడా మార్చి 7వ తేదీ లోపు జనరేట్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ కు JVD అమౌంట్ విడుదలకు సంబంధించిన సర్క్యులర్ :