Grama Ward Volunteer Recruitment Process
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రవేశపెట్టిన వాటిలో ముఖ్యమైనవి నవరత్నాలు . నవరత్నాలు ఆమోదంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో గ్రామ వార్డు వాలంటీర్ లను ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయ లకు గానూ 2.66 లక్షల వాలంటీర్లను నియమించడం జరిగింది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు అదే పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించడం జరిగింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ [ గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ ] వారు గ్రామ వార్డు వాలంటీర్ ల నియామక ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది మరియు ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా చూడవలసి ఉంటుంది.
ఒకవేళ వాలంటీర్ వరుసగా మూడు రోజులు విధులకు హాజరు కానట్లయితే వారి పోస్ట్ ను ఖాళీగా భావిస్తూ ఏడవ రోజు కొత్తగా వాలంటీర్ ను భర్తీ చేయవలసి ఉంటుంది. అనగా ప్రతి వాలంటీరు వరుస మూడు సచివాలయ పని దినాలలో ఒక రోజైనా హాజరు కావలసి ఉంటుంది అనగా వరుసగా మూడు రోజులు హాజరు కానట్లయితే వారిని తొలగించడం జరుగుతుంది.
తేదీ 27.01.2022 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులు 7218. రూరల్లో 4213, అర్బన్ లో 3005. కాలాను క్రమంలో వాలంటరీ పోస్టులు భర్తీ చెయ్యక పోవటం వలన సంక్షేమ పథకాల అమలులో చాలా జాప్యం జరుగుతున్నందున ప్రతి జిల్లా గ్రామ వార్డు సచివాలయ జాయింట్ కలెక్టర్ వారు ప్రతి నెల రెండు విడతల్లో అనగా 1వ తేదీ నాడు మరియు 16వ తేదీ నాడు వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ను ఇవ్వవలసి ఉంటుంది . సంబంధిత ఎంపీడీవోలు మరియు మున్సిపల్ కమిషనర్ వారు ఖాళీల వివరాలను సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. జాయింట్ కలెక్టర్ వారు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయు అధికారం కలిగి ఉంటారు.
ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ లలో సంబంధిత జిల్లా కలెక్టర్ వారు వాలంటీర్ల భక్తి జరగకపోవడానికి చెప్పిన కారణాల్లో ఎక్కువగా మండలాన్ని/ULB యూనిట్గా తీసుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రాప్తికి ఆయా క్యాటగిరి అభ్యర్థులు లేనందువలన భర్తీ జరగడంలేదని తెలియజేయడం జరిగింది.
పై అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి ప్రభుత్వం కింది విధానాన్ని ఆమోదించడం జరిగింది
➤ముందు ఉన్నటువంటి విధానం ప్రకారమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ROR) అనేది ఉంటుంది.
➤ప్రతి కేటగిరి లోనూ 50% రిజర్వేషన్ అనేది మహిళలకు ఉంటుంది.
➤ఇకనుంచి మండలం / ULB లను యూనిట్ గా కాకుండా జిల్లాను యూనిట్గా తీసుకుని నియామక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది.
➤మండలం / ULB లను యూనిట్గా తీసుకొని నియామక ప్రక్రియ చేస్తున్నప్పుడు సంబంధిత కేటగిరి అభ్యర్థులు లేనందువలన ఆ ప్రక్రియ ఆగిపోకుండా జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆయా కేటగిరీ అభ్యర్థులు లేనప్పుడు మిగిలిన కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ నియామక ప్రక్రియ ఇక జరుగును.
➤ముందుగా ఉన్నటువంటి అర్హతలు, అనర్హతలు , విద్యార్హతలు గౌరవ వేతనం, చేయవలసిన పనులు మరియు ఇతర అన్ని విషయాలు ముందుగా ఉన్నటువంటి జీవో ప్రకారమే ఉండును .
✅️ Government Order :