Junior Lineman JLM Gr II Probation Declaration Guidlines
APEPDCL పరిధిలోగల జూనియర్ లైన్ మెన్ (JLM) గ్రేడ్ -II కమ్ ఎనర్జీ అసిస్టెంట్ల ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి తేదీ 09-02-2022 న APEPDCL చైర్మన్ & మేనేజంగ్ డైరెక్టర్ వారు మెమో విడుదల చెయ్యటం జరిగింది. మెమో లో తెలిపిన ముఖ్యమయిన పాయింట్ లు ఇప్పుడు చూద్దాం.
రాష్ట్రం లో ఉండే ఎనర్జీ అసిస్టెంట్ల అందరిని GO.MS.No.10 Dt.29.01.2022 ప్రకారం ఇక నుంచి జూనియర్ లైన్ మెన్ (JLM) గ్రేడ్ -II కమ్ ఎనర్జీ అసిస్టెంట్లు గా పిలవవలెను.
వీరి సర్వీస్ నియమ నిబంధనలు అనేవి 2022 Fundamental Regulations, GO.MS.No.10 Dt.29.01.2022 & Memo. No.CE /Zone /VJA /JAO /F.No. /D.No. 958 /19,Dt. 30-9-19 ప్రకారం ఉండనున్నాయి.
వీరికి జీత బత్యాలు అనేవి 2022 PRC ప్రకారం ఇవ్వటం జరుగును. పే స్కేల్
20000-600-21800-660-23780-720-25940-780-28280-850-30830-920-33590-990-36560-1080-39800-1170-43310-1260-47090-1351140-1460-55520-1580-60260-1700-61960 (41)
Fundamental Regulations 2022 ప్రకారం సూపరింటెండింగ్ ఇంజనీర్ / ఆపరేషన్ వారు అందరి జూనియర్ లైన్ మెన్ (JLM) గ్రేడ్ -II కమ్ ఎనర్జీ అసిస్టెంట్ల రెగ్యులరైజేషన్ చెయ్యటం కోసం దిగువ ఇవ్వబడిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి కావలసి ఉంటుంది అని తెలియజేశారు.
- Genuineness of Educational qualification certificates
- Caste certificate
- Date of birth certificate to be verified with SSC certificate and a confirmation letter is to be taken from the candidate.
- Physical fitness certificate
- Verification of character and antecedents from Police department
- Family Members Declaration
- Home Town Declaration
సంబంధిత కార్యనిర్వహణ ఇంజనీరు వారికి సూపరింటెండింగ్ ఇంజనీర్ / ఆపరేషన్ వారు ఎవరైతే రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్నారో వారి వివరాలను ఇవ్వవలసిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అదిక సెలవులు, ఉద్యోగం నుండి పరారే, రెండు సంవత్సరాలు పూర్తిచేసుకోకుండా ఉన్న వారి వివరాలు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది.
జూనియర్ లైన్ మెన్ (JLM) గ్రేడ్ -II కమ్ ఎనర్జీ అసిస్టెంట్లలో సీనియార్టీ లిస్టు లను కూడా ప్రిపేర్ చేస్తూ, Acknowledgment తీసుకోవలసింది గా కార్పొరేట్ ఆఫీస్ వారు తెలియజేయడం జరిగింది.