Aadhaar Document Update Circular Aadhaar Document Update Circular

Aadhaar Document Update Circular

Aadhaar Document Update Circular

Aadhaar Document Update Circular 


Recent Update :
  • UIDAI అన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో "Document Update" ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
  • 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు పొంది ఇప్పటి వరకు ఒక్క సారి అప్డేట్ చేసుకొని వారు ఇప్పడు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.
  • ఆధార్ క్యాంపు లను ఏర్పాటు చేసి అందులో పై సర్వీస్ ను అన్ని ఆధార్ కేంద్రాల్లో చేయవలసింది గా కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ఉత్తరువులు విడుదల చేసి ఉంది.
  • గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు అక్టోబర్ 25 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపు నిర్వహించడం జరుగును. 
  • ఈ సర్వీస్ ఉపయోగించుకోవటం వలన ఆధార్ తో లింక్ ఉన్న అన్ని సర్వీస్ లు అనగా కేంద్ర / రాష్ట్ర సంక్షేమ పథకాలు, బ్యాంకు సేవలు ఇతర అన్ని సేవలు సులభంగా పొందవచ్చు.
  • మన రాష్ట్రము లో ఉన్న 1950 సచివాలయ ఆధార్ సేవ కేంద్రాల్లో పై సర్వీస్ లు ఇవ్వవలసింది గా మరియు వాటిని మానిటర్ చెయ్యటానికి స్పెషల్ టీం లను ఏర్పాటు చెయ్యవల్సిందిగా జిల్లా కలెక్టర్లందరికి ఆదేశాలు అందాయి.
  • ఆనులైన్ లో ఈ సర్వీస్ పొందటానికి ఫీజు 25 రూపాయలు.ఆధార్ సేవా కేంద్రం లో అయితే ఫీజు రూ. 50\- .
  • ఈ సర్వీసు వలన మీ యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి వివరాలు అనగా పేరు లింగము పుట్టిన తేదీ చిరునామా వంటి వివరాలు అప్డేట్ అవ్వవు కేవలము డాక్యుమెంట్ అప్డేట్ అవుతుంది.
  • ముందుగా ఈ సర్వీసు ఆధారసేవ కేంద్రాల్లో గాని లేదా ఆన్లైన్లో గాని చేసి ఉన్నట్టయితే ఆ సర్వీసు అప్డేట్ అయ్యేంతవరకు మరల చేయకూడదు.
  • డాక్యుమెంట్ Upload యొక్క ముఖ్య ఉద్దేశం 2010 నుంచీ 2016 మధ్యలో జరిగిన ఎన్రోల్మెంట్ చాలా వరకు అడ్రస్ ప్రూఫ్స్ పెట్టకుండా అప్లికేషన్ ఫార్మ్ ఏ స్కాన్ చేసి అప్లోడ్ చేశారు.అయిన కూడ అందరికి ఆధార్ అనేది జెనరేట్ అయ్యింది
  • కాల క్రమన కొంత మంది ( సిటిజన్స్) ఏదో ఒక రుపన అప్డేట్ చేయించుకున్నారు. చాలా వరకూ చేసుకోని వారు జిల్లాల వారిగా ఉన్నారు వారి కొరకై ఈ ప్రాసెస్.ఈ ప్రాసెస్ లో బాగంగా సిటిజెన్ యోక్క ఏదీ అయ్యిన ఓక డాక్యుమెంట్ లో అడ్రస్ ఉండే విధంగా మనమూ చూసుకోవాలి.
  • 2010 నుంచి 2016 మధ్య ఆధార్ కార్డు పొంది ఇప్పటి వరకు ఒక సారి కూడా ఆధార్ లో డాక్యుమెంట్ ఆదారిత సర్వీస్ లు అనగా చిరునామా కానీ , పుట్టిన తేదీ కానీ, పేర్లు కానీ మార్చిన వారు మినహా డాక్యుమెంట్ అవసరం లేని ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిష్ ,మొబైల్, e-Mail మార్పు వంటి సర్వీస్ లు చేసుకున్న వారు అందరు డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ చేసుకోవాలి.
  • ఆధార్ కార్డు లో ఉన్న ఇంటి నెంబర్, వీధి పేరు, ఊరి పేరు, జిల్లా పేరు,ఇంటి పేరు వివరాలు ప్రూఫ్ గా చూపించే డాక్యుమెంట్ లో వివరాలు ఒకేలా ఉండవలెను.
  • అలా సరిగా ఏ ప్రూఫ్ లేక పోతే అప్పుడు గ్రూప్ - B ఆఫీసర్ చే సంతకం కలిగిన ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఫారం అప్లోడ్ చేయాలి.ప్రతి సారీ స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేయకండి_ ఇంక ఆప్షన్ లేదు విరి వద్ద ఏలాంటి డాక్యుమెంట్ ఏ లేదు అనే నిర్దారణకు వచ్చాక అప్పుడు కొన్ని కేసెస్ కి మాత్రమే ఈ ఫార్మ్ వాడండి.
  •  ఆధార్ సేవా కేంద్రం కలిగిన సచివాలయంలో పై సర్వీస్ పొందటానికి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారం సరిపోతుంది కొత్తగా ఎటువంటి అప్లికేషన్ అవసరం లేదు. అప్లికేషన్ ఫారం పై Aadhaar Update Document అని రాసి మిగతా వివరాలు ఫిల్ చేస్తే సరిపోతుంది. 

ఆధార్ వ్యవహారాలను చూస్తున్న సంస్థ అయిన UIDAI కొత్త ఆధార్ ఆప్షన్ "Update Document" ను తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ను అందరు ప్రజలు My Aadar మొబైల్ అప్లికేషన్ ద్వారా మరియు ఆధార్ నమోదు కేంద్రం ద్వారా కూడా పొందవచ్చు. ఈ ఆప్షన్ ను ఉపయోగించి ప్రజలు వారి ఆధార్ వివరాలు వాలిడేషన్ చేసుకోటానికి వారి Proof of Identity (POI) మరియు Proof Of Address (POA) ను సమర్పించాలి.


2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ కార్డు పొంది ఇప్పటి వరకు చిరునామా అప్డేట్ చేసుకొని ప్రజలు తప్పకుండ వారి వివరాలు దగ్గరలో ఉన్న ఆధార్ సర్వీస్ లు కలిగిన సచివాలయం లో అప్డేట్ చేసుకోవాలి. సంబంధిత వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది ఆయా ప్రజలకు చిరునామా కు సంబంధిత డాక్యుమెంట్ లతో ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకో వలసింది గా తెలియజేయాలి. 


ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు

  1. ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చు.
  2. దాదాపు 1000 ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ప్రయోజనాలను నివాసితులు సులభంగా లబ్ధి పొందవచ్చు.
  3. బ్యాంకు ఖాతా తెరవడం సులభతరం అవుతుంది.
  4. సిమ్ కార్డు పొందడం సులభతరం అవుతుంది.
  5. వివిధ స్కాలర్షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యం కలుగుతుంది.
  6. రుణ దరఖాస్తులను (Loan Application) బ్యాంకులో వేగంగా ప్రాసెస్ చేయగలుగుతాయి.
  7. తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుంది.
  8. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అయితే మీరు ఐటీ రిటర్న్లను సులభంగా ఈ వెరిఫై చేసుకోవచ్చు.


ఆధార్ కార్డు ఏ సంవత్సరం చేసారో తెలుసుకునే విధానము :

ఆధార్ కార్డులు జనరేట్ అయిన కొత్తలో లేదా అప్డేట్ చేసుకున్న తరువాత ఇంటి చిరునామాకు / Online లో జనరేట్ చేసుకున్న ఆధార్ లో ఎడమ వైపు ఆధార్ జనరేట్ అయిన తేదీ ఉంటుంది. ఉదాహరణకు 03/08/2012 అని ఉంటే ఆ ఆధార్ కార్డు 2012 లో జనరేట్ అయ్యింది అని అర్థము. వారికి ఆధార్ డాక్యుమెంట్ చేయాలి అని అర్థము. అలా 2016 వరకు ఉన్న వాటికీ చెయ్యాలి.


ఆన్లైన్లో మీకు మీరుగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే విధానము : 

  1. మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. (Click Here పై క్లిక్ చేయండి)                                               
  2.  Click Here  .
  3. Login పై క్లిక్ చేయాలి. Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
  4. మీ గుర్తింపు రుజువు (POI) మరియు చిరునామా రుజువు (POA)లు అప్డేట్ చేయటం కోసం Document Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Objective of Document Update Service లో అన్ని వివరాలు వస్తాయి.POI మరియు POA లో ఉన్న వివరాలు మరియు ఆధార్ లో ఉన్న వివరాలు తో సరిపోవాలి లేదంటే అప్డేట్ అవ్వవు. 
  5.  అన్ని విషయములు చదువుకొని NEXT పై క్లిక్ చేయాలి.
  6. How It Works? అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొత్తం 3 స్టెప్ లుగా అప్డేట్ చేసుకోవటం చూపిస్తుంది. Next పై క్లిక్ చేయాలి.
  7.  Please Verify Your Demographic Details అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ లో ఉన్న డేటా చూపిస్తుంది. పేరు, లింగము, పుట్టిన తేదీ, చిరునామా అన్ని చూసుకొని I Verify That Above Details Are Correct 
  8. పై క్లిక్ చేయాలి.Upload చేసే డాక్యుమెంట్లు 2 MB లోపు ఉంటూ JPEG, PNG, PDF రూపం లో ఉండాలి.
  9. Please Upload Proof Of Identity (POI) Document లో Select Valid Supporting Document Type లో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న అక్కడ Document Advisory లో అన్ని చదువుకోని Okay పై క్లిక్ చేయాలి. అదే విదంగా చిరునామా సంబందించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసాక Next పై క్లిక్ చేయాలి.
  10. "Please Confirm Your Demographic Details In The Documents Exactly Matches With Your Demographic Details In Aadhar" అని పాప్ అప్ వస్తుంది. Okay పై క్లిక్ చేయాలి. తరువాత పేమెంట్ పేజీ కు తీసుకు వెళ్తుంది.
  11. I Hereby Confirm That I Have Read The Understand The Payment Cancellation Refund Process అని ఉన్న దగ్గర టిక్ చేసి Make Payment పై క్లిక్ చేయాలి. URN నెంబర్ తో వచ్చే రసీదు ను డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. స్టేటస్ చూసుకోటానికి ఉపయోగపడుతుంది. అన్ని వివరాలు చూసుకొని Submit పై క్లిక్ చేయాలి.Process మధ్యలో ఆగి పోతే Dashboard ఆప్షన్ క్లిక్ చేసి Document Update వద్ద Resume పై క్లిక్ చేసి మరలా ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి చేయువచ్చు. 

Update Document కొరకు కావలసిన డాక్యూమెంట్లు :  👇👇

Click Here

Download Circular   👇👇👇

Click Here




Post a Comment

1 Comments