YSR Kalyanamasthu , YSR Shadi Thofa Information 2024 YSR Kalyanamasthu , YSR Shadi Thofa Information 2024

YSR Kalyanamasthu , YSR Shadi Thofa Information 2024

YSR Kalyanamasthu , YSR Shadi Thofa Information

YSR Kalyanamasthu / Shaadi Thofa Scheme

YSR Kalyanamasthu / Shaadi Thofa Scheme Latest Updates :

  • తేదీ 23-11-2023 నాడు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా  అమౌంట్ విడుదల.
  • జులై నుంచి సెప్టెంబరు మధ్య వివాహమైన 10,511 మంది లబ్ధిదారులకు ఈరోజు 81.64 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
  • పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం. (కులాంతర వివాహం చేసుకున్న వారికి మినహాయింపు)



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపడుచులకు పెళ్లి కానుక కింద నగదును వైయస్సార్ కళ్యాణమస్తు మరియు వైయస్సార్ షాది తోఫా పథకాల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే . SC/ST/BC/మైనారిటీ వారికి వైయస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ వారికి వైయస్సార్ షాది తోఫా పథకాలు ఇకనుంచి అందనున్నాయి .పై పథకాల ద్వారా పెళ్లి కానుక కింద నగదు SC/ST/BC/మైనారిటీ/ముస్లిం మైనారిటీ/ వికలాంగుల వారికి పెరగనుంది.ఈ పథకాలు అక్టోబర్ 1 2022 నుంచి అమలులోకి వచ్చింది .


అందించు నగదు ఎంత ?

SN Category Existing (in rupees) Financial Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa (in rupees)
1 Scheduled Caste 40,000/- 1,00,000/-
2 Scheduled Caste-Inter caste 75,000/- 1,20,000/-
3 Scheduled Tribe 50,000/- 1,00,000/-
4 Scheduled Tribe- Inter caste 75,000/- 1,20,000/-
5 Backward Classes 35,000/- 50,000/-
6 Backward Classes- Inter caste 50,000/- 75,000/-
7 Minorities 50,000/- 1,00,000/-
8 Differently Abled 1,00,000/- 1,50,000/-
9 BOCWWB 20,000/- 40,000/-

ఇంటర్ క్యాస్ట్ అనగా ?

  • SC ఇంటర్ క్యాస్ట్ అనగా మహిళ SC కులానికి చెంది ఉండి పురుషుడు SC కులానికి చెంది ఉండకూడదు.
  • ST ఇంటర్ క్యాస్ట్ అనగా మహిళ ST కులానికి చెంది ఉండి పురుషుడు ST కులానికి చెంది ఉండకూడదు.
  • BC ఇంటర్ క్యాస్ట్ అనగా మహిళ BC కులానికి చెంది ఉండి పురుషుడు BC కులానికి చెంది ఉండకూడదు.
  • మైనారిటీ ఇంటర్ క్యాస్ట్ అనగా మహిళ మైనారిటీ కులానికి చెంది ఉండి పురుషుడు మైనారిటీ కులానికి చెంది ఉండకూడదు.
NOTE :  దూదేకుల, నూర్ బాషా, పింజరి, లదాఫ్ ముస్లింలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది

వికలాంగులకు పథకం ఎలా వర్తిస్తుంది ?

మహిళ వికలాంగురాలు అయి ఉండి మరియు పురుషుడు వికలాంగుడు కాకపోయినా, పురుషుడి వికలాంగుడి అయి ఉండి మహిళా వికలాంగురాలు కాకపోయినా, ఇద్దరూ వికలాంగులు అయినప్పటికీ ఈ పథకం మహిళకు వర్తిస్తుంది.


అమౌంట్ బ్యాంకు అకౌంట్ లో ఎప్పుడు జమ అవుతుంది ?

ఈ పథకానికి సంబంధించిన నగదు అనేది అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం నాలుగు నెలలో ఏదో ఒక నెల జమ అవ్వటం జరుగుతుంది. ఆ నెలలు ఫిబ్రవరి,మే,ఆగస్టు మరియు నవంబర్. లబ్ధిదారుల వెరిఫికేషన్ అనేది పై నెలలో కన్న ముందుగా అయినట్లయితే పైన ఉన్న నెలలో నగదు జమ అవుతుంది. ఉదాహరణకు ఒక లబ్ధిదారుని వెరిఫికేషన్ అనేది జనవరి నెలలో పూర్తి అయినట్టు అయితే వారికి ఫిబ్రవరిలో నగదు జమ అవుతుంది.


అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానము 

Click Here


అర్హతలు ఏమిటి  ?

1. వయస్సు : పెళ్లి అయిన రోజు నాటికి పెళ్లికూతురుకు 18 సంవత్సరాలు మరియు పెళ్ళికొడుకు 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.

2. ఏ పెళ్ళికి : కేవలం మొదటి పెళ్లికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వితంతువు అర్హులు . ఒకే ఇంట్లో ఇద్దరు వితంతువులు ఉన్నట్టయితే ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.

3. విద్యా అర్హత : పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు కనీసం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి

4. ఆదాయ ప్రమాణాలు ( పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుకు సంబంధించి) :

  • కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ₹10,000 మించరాదు,పట్టణాలలో ₹12,000 మించరాదు. 
  • కుటుంబం మొత్తానికి మెట్ట భూమి 3 ఎకరాలు , పల్లపు భూమి 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.
  • కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనరు, కేంద్ర ప్రభుత్వం, PSU, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్లో పనిచేయరాదు. పారిశుద్ధ్య కార్మికులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
  • కుటుంబంలో ఎవరు కూడా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. టాక్సీ,ఆటో,ట్రాక్టర్ మినహాయింపు.
  • నెలసరి కరెంటు యూనిట్లు 300 యూనిట్లకు మించి ఉండరాదు. గడిచిన 12 సంవత్సరాలు సరాసరి తీసుకోవడం జరుగుతుంది. కరెంటు బిల్లు గత 12 నెలలువి లేకపోయినా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
  • మునిసిపాలిటీలలో ఆస్తి 1000 చదరపు అడుగులకు మించి ఉండరాదు.


కొత్తగా ఎలా అప్లికేషన్ చేయాలి ?

ఈ పథకాలకు అప్లికేషన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకొని అవకాశం ఉంది మరియు గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ మరియు వార్డు సచివాలయాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఉంది.


I. పెళ్లి కూతురుకు సంబందించి YSR Kalyanamastuh , YSR Shaadi Thofa అప్లికేషన్ కు కావలసిన వివరాలు :

  1. ఆధార్ కార్డు
  2. లింగము
  3. మొబైల్ నెంబరు
  4. E-MAIL ID
  5. Date of birth - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
  6. కుల ధ్రువీకరణ పత్రము - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
  7. మతము
  8. విద్యా అర్హత - పదవ తరగతి డాక్యుమెంటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  9. కార్మికుల కార్డు లేదా నెంబరు ( పెళ్లికూతురి తండ్రి లేదా సంరక్షకులు కార్మికులు అయితే )
  10. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల పేరు
  11. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల ఆధారు నెంబరు
  12. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల శాశ్వత చిరునామా వివరాలు


II. పెళ్లి కొడుకుకు సంబందించి YSR Kalyanamastuh , YSR Shaadi Thofa అప్లికేషన్ కు కావలసిన వివరాలు :

  1. ఆధార్ కార్డు
  2. లింగము
  3. మొబైల్ నెంబరు
  4. E-MAIL ID
  5. Date of birth - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
  6. కుల ధ్రువీకరణ పత్రము - సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
  7. మతము
  8. విద్యా అర్హత - పదవ తరగతి డాక్యుమెంటు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  9. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల పేరు
  10. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల ఆధారు నెంబరు
  11. తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుల శాశ్వత చిరునామా వివరాలు


III. అప్లికేషన్ చేయు సమయంలో కానీ చేసిన తర్వాత కానీ పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుల eKYC అవసరం ఉంటుంది.


కొత్తగా దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్ లు ఏమిటి ?

  1. వివాహ ధ్రువీకరణ పత్రము 
  2. పెళ్లి కార్డు ఫోటోలు
  3. కుల ధ్రువీకరణ పత్రము
  4. అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుంది
  5. పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురుల పదవ తరగతి పాసు సర్టిఫికెట్
  6. వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్
  7. వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే ఆఫీడివిటి ఉండాలి.
  8. కార్మికుల కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు అయితే కార్మిక శాఖ నుంచి పొందిన గుర్తింపు కార్డు
  9. అప్లికేషన్ చేసుకున్న తర్వాత సంబంధిత సచివాలయ వెల్ఫేర్ సహాయకులు వెరిఫికేషన్ చేస్తారు.


ఫీల్డ్ వెరిఫికేషన్ విధానము :

దరఖాస్తుదారులు ఆన్లైన్ లో కానీ సచివాలయం ద్వారా గాని అప్లికేషన్ చేసుకున్న తరువాత సంబంధిత అప్లికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ కొరకు వారి సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ (WEA)లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWDS) వారి లాగిన్ కు ఫీల్డ్ వెరిఫికేషన్ నిమిత్తం ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు వారు

  1. వివాహ ధ్రువీకరణ కోసం పెళ్లికూతురు వారి ఇంటిని సందర్శిస్తారు.
  2. పెళ్లికూతురు చిరునామా వెరిఫికేషన్ కొరకు చుట్టుపక్కల వారి ద్వారా వెరిఫికేషన్ చేస్తారు.
  3. వరుడు మరియు వధువుతో వెల్ఫేర్ సహాయకులు ఫోటో 


పథకం అమలు విధానము ఏమిటి ?

1. పెళ్లి అయిన రోజు నుంచి 30 రోజుల లోపు దరఖాస్తుదారుడు అప్లికేషన్ చేసుకోవాలి.

2. అప్లికేషన్ చేసిన దరఖాస్తులు మరియు ఫీల్డ్ వెరిఫికేషన్ పారాలతో WEA/WWDS వారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా డాక్యుమెంట్లను వెరిఫై చేస్తూ పెళ్లి కొడుకు మరియు పెళ్లికూతురచే ఈ కేవైసీ చేస్తారు.

3.WEA/WWDS వారి నుంచి సంబంధిత MPDO/MC వారికి అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది.

4. MPDO/MC వారు వెల్ఫేర్ సహాయకులు ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్లను, రిమార్కులు పూర్తిగా పరిశీలించి PD-DRDA వారికి ఫార్వర్డ్ చేస్తారు.

5. PD-DRDA వారు అప్లికేషన్ ను వెరిఫై చేసిన తర్వాత ఆరు దశల దృవీకరణ కొరకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.

6. ఆరు దశల ధ్రువీకరణ అయిన తరువాత SOCIAL AUDIT కొరకు సచివాలయంలో నోటీసు బోర్డులో పెట్టడానికి అర్హుల మరియు అనర్హుల జాబితా వస్తుంది.

7. SOCIAL AUDIT లో తుది అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్ వారి ఆమోదం కొరకు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. 

8. జిల్లా కలెక్టర్ వారి ఆమోదం అయిన తర్వాత సంబంధిత అప్లికేషన్లు రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్లకు ఫార్వర్డ్ చేయడం జరుగుతాయి.

9. రాష్ట్ర వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పేమెంట్ జరగడం జరుగుతుంది. మొత్తం విధానం ఆన్లైన్లో జరుగుతుంది. 


YSR Kalyanamasthu , YSR Shadi Thofa Downloads :