Face Attendance To GSWS Employees
ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు కూడా తేదీ 30-09-2022 శుక్రవారం నుంచి ఆధార్ అనుసం ధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసు కునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ అప్లికేషన్ లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకో వచ్చని అధికారులు వెల్లడించారు.
హాజరు నమోదు చేయడానికి ఫేషియల్ ధ్రువీకరణ ఉపయోగించు విధానం :
Step 1 : మొదటగా GSWS Attendance వెర్షన్ 2.0.6 మరియు Aadhaar Face Rd మొబైల్ అప్లికేషన్లను మొబైల్లో Install చేసుకోవాలి. అప్లికేషన్ల లింకు కింద ఇవ్వడం జరిగింది.
Download Mobile Applications 👇👇
Aadhaar Face Rd మొబైల్ అప్లికేషన్ Install అయిన తరువాత అప్లికేషన్ ల లిస్ట్ లో చూపించదు. కానీ బ్యాగ్రౌండ్ లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ ఫోన్ లో ఉందొ లేదో తెలుసుకోవాలి అంటే Settings --> Apps --> Manage Apps లో కనిపిస్తుంది.
Step 2 : మొదట GSWS Attendance అప్లికేషన్ ఓపెన్ చేసి PS/WAS లేదా PS Gr-VI(DA) / WEDPS వారి గ్రామ వార్డు సచివాలయం GSWS వెబ్సైట్ యూసర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
Step 3 : Home పేజీలో ఉన్న ఉద్యోగి రకము మరియు ఉద్యోగ పేరును సెలెక్ట్ చేసుకోవాలి.
Step 4 : ముందుగా ఉన్న బయోమెట్రిక్ మరియు ఐరిష్ తో పాటుగా FACE అనే ఆప్షన్ చూపిస్తుంది దానిని ఎంచుకోవాలి. ముందుగా చెప్పుకున్న AADHAAR FACE RD అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే Face ID App Not Installed Please Instal To Continue అని వస్తుంది. ముందుగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫేస్ ఆప్షన్ పనిచేస్తుంది. టిక్ మార్క్ చేసి పేస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5 : వెంటనే Give Face Authentication అని వస్తుంది అప్పుడు సెల్ఫీ ఫోటో తీసుకున్నట్టుగా ఉద్యోగి ఫేసు ఎదురుగా ఫోన్ పెట్టుకుని ,ఫేస్ మొత్తం కవర్ అయ్యేలా, ఫేస్ కు మరియు మొబైల్ అప్లికేషన్లకు తిన్నగా ఉండేలా చూసుకొని I Am Aware Of This Do Not Show Me Again నీ టిక్ చేసి Proceed పై క్లిక్ చేయాలి.
Step 6 : ఫోటో తీసుకున్న తర్వాత Image captured successfully అని మెసేజ్ వస్తూ SUCCESS అని వస్తే హాజరు తీసుకోవడం విజయవంతం అయినట్టు అర్థం.
Employees Attendance Links : Click Here
NOTE : హాజరుకు సంబంధించి ఎటువంటి లొకేషన్ సమస్యలు ఉన్నట్టయితే PS Gr-VI(DA) / WEDPS వారి AP సేవా పోర్టల్ లాగిన్ లో RTT క్రియేట్ చేసి ఆ అప్లికేషన్ ఐడి ను సంబంధిత జిల్లా GSWS కోఆర్డినేటర్ వాటికీ ఫార్వర్డ్ చేయాలి. సమస్య క్లియర్ అవ్వటం జరుగును.
Download User Manual 👇👇