Aadhar Mandatory For Aarogya Sri Services
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో అర్హులందరికి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కలగాలనే ఉద్దేశం తో మెడికల్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Dr వైస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ను అమలు చేస్తుంది. ఈ పథకం Dr వైస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ IT ఆదారిత సపోర్ట్ తో నిర్వహిస్తుంది.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు నగదు రహిత చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్ తరువాత డీఛార్జ్ అయ్యాక రోజుకు ₹ 225/- ను 5 లక్షల లోపు సంవత్సరపు ఆదాయం ఉన్న అర్హులు అయిన కుటుంబాలకు, సభ్యులకు,పిల్లలకు అందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మొత్తం వ్యయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఆధార్ యాక్ట్ 2016 సెక్షన్ 7 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద తెలిపిన మార్పులను చేయనుంది
- ఇకమీదట Dr వైస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ప్రూఫ్ గా ఆధార్ ను సబ్మిట్ చేయాలి. లేదా ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయవలసి ఉంటుంది.
- ఈ పథకానికి సంబంధించి లబ్ధిని పొందే ప్రక్రియలో ఎవరికైతే ఆధార్ కార్డు లేదో లేదా ఇప్పటివరకు ఆధార్ కార్డు నమోదు చేసుకోలేదు వారు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసుకోవలెను. లబ్ధిదారులు పిల్లలు అయితే తప్పనిసరిగా ఆధార్ చట్టం సెక్షన్ 3 ప్రకారం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధారంగా ఇవ్వబడే ఆధార్ ను ఆధార్ నమోదును సంబంధిత ఆధార్ సేవా కేంద్రాల్లో చేసుకోవలెను.
- ఆధార్ రెగ్యులేషన్ 12 ప్రకారం ఏ లబ్ధిదారుడుకు ఇప్పటివరకు ఆధార్ లేదో లేదా ఆధార్ నమోదు చేసుకోలేదు వారి బ్లాక్ లేదా తాలూకా లేదా మండలంలో ఆధార నమోదు సదుపాయంను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ పథకముకు సంబంధించి ఆధార ఆధారిత లబ్ధి చేకూరాలి అంటే తప్పనిసరిగా కింద ఇవ్వబడిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలెను :
1) 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు :
A) ఒకవేళ పిల్లలు ఐదు సంవత్సరాలు పైబడి ఉండి ఆధార నమోదు కేంద్రంలో బయోమెట్రిక్ ముందుగా ఇచ్చినట్లయితే వారు ఆధార్ నమోదు రసీదు లేదా బయోమెట్రిక్ అప్డేట్ రసీదు
B) కింద ఇవ్వబడిన డాక్యుమెంట్లో ఏదైనా ఒకటి ఉండవలెను
- జనన ధ్రువీకరణ పత్రము లేదా జననమును రికార్డు చేసినట్టు సంబంధిత అధికారి ఇచ్చిన సర్టిఫికెట్.
- పాఠశాల ఐడెంటిటీ కార్డు సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ సంతకంతో పాటుగా తల్లిదండ్రుల పేర్లు కార్డు పై ఉండవలెను.
C) తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో ఉన్నటువంటి సంబంధం ధ్రువీకరణ కొరకు కింది చూపిన వాటిలో ఏదైనా ఒకటి ఉండవలెను
- జనన ధ్రువీకరణ పత్రము
- రేషన్ కార్డు
- Ex-Servicemen Contributory Health Card (ECHS) OR Employee State Insurance Card (ESIC) OR Central Government Health Scheme card (CGHS)
- పెన్షన్ కార్డు
- ఆర్మీ క్యాంటీన్ కార్డు
- ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కుటుంబ హక్కు కార్డు
- ప్రభుత్వం నిర్ణయించే గుర్తింపు కార్డులు
1) 18 కన్నా ఎక్కువ సంవత్సరాల వయసు వారికి :
A) ఆధార్ నమోదు చేసుకున్నట్లయితే ఆధారు నమోదు స్లిప్
B) కింద తెలిపిన డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి
- బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాసుబుక్ ఫోటో కలిగి ఉండాలి
- PAN కార్డు
- పాసుపోర్టు
- రేషన్ కార్డు
- ఓటర్ కార్డు
- MGNREGS కార్డు
- కిసాన్ ఫోటో పాసుబుక్
- డ్రైవింగ్ లైసెన్సు
- గేజిట్ అధికారి లేదా MRO వారు ధ్రువీకరిస్తూ ఇచ్చే ఫోటో కలిగిన ఐడెంటిటీ కార్డు
- డిపార్ట్మెంటు తెలిపే ఏదైనా ఇతర డాక్యుమెంట్
ఆధార్ సమస్యలు ఉన్న వారికి ఎలా ?
- ఆధార్ ధ్రువీకరణ అనేది లబ్దిదారుల బయోమెట్రిక్ సరిగా లేకపోవడం వల్ల ఫెయిల్ అయినట్టు అయితే అప్పుడు ఐరిస్ స్కాను లేదా ముఖ ధ్రువీకరణ (Face Authentication) ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. డిపార్ట్మెంట్ వారు దీనికి సంబంధించిన ఏర్పాటులను చూసుకుంటుంది.
- చేతుల బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాను లేదా ముఖద్వీకరణ మూడు కూడా సరిగా పనిచేయని పక్షాన అప్పుడు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు వచ్చే OTP ద్వారా ధ్రువీకరణ చేయడం జరుగుతుంది.
- బయోమెట్రిక్,ఐరిష్, ముఖ ధ్రువీకరణ, OTP ఆప్షన్ కూడా ఫెయిల్యూర్ అయితే అప్పుడు ఆధార్ పై ఉండే QR కోడ్ స్కాన్ చేసి పథకం కు సంబందించిన ఆధార్ ధ్రువీకరణ చెయ్యటం జరుగును.
వైస్సార్ ఆరోగ్య శ్రీ పథకం లో ఆధార్ ఆదారిత ధ్రువీకరణ ప్రక్రియ తేదీ 02 నవంబర్ 2022 నుంచి అమలు అవ్వనుంది.
Download Order Copy 👇👇
super
ReplyDelete