Aadhaar Biometric Lock and Unlock Process
ఆధార్ కు సంబంధించి బయోమెట్రిక్ వేసే సమయంలో ప్రజలకు, వాలంటీర్లకు మరియు ఉద్యోగులలో కొందరికి Biometric Locked By Aadhar Number Holder అని వస్తూ బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అవుతుంది. అలాంటప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ అని మరియు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సమయం వృధాచేసుకుంటున్నారు. ఆధార్ లాక్ అని వచ్చిన వారికి సొంతంగా ఎవరికి వారు వారి మొబైల్ లో Un Lock చేసుకునే అవకాశం ఉంది.
![]() |
వాలంటీర్లుకు, ఉద్యోగులకు హాజరు వేయు సమయం లో బయోమెట్రిక్ లాక్ అని వస్తున్న సందేశం |
Aadhar Unlock కోసం కావాల్సినవి :
1. ఆధార్ నెంబర్
2. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ వచ్చిన OTP
ఆధార్ అన్ లాక్ చేసే విధానము :
- మొదట కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.తరువాత Login పై క్లిక్ చేయండి.
- Enter Aadhaar వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. Enter Above Captcha వద్ద చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేయండి. Send OTP పై క్లిక్ చేయండి. ఆధార్ కు లింకు అయిన మొబైల్ నెంబర్ కు వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేయండి. Login పై క్లిక్ చేయండి.
- తరువాత వచ్చిన మెనూ ఆప్షన్లో Lock/Unlock Biometrics పై క్లిక్ చేయండి. అక్కడ ఎరుపు రంగులో Lock గుర్తు చూపిస్తే ఆధార్ బయోమెట్రిక్ Lock అయినట్టు. తరువాత NEXT పై క్లిక్ చేయండి.
- తరువాత రెండు ఆప్షన్ లు చూపిస్తాయి. Unlock Biometric Temporarily & Unlock Biometrics Permanently. ఆధారు బయోమెట్రిక్లను తాత్కాలికంగా Un-Lock చేయాలి అనుకుంటే మొదటి ఆప్షన్ను శాశ్వతంగా Un-Lock చేయాలి అనుకుంటే రెండో ఆప్షన్ ను ఎంచుకోవాలి.ఇప్పుడు Unlock Biometrics Permanently అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.Next పై క్లిక్ చేయండి.
- Your Biometrics Have Been Unlocked Successfully అని వస్తుంది. అలా వస్తే బయోమెట్రిక్ Un-Lock ప్రక్రియ పూర్తి అయినట్టు.