GSWS Employees Transfers 2023 Guidlines GSWS Employees Transfers 2023 Guidlines

GSWS Employees Transfers 2023 Guidlines

GSWS Employees Transfers 2023 Guidlines

GSWS Employees Transfers 2023 Guidlines

ప్రభుత్వ ఉద్యోగులు తాను పనిచేస్తున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.ఉద్యోగుల బదిలీపై ఇప్పటికే ఉన్న నిషేదాన్ని  22-05-2023 నుండి 31-05-2023వరకు సదలించింది.


GSWS Employees Transfers 2023 Guidlines

బదిలీలు మరియు పోస్టింగ్ సంబంధించిన నియమ నిబంధనలు:

ఉద్యోగుల బదిలీలు దిగువ నియమ నిబంధనలు ఆధారంగా చేపట్టనున్నారు.

1. ప్రస్తుతం జరగబోయే బదిలీలు ఉద్యోగుల అభ్యర్థన మరియు పరిపాలనాపరమైనటువంటి (administrative grounds) కారణాలతో మాత్రమే ఉంటాయి.

2. ఏప్రిల్ 30 నాటికి ఒకే స్టేషన్లో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు మరియు ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీలు చేస్తారు.

3. ఒక ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఆ స్టేషన్లో పనిచేసిన కాలం మొత్తాన్ని పరిగణించబడుతుంది. స్టేషన్ అనగా నగరం,పట్టణం, గ్రామం  అవుతుంది అంతేగాని కార్యాలయము లేదా సంస్థ కాదు. అయితే, స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ కోసం, స్టేషన్ అంటే జోన్‌లోని కార్యాలయం అని అర్థం, ఎందుకంటే వారి అన్ని కార్యాలయాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఉన్నాయి.

4. ప్రస్తుతం జరగబోవు బదిలీలకు దిగువ తెలిపిన అంశాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

  1. 40% లేదా అంతకన్నా ఎక్కువ Disability ఉన్న ఉద్యోగులు.
  2. ఉద్యోగుల పిల్లలు ఎవరైతే మానసిక స్థితి బాగోదు  (Mentally Challenged) వారికి వారు చూపిస్తున్న ఆసుపత్రి దగ్గరలో
  3. ఉద్యోగులు గాని ఉద్యోగుల యొక్క భర్త లేదా భార్య గాని వారి పిల్లలు గాని లేదా తల్లిదండ్రులు గాని లేదా వారిపై ఆధారపడి ఉన్నవారు గానీ క్యాన్సరు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, నరాలకు సంబంధించిన ఆపరేషన్, కిడ్నీ మార్పిడి అయినవారికి మెడికల్ సదుపాయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ.
  4. కారుణ్య నియామకం ద్వారా నియమించబడిన వితంతు ఉద్యోగులు
  5. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే

7. ITDA ప్రాంతాలలో పోస్టింగ్ కోసం ఈ క్రింది నిబంధనలు పాటించాలి.

  1. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు.
  2. ఐటిడిఎ పరిధిలో ఇంతకు ముందు పని చేయని ఉద్యోగులు మైదాన ప్రాంతంలోని సర్వీసు నిడివిని బట్టి చేస్తారు.

8.ITDA ప్రాంతాలతో పాటు, బదిలీలలో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్న ఇంటీరియర్ ప్లేసెస్ మరియు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.


GSWS Employees Transfers 2023 Schedule 

దిగువ తెలిపిన ప్రక్రియ ప్రకారం బదిలీలు చేస్తారు ప్రక్రియ:

1) బదిలీలపై సడలింపు 22 మే 2023 నుండి 31 "మే 2023 వరకు అమలులోకి వస్తుంది.

2.ఫిర్యాదులు/ ఆరోపణలకు అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా బదిలీ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహిస్తారు. ఈ మార్గదర్శకాల యొక్క ఏదైనా ఉల్లంఘన తీవ్రంగా పరిగణించబడుతుంది.

3. ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థలను కలిగి ఉన్న కింది విభాగాలు, పై మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా తమ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను రూపొందించవచ్చు. వాటిలో ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు, 

  1. వాణిజ్య పన్నులు 
  2. iప్రొహిబిషన్ & ఎక్సైజ్  
  3. iస్టాంపులు & రిజిస్ట్రేషన్ 
  4. రవాణా శాఖ, మరియు 
  5. వ్యవసాయ శాఖ. 

వారు కూడా 31-మే- 2023 నాటికి ప్రక్రియను పూర్తి చెయ్యాలి.

4.విద్యా శాఖలు అనగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య మరియు సంక్షేమ శాఖల క్రింద పనిచేస్తున్న విద్యా శాఖలు పై బదిలీ మార్గదర్శకాల నుండి మినహాయించబడ్డాయి.మరియు వారు ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో తమ శాఖలకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవచ్చు. 

6. సర్క్యులర్ మెమో నెం. GAD01- SWOSERA/ 27/2019- SW, GA (సర్వీసెస్ వెల్ఫేర్) డిపార్ట్‌మెంట్, dt.15.06.2022లో జారీ చేయబడిన గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ అసోసియేషన్‌ల ఆఫీస్ బేరర్‌ల బదిలీలపై స్టాండింగ్ సూచనలు వర్తిస్తాయి.

7. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు  బదిలీ కోసం నిర్దిష్ట అభ్యర్థన చేసినప్పుడు మాత్రమే బదిలీ చేయబడుతుంది.  లేని పక్షంలో వారికి ఈ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వడమైనది. వీలైనంత వరకు, స్పష్టమైన ఖాళీ లభ్యతకు లోబడి ఈ కేటగిరీల ఉద్యోగులను వారికి నచ్చిన ప్రదేశంలో పోస్ట్ చేయవచ్చు.

8. ఏదైనా ఉద్యోగి పై పెండింగ్‌లో ఉన్న అభియోగాలు/ ఏసీబీ/ విజిలెన్స్ కేసులు ఉన్న యెడల వారి అభ్యర్థనలు బదిలీ కోసం పరిగణించబడవు. 

9. బదిలీలపై నిషేధం 01.06.2023 నుండి అమలులోకి వస్తుంది.


Download GO 71


Post a Comment

1 Comments
  1. ఈ బదలీ ప్రక్రియ సచివాలయం సిబ్బందికి వర్తిస్తుందా లేక వాళ్ళకి సెపరేట్ G.O వస్తుందా ప్లీజ్ reply bro.

    ReplyDelete