How are grama ward volunteers awarded ? How are grama ward volunteers awarded ?

How are grama ward volunteers awarded ?

How are grama ward volunteers awarded  ?

How are grama ward volunteers awarded  ?

                                     గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న మరియు సేవా వజ్ర పురస్కారాలను అందించ నున్నారు. వాలంటీర్లకు సేవ మిత్ర,సేవారత్న మరియు సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేయు కార్యక్రమమును గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు విజయవాడ, కృష్ణ జిల్లాలో తేదీ మే 19, 2023న ప్రారంభించానున్నారు. మే 19 నుంచి నెల రోజుల పాటు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం జరుగును.వాలంటీర్ల అవార్డులు అయిన సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర గాను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో అందరికీ సందేహం ఉన్నది. దానికిగాను ప్రభుత్వం విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేసింది.


వాలంటీర్లకు ఇచ్చే అవార్డులకు పరిగణించే విషయాలు :

  1. హాజరు ,
  2. పెన్షన్ పంపిణి,
  3. సర్వే లు చెయ్యటం
  4. గడప గడపకు మన ప్రభుత్వం
  5. లబ్ధిదారుల టెస్టి మోనియల్

లు పరిగణలోకి తీసుకోవటం జరుగును. మొత్తం మూడు రకముల అవార్డులు ఇవ్వటం జరుగును.

  1. సేవా మిత్ర (Seva Mitra)
  2. సేవా రత్న (Seva Ratna)
  3. సేవా వజ్ర (Seva Vajra)

జిల్లాల వారీగా వాలంటీర్ అవార్డుల లిస్ట్

1) సేవా మిత్ర (Seva Mitra)

అర్హతలు : 

  • 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు. 
  • సేవా రత్న, సేవా వజ్ర తీసుకొని వారు అందరూ దీనికి అర్హులు. 

నగదు : 

  • 10,000/-


2) సేవా రత్న (Seva Ratna)

ఎవరికి : 

  • మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు.
  • ప్రతీ మండల స్థాయి లేదా మునిసిపాలిటీ స్థాయి లేదా మునిసిపల్ కార్పొరేషన్ స్థాయిలో టాప్ 1% వాలంటీర్లకు సేవా రత్న ఇవ్వటం జరుగుతుంది. 
  • ఒక సచివాలయం నుండి ఒకరి కన్నా ఎక్కువ మందికి సేవారత్న వర్తించదు. 

అర్హతలు :

  • 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  • వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  • హాజరు ,పెన్షన్ పంపిణి,సర్వే లు చెయ్యటంగడప గడపకు మన ప్రభుత్వం ,లబ్ధిదారుల టెస్టి మోనియల్ ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 

  • 20,000/-

3) సేవా వజ్ర (Seva Vajra)

ఎవరికి : 

  • నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు. 
  •  మండలంలో ఇద్దరు వాలంటీర్ల కన్నా ఎక్కువ మందికి వర్తించదు.  

అర్హతలు :

  • 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  • వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

  • హాజరు ,పెన్షన్ పంపిణి,సర్వే లు చెయ్యటంగడప గడపకు మన ప్రభుత్వం ,లబ్ధిదారుల టెస్టి మోనియల్ ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : 

  • 30,000/-


అర్హతలు :

  • 2023 జనవరి 31 నాటికీ 1 సంవత్సరం పూర్తి సర్వీస్ కలిగి ఉండాలి.
  • పరిగణలోకి తీసుకోను సమయంలో ఎటువంటి ఫిర్యాదులు / అర్జీ లు వచ్చి ఉండకూడదు.

మార్కుల వివరాలు :

  1. బయోమెట్రిక్ హాజరు - 30 మార్కులు 
  2. పెన్షన్ పంపిణి - 30 మార్కులు
  3. సర్వే - 20 మార్కులు
  4. గడప హడపకు మన ప్రభుత్వం - 10 మార్కులు
  5. లబ్ధిదారుల టెస్టి మోనియల్ - 10 మార్కులు


1.బయోమెట్రిక్ హాజరు అర్హత : 

పరిగణలోకి తీసుకోను నెలల్లో 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగనిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు 'N' అనుకుంటే హాజరుకు సంబందించిన మార్కులు = N×(30/12)

ఉదాహరణకు :

ఒక వాలంటీర్ ప్రతినెల కనీసం లో కనీసం నెలకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు వేసినట్టయితే అవార్డుకు గానూ గత 4 నెలల ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పుడు హాజరు సంబంధించిన

మార్కులు = 4 × (30/12)

                 = 10 

బయోమెట్రిక్ హాజరు రిపోర్ట్ లింక్ :

హాజరుకు సంబందించి కింద లింక్ (Click Here) పై క్లిక్ చేయండి. అందులో మీ జిల్లా, మండలం/మునిసిపాలిటీ, గ్రామం/వార్డు సచివాలయం సెలెక్ట్ చేసి, Category లో Volunteer సెలెక్ట్ చేయండి. ఒక సంవత్సరం హాజరు రిపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు From Date వద్ద ఒక సంవత్సరం క్రితం తేదీ ను, To Date వద్ద ఏ రోజు వరకు రిపోర్ట్ కావాలో ఆ తేదీ ను సెలెక్ట్ చేసుకోవాలి. 

Click Here

2. పెన్షన్ పంపిణి అర్హత : 

ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పరిగణలోకి తీసుకోవడం జరుగును. 

పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం

A. వాలంటీర్ కు 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే :

వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కులు ఇవ్వడం జరుగును అంటే 30 మార్కులు ఇస్తారు లేని పక్షాన 15 మార్కులు ఇస్తారు.

B.వాలంటీర్ కు 25 లేదా 25 కన్నా ఎక్కువ పెన్షన్ దారులు ఉన్నట్టయితే :

[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 30 ] + [ 2వ, 3వ 4వ 5వ రోజు పెన్షన్ పంపిణీ × 20 ] ] / మొత్తం పెన్షన్దారులు

ఉదాహరణకు :

A. వాలంటీర్ కు 20 పెన్షన్ లు ఉన్నట్టయితే అన్ని కూడా నెలలో మొదటి రోజు ఇస్తే వారికీ మార్కులు = 30, మొదటి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఇస్తే అప్పుడు మార్కులు = 15

B. వాలంటీర్ కు 35 పెన్షన్ లు ఉన్నట్టయితే మొదటి రోజు 15 మరియు 2 వ రోజు 5, 3వ రోజు 4, 4వ రోజు 6 మరియు 5వ రోజు 2 పెన్షన్ లు ఇస్తే అప్పుడు మార్కులు = [15×30 ] + [ (5+4+6+2)×20] / 35

     = 22.5 మార్కులు 


3. సంతృప్తి సర్వే :

వాలంటరీ క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో ఎంత శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారో దానిని పరిగణించి మార్కులు ఇవ్వడం జరుగును. 100% హౌస్ కోళ్లు సంతృప్తి సర్వేలో పాల్గొన్నట్లయితే అప్పుడు 

సర్వే లొ కవర్ అయిన హౌస్ హోల్డ్ పర్సంటేజ్ (%N) = ( మొత్తం హౌస్ హోల్డ్ కవర్ అయినవి / ఆ క్లస్టర్ కు ఇవ్వబడిన మొత్తం హౌస్ హోల్డ్ లు ) × 100

 మార్కులు = (%N × 25 )


4. గడపగడపకు మన ప్రభుత్వం :

గడపగడపకు మన ప్రభుత్వంలోకి సంబంధించి 100% పాల్గొనటం మరియు కార్యక్రమంలో తీసిన ఫోటోలను హోటల్లో అప్లోడ్ చేయటం ఈ రెండు విషయాలను పరిగణించడం జరుగుతుంది. ఏ వాలంటీర్ అయితే గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం లో పాల్గొని ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారో వారికి మొత్తం మార్కులు అనగా 10 మార్కులు ఇవ్వడం జరుగును. అలా చేయని వారికి 0 మార్కులు ఇవ్వడం జరుగును.

Note : ఏదైనా సచివాలయంలో ఆ వాలంటీర్ క్లస్టర్ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగకపోతే వారికి ఫుల్ మార్కులు ఇవ్వడం జరుగును.


5. లబ్ధిదారుల టెస్టి మోనియల్ :

ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుండి టెస్టిమోనియల్ను తీసుకున్న వారికి పరిగణించడం జరుగుతుంది. దీనికిగాను ఎంత శాతం తీసుకున్నారు(%N) అని తెలుసుకోవడానికి మొత్తం టెస్టిమోనియల్ తీసుకున్నది మరియు ఆ పర్టికులర్ వాలంటీర్ కు ఇవ్వబడిన టార్గెట్ ను పరిగణించడం జరుగుతుంది.

%N = ( మొత్తం టెస్టిమోనియల్ తీసుకున్నది / మొత్తం టార్గెట్ ) × 100


సేవా మిత్ర కు అనార్హులుగా ఎవరిని పరిగణిస్తారు ?

  1. పైన తెలిపిన ఐదు విషయాలలో ఏ రెండు విషయాలలో 0 స్కోర్ చేసినట్టయితే వారు సేవా మిత్రకు అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది.
  2. వాలంటీర్ క్లస్టర్ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం జరిగినే సమయంలో వాలంటీరు వారు పాల్గొనకపోతే వారికి సేవా మిత్ర వర్తించదు.
  3. వాలంటీర్ వారి ప్రవర్తన దారుణంగా ఉన్న, పై ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించిన వారికి సేవా మిత్ర అందదు.
  4. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో ఎవరైనా పాల్గొన్నట్లయితే ఆ వాలంటీర్ కు సేవా మిత్ర వర్తించదు.
Note : కేవలం సమాచార నిమిత్తం మాత్రమే ఈ పోస్ట్ చేయడం జరిగినది. మరింత సమాచారం కోసం మీ సచివాలయాన్ని సందర్శించండి. 

Download Order Copy



View More