Citizen Outreach Program - May 2023 Citizen Outreach Program - May 2023

Citizen Outreach Program - May 2023

Citizen Outreach Program - May 2023

Citizen Outreach Program - May 2023

COP May -2023 : 

  • మే నెల 2023 కు సంబందించిన సిటిజెన్ ఔట్రీచ్ సర్వ్ తేదీ 26 & 27 న ఉంటుంది.
  • వాలంటీర్లు - సచివాలయ సిబ్బంది టీం గా ఏర్పడి ఈ ప్రోగ్రాం ను పూర్తి చేయాలి. అందరు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలి. సచివాలయ సిబ్బంది వారి వారి టీం ను లీడ్ చేస్తూ ప్రోగ్రాం ను పూర్తి చేయాలి.
  • ప్రోగ్రాం కు సంబందించిన విధి విధానాలు,ప్రశ్నలు, ప్రజలతో మాట్లాడవలసిన విషయాలు, సర్వే చేయు ప్రాసెస్ కు సంబందించిన యూసర్ మన్యుయల్ పోస్ట్ దిగువన ఇవ్వటం జరిగింది.
  • MPDO/MC వారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ పరుచుకొని అందరు తప్పనిసరిగా COP లొ జాయిన్ అయ్యే విధంగా గా చూడవలెను. ప్రోగ్రాం ను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తూ ఇచ్చిన గడువులో పూర్తి చేయవలసిందిగా సచివాలయ ఉద్యోగులకు మార్గదర్శకాలు ఇవ్వవలెను. 


మే నెల ప్రోగ్రాం లొ ఫోకస్ పాయింట్ లు | Focus points for COP- May 2023:

  1. eKYC పెండింగ్ ఉన్న వారికి పూర్తి చేయాలి.
  2. సిటిజెన్ ఔట్రీచ్ సర్వే లొ లేని వారిని Add చెయ్యటం. ఉద్యోగులు డైరెక్ట్ గా Add చేసే అవకాశం ఉంటుంది
  3. జూన్ నెల లొ అందిననున్న జగనన్న అమ్మఒడి పథకం కోసం.

సర్వే చేయు మొబైల్ అప్లికేషన్ | COP Survey Mobile App :

Download COP App V3.0

ప్రోగ్రాం సమయంలొ ప్రజలకు తెలియజేయవలసిన విషయాలు COP Quationaries Related Information :

1) e-KYC :

వాలంటీర్ల వద్ద హౌస్ హోల్డ్ మాపింగ్ అయిన తరువాత ఒక్క సారి కూడా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లొ బయోమెట్రిక్ (eKYC) వేయని వారికి మాత్రమే సర్వే సమయం లొ e-KYC చూపిస్తుంది. e-KYC పెండింగ్ ఉన్న వారికి వెంటనే అప్లికేషన్ లొ e-KYC చేయాలి. అందుకు బయోమెట్రిక్ / ఐరిస్ / పేస్ / OTP ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి. eKYC చేసుకోకపోతే వారికి ప్రభుత్వ పథకాలు, సర్వీస్ లు డెలివరీ సమయం లొ సమస్యలు వస్తాయి.


2) Aadar Services :

ఆధార్ సేవలు లొ ముఖ్యగా ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు అయిన వారు అందరు కూడా తప్పనిసరిగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను చేసుకోవాలి. ఈ సర్వీస్ ను ఆధార్ సేవలు కలిగిన సచివాలయాల్లో చేస్తున్నారు. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ తో పాటు ఆధార్ - మొబైల్ లింక్, బయోమెట్రిక్ మెట్రిక్ (ఫోటో, ఐరిష్, వేలి ముద్రలు) అప్డేట్, పేరు మార్పు, చిరునామా మార్పు, వయసు మార్పు, e-Mail లింక్, ఆధార్ కార్డు డౌన్లోడ్ వంటి సర్వీస్ లు అందిస్తున్నారు. అదే విదంగా 5 & 15 సంవత్సరాలు దేటిన వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. 5-7 & 15-17 సంవత్సరాల మధ్య బయోమెట్రిక్ అప్డేట్ కు ఎటువంటి రుసుము ఉండదు. అదే 7 & 17 సంవత్సరాలు దేటిన వాటికీ మాత్రం 100/- రుసుము ఉంటుంది.


3) MAUD Seeding :

మున్సిపాలిటీ లొ ఎవరికి అయితే ల్యాండ్ ఉంటుందో వారికి మాత్రమే ఈ ఆప్షన్ కు సంబందించిన ప్రశ్నలు చూపించటం జరిగిను. అందరికి చూపించవు. ఆ కుటుంబం లొ ఉన్న ల్యాండ్ చూపిస్తుంది. అది ఎవరికి అయితే లింక్ చేయాలి వారి ఆధార్ / పేరు ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.


4) Power Meter Seeding :

ఈ ఆప్షన్ కు సంబంధించి ఇంట్లో ఎవరి పేరు మీద అయినా కరెంటు మీటరు ఉన్నట్టయితే ఆ కరెంటు మీటర్ నెంబరు చూపించడం జరుగుతుంది. నిజంగా ఆ కరెంటు మీటర్ ఓనరు ఆ వ్యక్తి అయినట్టు అయితే వారి పేరు లేదా ఆధార్ నెంబరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు మీటర్ కానట్టు అయితే సీడ్ చేయవలసిన అవసరం లేదు. Owner / Tenant అంటే యజమాని / అద్దెకు ఉన్న వారు అని అడిగితే అప్పుడు సిటిజెన్ కు అడిగి సబ్మిట్ చేయాలి.


GSWS COP - ప్రోగ్రాం లో విద్యుత్ సర్వీస్ నెం తో "ఓనర్ పేరు" తెలుసుకొనుటకు సంబంధించిన లింక్స్

📶 𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋  : Click Here

(శ్రీకాకుళం , విజియానగరం , విశాఖపట్నం , ఈస్ట్ గోదావరి  మరియు వెస్ట్ గోదావరి.)

📶 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 : Click Here

(నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూల్.)

📶 𝐀𝐏𝐒𝐏𝐂𝐃𝐋 : Click Here

(కృష్ణ జిల్లా,  గుంటూరు మరియు ప్రకాశం.)

సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు :


  • సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
  • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
  • సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ/ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.

  • ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన ప్రజలందరికీ అందజేయవలెను.
  • గ్రామ/ వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
  • యాప్ లో ప్రశ్నావళిని గ్రామ/  వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
  • ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
  • ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి.
  • పౌరుల ఫోటోని క్యాప్టర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్' లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.


సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/ వార్డు వాలంటీర్లు బాధ్యతలు : 


  • అతని/ ఆమెతో అనుబంధించబడిన గ్రామ/ వార్డు సెక్రటరీతో పాటు వారి క్లస్టర్ పరిధిలోని అన్ని హౌస్ హోల్డ్ లను(HH) కవర్ చేసేలా చూసుకోవడం సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ బాధ్యత.
  • గ్రామ/ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందితో సమన్వయంతో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం/ పరిష్కరించడం వాలంటీర్ల బాధ్యత.
  • వారి క్లస్టర్ whatsapp గ్రూప్ లలో ప్రచార సమాచారాన్ని హౌస్ హోల్డ్ లతో ముందుగా  పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.
  • ప్రచారం తరువాత వాట్సాప్ గ్రూప్ లలో ఫీడ్‌బ్యాక్ మరియు చిత్రాలను పంచుకోవడం వాలంటీర్ల బాధ్యత.


Technical Notes :

  • వ్యక్తి మరణించిన తరువాత Authentication వేసే సమయం లొ ఇలా ""As you mentioned like చనిపోయారు, The user have to Authorize to continue? "" వస్తే అప్పుడు ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది . 
  • అప్లికేషన్ ఉపయోగిస్తున్న సమయంలో "No Data Available" అని వస్తున్నట్లయితే అప్పుడు లాగౌట్ చేసి లాగిన్ అయినట్లయితే సమస్య క్లియర్ అవుతుంది. 
  • మొబైల్ అప్లికేషన్ లో ఒక్కసారి ఒక్కరు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది.రెండో మొబైల్ లో లాగిన్ అవ్వటానికి ప్రయత్నిస్తే "Please relogin as user logged off or logged in from another device" అని వస్తుంది.
  • లాగిన్ అయ్యే సమయం ఎవరికి అయినా "Application will not work on this device as USB Debugging is enabled. 892" అని వస్తే వారు మొబైల్ లొ Developer Mode Settings లొ Usb Debugging ఆప్షన్ ను Disable చెయ్యండి.
  • సర్వే చేయు సమయం లొ "Please try again...Attempt to invoke virtual method 'boolean java.io.File.exists()' on a null object reference" లేదా "Auth XSD Validation Failed." లేదా "No Data Available" అని వస్తే అప్పడూ log Out చేసి మరలా లాగిన్ అవ్వాలి.
  • పంచాయతీ కార్యదర్శులకు (Gr I to V) ఈ మధ్యకాలంలో క్రియేట్ చేసిన గ్రామ వార్డు సచివాలయ యూసర్ నేమ్ తో లాగిన్ అయితే వారికి సర్వే ఓపెన్ అవుతుంది. అవి ఓపెన్ అవ్వక పోతే Sachivalayam Code - PS తో ట్రై చెయ్యండి.
  • ప్రభుత్వ స్కానర్లకు సంబంధించిన "Error:-warranty/ Subscription/Support Validity Is Over. Pl Renew." సమస్య క్లియర్ అవటం జరిగినది.
  • eKYC పూర్తి అయినా కూడా Partially Completed అని వస్తున్న వాటిని విడిచిపెట్టి మిగతా వాటిని పూర్తి చెయ్యాలి. తరువాత అప్డేట్ అవుతున్నాయి. 
  • కేవలం ఒక సారి ఒక మొబైల్ లొ మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈ సారి eKYC పెండింగ్ ఉన్న వారికి బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ఆధారంగా eKYC చేయాలి. eKYC చెయ్యక పోతే PARTIALLY COMPLETED అని స్టేటస్ చూపిస్తుంది.
  • సర్వే సమయం లొ అందుబాటులో ఉన్న వారికి తప్పనిసరిగా eKYC చేయాలి. అందుబాటులో లేరు / వలసలో ఉన్నారు / మరణించారు అని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చెయ్యరాదు.
  • మొదటి రోజు 50%, మరుసటి 50% సర్వే పూర్తి అయ్యేలా చూడాలి.ఒకే రోజు 100% అయిన పర్వాలేదు కానీ 50% కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి.


COP సర్వే రిపోర్ట్ | COP Suevey Dashboard : 

Click Here

COP మే -2023 యూసర్ మన్యుయల్ | COP May - 2023 User Manual :

Click Here