YSR Bima 2023-24 Survey Information YSR Bima 2023-24 Survey Information

YSR Bima 2023-24 Survey Information

YSR Bima  Andhra Pradesh   ysr bima status check ysr bima payment status ysr bima eligibility ysr bima amount ysr bima helpline number ysr bheema death claim status ysr bima app ysr bima apply online https://ysrbima.ap.gov.in YSR Bima AP www.ysrbima.ap.gov.in> You've visited this page 3 times. Last visit: 20/8/22 Search By Name/Aadhar ... YSR Bima. Home; YSR Bima; Search. Search (21-22). Search ... Login to your account Login to your account. User Name: * Enter User Name. Password:. Reports R1 New Enrollment (2021-22) · R2 Reports 2021-22 · R3 Reports ... Enrollment(2021-22)

YSR Bima 2023-24 Survey Information  

                                                     కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించిన లేదా వికలాంగుడిగా మారిన ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైస్సార్ భీమా పథకాన్ని కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ పథకానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా గ్రామ వార్డు సచివాలయ శాఖ అమలుపరిచే ఏజెన్సీగా ఉంటున్నాయి. 

  • 2021-22 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ భీమా పథకం 2022 జూన్ 30 నాటికి పూర్తి అవ్వటం జరిగినది.
  • 2022-23 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ భీమా పథకము మొత్తం 1 కోటి 22 లక్షల మందికి అందించడం జరిగినది. 
  • సాధారణ మరణము పొందిన వారికి 30.06.2023 న, ప్రమాదము ద్వారా మరణించిన వారికి 15-07-2023 నాటికీ ఈ పథకం పూర్తి అయినది. 

  • 2023-24 సంవత్సరానికి సంబంధించి YSR బీమా పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగినది. తేదీ జులై 1, 2022 నుండి ఈ పథకాన్ని మరల ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
  • సాధారణ మరణము ద్వారా మరణించిన వారికి జులై 1 2023 నుండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి జులై 16 2023 నుండి ఈ పథకం మరల ప్రారంభం అవుతుంది.

అందులో భాగంగా 2023-24 పథకం లొ

  1. 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండి సాధారణ మరణము జరిగినట్టయితే నామినీ వారికి లక్ష రూపాయలు నగదును డైరెక్ట్ గా ప్రభుత్వం నుండి అందించడం జరుగుతుంది.
  2. 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండి ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పేమెంటు అందించడం జరుగుతుంది. ప్రజల తరపున ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు లేబర్ డిపార్ట్మెంట్ వారు సంవత్సరపు వారి ప్రీమియంను కట్టడం జరుగుతుంది.


ముందుగా జరిగిన సర్వేలో ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిని తప్పుగా నమోదు చేసిన వారు మార్చుకోవడానికి , 15.07.23 నాటికీ వయసు రిత్యా వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి ప్రమాదవశాత్తు మరణించిన వారి ఇన్సూరెన్స్ కు అనర్హులైన వారిని మార్చుకునేందుకు , BPL కుటుంబాలలో ప్రాథమిక సంపాదించే వారిని జోడించడం లేదా అప్డేట్ చేయడం,eKYC చెయ్యటం కోసం మరలా డోర్ టు డోర్ సర్వే చేయవలసి ఉంటుంది.

వైస్సార్ బీమా 2023-24 విధి విధానాలు 


అర్హులు ఎవరు ?

  1. 18 సంవత్సరాలు వయసు నిండిన వారై ఉండాలి.
  2. 70 సంవత్సరాల లోపు వయసు అయి ఉండాలి .
  3. BPL కుటుంబానికి చెంది ఉండాలి అనగా తప్పనిసరిగా రేషన్ కార్డు / రైస్ కార్డు కలిగి ఉండాలి.
  4. కుటుంబంలో ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి అయి ఉండాలి.
Note : PBE అంటే primary bread earner అని అర్థము  అంటే వైస్సార్ బీమా ఎవరి పేరు మీద ఉంటుందో వారు అని అర్థము. ఇంట్లో ఎవరు అయితే సంపాదించి ఇల్లు మొత్తం వారిపై ఆధారపడి ఉంటుందో వారిని PBE గా సెలెక్ట్ చేయాలి. 


వయసుని ఎలా నిర్ధారిస్తారు ? 

వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి వయసు నిర్ధారణ అనేది ఆధార్ కార్డు లేదా ఆధార్ చట్టం సెక్షన్ 7 లొ ఇవ్వబడిన ఏ డాక్యుమెంట్ అయినా సరిపోతుంది.


ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిని ఎలా నిర్ధారించాలి ? 

కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా నిర్ధారించాలి. ఆ వ్యక్తి సంపాదనమే పైనే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉండాలి.


నామినేని ఏ విధంగా ఎన్నుకోవాలి? 

ఇన్సూరెన్స్ చట్టం 1938, సెక్షన్ 39 ప్రకారం తప్పనిసరిగా ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి తన భర్త లేదా భార్య లేదా పిల్లలు లేదా వారిపై ఆధారపడే వారిని నామినీగా లేదా నామినీలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా సంపాదించే వ్యక్తికి భర్త లేదా భార్య లేదా పిల్లలు లేదా వారిపై ఆధారపడే వాళ్ళు లేకపోతే అప్పుడు చట్టపరమైన ప్రతినిధులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నామిని మైనర్ అయినట్టు అయితే అప్పుడు, ప్రాథమిక సంపాదనదారుడు తనకు నచ్చిన సంరక్షకులకు ఇన్సూరెన్స్ నిధులు అందేలా పెట్టుకోవచ్చు.

ప్రాథమిక సంపాదన దారుడు కింద తెలిపిన విధంగా నామినేని ఎన్నుకోవలిసి ఉంటుంది

  1. వివాహం జరిగినట్టయితే తన భర్త లేదా భార్యను నామినిగా ఎంచుకోవాలి.
  2. వివాహము జరిగి భర్త లేదా భార్య అందుబాటులో లేకపోయినట్టు అయితే కొడుకో లేదా కూతురుని నామినేగా ఎంచుకోవలసి ఉంటుంది.
  3. వివాహము జరగనట్టయితే అప్పుడు తండ్రి లేదా తల్లిని నామినేగా ఎంచుకోవలసి ఉంటుంది.
  4. ఒకవేళ తల్లి లేదా తండ్రి ఇద్దరు లేకపోయినట్లయితే అప్పుడు పెళ్లి కానీ లేదా విడాకులు తీసుకున్న చెల్లి లేదా అక్కను నామినీ గా ఎంచుకోవలసి ఉంటుంది.


 వైయస్సార్ బీమా నమోదు ఎన్ని రోజులలో చేయవలెను ?

  • ప్రాథమిక సంపాదనాధారుడి ఆధార్ నెంబరు ఎంటర్ చేయటం మరియు బయోమెట్రిక్ ద్వారా eKYC తీసుకోవటం, ఆధార్ వివరాలను ఆధార్ సైట్ లో వెరిఫికేషన్ చేయటం ను సర్వే మొదలు అయిన రోజు నుంచి ఐదు రోజులలో గ్రామ వాలంటీరు లేదా వార్డు వాలంటీర్ పూర్తి చేయవలసి ఉంటుంది.
  • ఆధారు బయోమెట్రిక్ ఉపయోగించి వెరిఫికేషన్ ను WEA / WWDS వారు వాలంటీర్ వారు eKYC చేసిన రోజు నుంచి ఐదు రోజులలో పూర్తి చేయవలసి ఉంటుంది.


సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల పాత్ర ఏమిటి ?

1) ముందుగా సర్వే చేసిన వారికి :

డేటా సరిగా ఉన్నట్టు అయితే : 

  1. వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లు రైస్ కార్డు ట్రాప్ కి ప్రాథమిక సంపాదనదారుడు వివరాలు చూపించడం జరుగుతుంది. 
  2. ఆ వివరాలను అనగా అతను ప్రాథమిక సంపాదన దారుడా కాదా , నామిని వివరాలు, వారికి రైస్ కార్డు ఉన్నదా లేదా, మిగిలిన వివరాలు సరిపోయాయా లేవా అని చూసుకోవాలి. 
  3. అన్ని వివరాలు సరిగా ఉన్నట్టయితే అప్పుడు మొబైల్ అప్లికేషన్లో e-KYC పూర్తి చేయాలి.

Download YSR Bima App

ప్రాథమిక సంపాదన దారుని మార్చటం :

  1. కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వాలంటీర్ వారు ఫ్యామిలీ మెంబర్లు ఒకరిని ప్రాథమిక సంపాదన దారుణంగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
  2. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి.
  3. బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేసి UIDAI తో వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
  4. పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయసు, వృత్తి, కులము, ఉప కులము వెరిఫై చేయాలి.
  5. నామిని వివరాలను ఎంటర్ చేయాలి అనగా పేరు, ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్ ,రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.


నామిని ని మార్చటం :

  1. ముందుగా ఉన్నటువంటి నామిని వివరాలను మార్చి కొత్తగా నామిని వివరాలను అప్డేట్ చేయవలసి ఉంటుంది.
  2. నామిని తప్పనిసరిగా సంపాదించే వ్యక్తి యొక్క కుటుంబంలోని వ్యక్తి అయి ఉండాలి.
  3. ఒకవేళ నామిని మైనర్ అయినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్ వారు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఇష్టపూర్వకంగా వారి సంరక్షకుల పేరు, ఆధార నెంబరు మరియు రిలేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  4. అన్ని వివరాలను సరిగా చదివిన తరువాత అక్కడ చూపిస్తున్న Disclaimer ను చూసుకొని గ్రామ వార్డు వాలంటీర్ల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
  5. తరువాత ఫైనల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.


మిగిలిన వివరాలలో మార్పు :

  1. ప్రాథమికంగా సంపాదించే వ్యక్తి యొక్క పేరు, వయస్సు, కులము ఉపకలము మరియు వృత్తి వివరాలను మార్చే అవకాశం ఉంటుంది.
  2. నాముని వివరాలు అనగా పేరు ,ఆధార నెంబరు, డేట్ అఫ్ బర్త్, రిలేషన్ మరియు బ్యాంకు వివరాలు మార్చే అవకాశం ఉంటుంది.


2) సర్వే చెయ్యని వారికి :

  1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి వారి యొక్క రైస్ కార్డు నెంబర్ను వైయస్సార్ బీమా వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  2. కుటుంబం అంగీకార ప్రకారం కుటుంబంలో ఒకరిని ప్రాథమికంగా సంపాదించే వ్యక్తిగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
  3. వారి ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా eKYC పూర్తి చేసి డేటా ను వెరిఫై చేయాలి.
  4. ప్రాథమిక సంపాదన దారుణ యొక్క తండ్రి లేదా భర్త లేదా భార్య పేరు, వయసు , కులము, ఉపకులము, వృత్తి ఎంటర్ చేయాలి.
  5. నామినీ వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంకు యొక్క వివరాలను ఎంటర్ చేయాలి.
  6. నామిని మైనర్ అయినట్టు అయితే వాలంటీర్ వారు సర్వే చేస్తున్న వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క సంరక్షకుల పేరు, ఆధార నెంబరు, సంబంధము ఎంచుకోవలసి ఉంటుంది.
  7. చివరగా వాలంటీర్ వారు కన్సెంట్ తీసుకొని వారి యొక్క బయోమెట్రిక్ చేయవలసి ఉంటుంది. డేటాను సబ్మిట్ చేయాలి.


సర్వేలో WEA / WWDS వారి పాత్ర ఏమిటి ?

1) ముందు సర్వే చేసిన వారికి :

  1. WEA / WWDS వారు ముందుగా ఉన్నటువంటి ప్రాథమిక సంపాదనదారుల వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది అదేవిధంగా వాలంటీర్ వారు వెరిఫై చేసిన వివరాలను కూడా ఒకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది.
  2. అదేవిధంగా ప్రాథమిక సంపాదన దారుని వివరాలలో మార్పులు మరియు నామిని మార్పులు మరియు ఇతర మార్పులు ఏవైతే వాలంటీర్ వారు చేస్తారో అవి వెరిఫై చేయవలసి ఉంటుంది.


2) ముందు సర్వే చేయని వారికి (కొత్తగా సర్వే చేయవలసిన వారికి )

  1. గ్రామ వార్డు వాలంటీర్ వారు ముందుగా సబ్మిట్ చేసిన PBE ల వివరాలను WEA / WWDS వారు వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సర్వే చేసిన వారు PBE నా ? కాదా ? అని నిర్ధారించాలి.
  2. PBE అయినట్టు అయితే అప్పుడు WEA / WWDS వారు eKYC చేయాలి. కాక పోతే కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఒకరిని PBE గా సెలెక్ట్ చేయాలి.
  3. ఆధార నెంబర్ను ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పేరు, తండ్రి పేరు / భర్త లేదా భార్య పేరు, వయసు, కులము, వృత్తి, వివరాలను వెరిఫై చేయవలసి ఉంటుంది.
  4. నామిని యొక్క పేరు, ఆధార్ నెంబరు, డేట్ అఫ్ బర్త్, సంబంధమును , వెరిఫై చేయాలి.
  5. నామిని మైనర్ అయినట్లయితే సంరక్షకుల యొక్క వివరాలు అనగా పేరు, ఆధార నెంబరు, సంబంధము వెరిఫై చేయాలి.
  6. WEA / WWDS వారికి సర్వేలోని అన్ని వివరాలు మార్పులు లేదా అప్డేట్ చేసే ఆప్షన్ ఉంటుంది.
  7. WEA / WWDS వారు చివరగా అన్ని వివరాలను చదివిన తరువాత వారి కాన్సెంట్ ఇవ్వాలి. డేటా సబ్మిట్ చేయూలి.


తరువాత సంబంధిత MPDO / MC వారికి వారి నుంచి District GSWS Incharge,DRDA PD (వైస్సార్ బీమా జిల్లా నోడల్ అధికారి ) వారికి ఫార్వర్డ్ అవుతాయి.

Note : సర్వేకు సంబంధించి PBE వారి నమోదు మరియు నామినీల వివరాల మార్పు చేర్పు లు తేదీ 07-06-2023 లోపు పూర్తి అవ్వవలసి ఉంటుంది. 



View More

Post a Comment

8 Comments
  1. Replies
    1. PBE అంటే primary bread earner అని అర్థము అంటే వైస్సార్ బీమా ఎవరి పేరు మీద ఉంటుందో వారు అని అర్థము. ఇంట్లో ఎవరు అయితే సంపాదించి ఇల్లు మొత్తం వారిపై ఆధారపడి ఉంటుందో వారిని PBE గా సెలెక్ట్ చేయాలి.

      Delete
  2. PERLI.DAVEEDU YSR BHIMA RALEDU

    ReplyDelete
  3. Aadar no.685538054267

    ReplyDelete
  4. Ysr bhima raaledu

    ReplyDelete
  5. App asking update

    ReplyDelete