SAHARA Money Refund Process in Telugu 2023
సహారా గ్రూప్‌కు చెందిన కోఆపరేటివ్ సొసైటీల్లో డబ్బులు దాచుకున్న డిపాజిటర్లకు త్వరలో డబ్బులు రానున్నాయి. కేంద్రం దీనికి సంబంధించి ఒక పోర్టల్ ప్రారంభించింది. సహారా గ్రూప్ , మార్కెట్ నియంత్రణ సంస్థ - SEBI దగ్గర డిపాజిట్ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లను సహారా గ్రూప్ డిపాజిటర్లకు చెల్లించేందుకు సుప్రీం కోర్టు ఈ సంవత్సరం మార్చిలో అనుమతి ఇచ్చింది. అయితే ఈ డబ్బుల కోసం ఎలా క్లెయిం చేసుకోవాలి , అర్హతలు ఏంటి ? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ? లింక్ సహా ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
Portal Name | Sahara Refund Portal |
ప్రారంభించినది | కేంద్ర ప్రభుత్వం |
ప్రారంభ తేదీ | 18 జులై 2023 |
రిఫండ్ నగదు | రూ.30,000/- లోపు |
దరఖాస్తు విధానం | Online Mode |
రిజిస్ట్రేషన్ ఫీజు | పూర్తిగా ఉచితం |
రిజిస్ట్రేషన్ లింక్ | కింద ఇవ్వటం జరిగింది |
డాక్యుమెంట్ లు | కింద ఇవ్వటం జరిగింది |
టోల్ ఫ్రీ నెంబర్లు | 1800-103-6891 , 1800-103-6893 |
సహారా మనీ రిఫండ్ కు ఎవరు అప్లై చేసుకోవాలి?
Sahara refund - Who should apply ?
సహారా గ్రూప్‌కు చెందిన నాలుగు సొసైటీలు అయిన
- సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,Lucknow
- సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్,Bhopal
- హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,Kolkata
- స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ డిపాజిటర్లకు,Hyderabad
ఈ రీఫండ్ పోర్టల్‌లో ద్వారా డబ్బులు చెల్లించనుంది.
సహారా మనీ రిఫండ్ - ఎన్ని రోజుల్లో నగదు జమ అవుతుంది ?
Sahara refund - How many days will the cash be deposited ?
రిజిస్ట్రేషన్ చేసుకున్న నుంచి సహారా డిపాజిటర్ల అకౌంట్లలోకి 45 రోజుల్లోగా డబ్బులు డిపాజిట్ అవుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. కోటి మంది డిపాజిటర్లకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని అమిత్ షా చెప్పారు. సుమారు 1.78 మంది చిన్న ఇన్వెస్టర్లకు .. రూ. 30 వేల లోపు నగదు ఉన్న వారికి డబ్బులు మొత్తం రావడం అనేది గ్రేట్ అచీవ్‌మెంట్ అని చెప్పారు షా.
సహారా మనీ రిఫండ్ - అర్హతలు ఏమిటి ?
Sahara Money Refund - What are the Eligibility ?
- సహారా క్రెడిట్ సొసైటీ, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హుమారా ఇండియా క్రెడిట్ సొసైటీల్లో 2022, మార్చి 22కు ముందు డిపాజిట్ చేసుండాలి.
- ఇక స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో 2023, మార్చి 29కి ముందు డబ్బులు డిపాజిట్ చేసుండాలి.
సహారా రీఫండ్ - అవసరం అవసరం అయ్యే పత్రాలు
Sahara Refund Portal: Documents needed
- Application Form (ఆటోమేటిక్ గా అప్లికేషన్ మధ్యలో జెనరేట్ అవుతుంది)
- Passport Size Photo
- Deposited Certificate / Passbook (PDF / JPG )
- Aadhaar linked with an active mobile number
- PAN card (for claim amounts of Rs 50,000 and above)
సహారా మనీ రిఫండ్ - ఎలా అప్లై చేసుకోవాలి?
Sahara Money Refund - How to Apply?
Step 1 : సహారా డబ్బుల రీఫండ్ కోసం అప్లై చేసుకోవాల్సిన వెబ్‌సైట్ CRCS Sahara Refund Portal లింక్ కోసం కింద లింక్ పై క్లిక్ చెయ్యండి .
Step 2 : Depositor Registration పై క్లిక్ చెయ్యాలి చెయ్యాలి .మీ ఆధార్ కార్డు చివరి నాలుగు అంకెలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి.Verify OTP ద్వారా రెజిస్ట్రకషన్ పూర్తి చేసుకోవాలి .
Step 3 : తరువాత హోమ్ పేజీ లో Depositor Login పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి తర్వాత ఆధార్ ద్వారా ప్రాంప్ట్ కోసం మీ సమ్మతి ఇవ్వాలి.
Step 4 : నెక్ట్స్ పేజీలో I Agree పై క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు అంగీకరించాలి.తర్వాత 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత అక్కడ ఆధార్ యూజర్ డీటెయిల్స్ అనగా పేరు , ఆధార్ కు లింక్ అయినా బ్యాంకు అకౌంట్ వివరాలు డిస్‌ప్లే అవుతాయి.మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి . తరువాతి పేజీ కోసం Next పై క్లిక్ చేయాలి .
Step 5 : సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్‌పై కనిపించే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
- సొసైటీ పేరు (పాసుబుక్ లో ఉంటుంది)
- మెంబర్షిప్ నెంబర్ (పాసుబుక్ లో ఉంటుంది)
- అకౌంట్ నెంబర్ (పాసుబుక్ లో ఉంటుంది)
- సర్టిఫికెట్ / పాసుబుక్ నెంబర్ (పాసుబుక్ లో ఉంటుంది)
- అకౌంట్ ఓపెనింగ్ తేదీ (పాసుబుక్ లో ఉంటుంది)
- డిపాజిట్ చేసిన నగదు మొత్తం (పాసుబుక్ లో ఉంటుంది)
- మీకు కొత్త మొత్తం అయినా డిపాజిట్ చేసారా ?
- మీరు లోన్ ఎం అయినా తీసుకున్నారా ?
Step 6 : సబ్మిట్ క్లెయిమ్‌పై క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి.క్లెయిం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీ ఫిల్డ్ క్లెయిం రిక్వెస్ట్ ఫాం ప్రిపేర్ అవుతుంది. అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
Step 7 : మీ లేటెస్ట్ ఫొటో పెట్టి.. క్లెయిమ్ ఫాంపై సైన్ చేయాలి.అప్‌లోడ్ డాక్యుమెంట్ అన్న దానిని క్లిక్ చేసి.. క్లెయిం ఫాం, పాన్ కార్డు అప్‌లోడ్ చేయాలి. (క్లెయిం అమౌంట్ రూ. 50 వేల కంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డు తప్పనిసరి).మీ క్లెయిమ్ రిక్వెస్ట్ నంబర్ తప్పనిసరిగా నోట్ డౌన్ చేసుకోండి. ఇది భవిష్యత్తులో రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. తొలుత రూ.10 వేలు డిపాజిట్ చేసిన వారికి ఇచ్చాక.. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి డబ్బులు జమ అవుతాయి .