Jagananna Vidya Deevena Payment News
JVD Payment ఏ బ్యాంకు అకౌంట్ లో జమ అవుతుంది ?
తల్లి లేదా / సంరక్షకుని ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్(NPCI )ఖాతాలో నగదు జమ అగును .ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయినది లింక్ అయిందా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Jagananna Vidya Deevena Status / జగనన్న విద్యా దీవెన స్టేటస్
ప్రతి ఏటా విద్యార్థులకు ఫీజు అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు ప్రతి క్వార్టర్ కి సంబంధించి తమ అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు. పూర్తి ప్రాసెస్ కింది. లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి
Step 1 : క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Step 2 : పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి
Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి
పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్ Success గా మారుతుంది. Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.