ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ - Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ - Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers

ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ - Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers



Distribution of HCM Two Page Letters by Grama Ward Volunteers  

HCM Two Page Letter Distribution Suevey Latest News - ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ సర్వే 


  • 2019 నుంచి 2024 వరకు గడిచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు Welfare schemes of Andhra Pradesh , అభివృద్ధి కార్యక్రమాలు andhra pradesh development dialogue, , సాధించిన విజయాలను తెలుపుతూ ఉన్నటువంటి రెండు పేజీల లేఖను ప్రతి ఇంటికి అందించాలనుకుంటుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల  సేవలను ఉపయోగించుకోనుంది.
  • ఐదేళ్లలో ఒక్కో ఇంటికి ఏ పథకంతో ఎంత ప్రయోజనం కలిగిందో వివరించనున్నారు. ఇదే సమయంలో ఆయా కుటుంబాలకు చెందిన ఒక సభ్యుడి ఈ-KYC తీసుకుంటారు. ఇంటి పట్టాల పంపిణీ, విలేజ్ క్లినిక్, సచివాలయాలు, రైతు భరోసా, RBKలు, ఇంగ్లిష్ మీడియం, ఆరోగ్య శ్రీ సహా పలు అంశాలను లేఖల్లో పొందుపరిచారు.
  • గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి సచివాలయముకు అందినటువంటి Distribution of HCM Two Page Letter రెండు పేజీల లేఖను తీసుకొని వారి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి హౌస్ హోల్డ్ కు అందించి , మొబైల్ యాప్ నందు eKYC తీసుకోవలసి ఉంటుంది.
  • ఈ సర్వే అనేది మార్చి 7 2024 మధ్యాహ్నం వైయస్సార్ చేయూత పథకం ప్రారంభం అయిన తరువాత ప్రారంభం అవుతుంది.మార్చి 10 2024 లోపు ఈ సర్వే ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఈ సర్వేకు సంబంధించి ప్రతి సచివాలయంలో వాలంటీర్లకు ట్రైనింగ్ అనేది మార్చి 6 మరియు 7వ తారీకులలో ఇవ్వడం జరుగుతుంది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కు రెండు పేజీల లేఖను ప్రింట్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడి నుండి మండల హెడ్ క్వార్టర్స్ కు పంపించడం జరుగుతుంది . వాటిని అందరూ MPDO లు వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కార్యదర్శులకు అందించి వాటిని వారి Beneficiary Outreach App లాగిన్ లొ ఎన్ని తీసుకున్నారో ఎప్పటికి అప్పుడు Acknowledgment చేయాల్సి ఉంటుంది. కార్యదర్శుల నుండి వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకు అందించడం జరుగుతుంది. 
  • సర్వేకు సంబంధించి సర్వే చేయు విధానము, సర్వే రిపోర్టు , సర్వేకు ఉపయోగపడే మొబైల్ యాప్ ను  మార్చి 6  చెయ్యటం జరుగును . 

 


Distribution of Two 2 Page Letter Timeline

  • 03 మార్చి 2024 : RDO వారి నుండి MPDO / MC వారు మెటీరియల్ తీసుకొనుట.
  • 07 మార్చి 2024 : MPDO / MC వారి నుండి సచివాలయాలకు మెటీరియల్ పంపించుట.
  • 06 మార్చి నుండి 07 మర్చి వరకు : వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చుట
  • 08 మార్చి నుండి 10 మార్చి వరకు : వాలంటీర్లు ఇంటింటికి లెటర్లను పంపిణీ చేయుట 


Distribution of Two 2 Page Letter Responsibilities 

: గ్రామా వార్డ్ వాలంటీర్లు :

  1. సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి నుండి మెటీరియల్ తీసుకోవటం.
  2. మార్చి 6 నుండి 7 లోపు సచివాలయం లొ జరిగే ట్రైనింగ్ కు హాజరు అగుట.
  3. క్లస్టర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వారు అందుకున్న లబ్దిని తెలియజేస్తూ 2 పేజీ ల లెటర్ ను అందుంచాలి. ఇస్తునప్పుడే ఇంట్లో ఎవరో ఒకరి eKYC తీసుకోవాలి.
  4. వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాటలాడుతూ పొందినటువంటి లబ్ధి కోసం పూర్తిగా తెలియజేయాలి.
  5. ప్రస్తుతం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.
  6. మార్చ్ 8న సర్వే మొదలుపెట్టి మార్చి 10 లోపు సర్వేను పూర్తి చేయాలి


: పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) :
  1. MPDO / MC వారి నుండి మెటీరియల్ తీసుకోవాలి.
  2. BOP యాప్ లొ ఎన్ని లెటర్ లు తీసుకున్నారు నమోదు చేయాలి.
  3. వాలంటీర్ వారీగా మెటీరియల్ను సపరేట్ చేసి
  4. సంబంధిత వాలంటీర్లకు మెటీరియల్ అందజేయాలి.
  5. ప్రతి వాలంటీర్ కు సచివాలయ సిబ్బందితో ట్యాగ్గింగ్ చేయాలి.
  6. టైం లైన్ ప్రకారం పంపిణీ పూర్తి అయ్యేలా చూసుకోవాలి.


: సచివాలయ సిబ్బంది :

  1. ట్యాగింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ మానిటరింగ్ చేయాలి.
  2. టైం లైన్ ప్రకారం త్యాగ్గింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయ్యేలా మరియు eKYC అన్నియు పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
  3. మైగ్రేషన్ మరియు డెత్ రిపోర్టులను సర్వే అయిన తర్వాత సిద్ధం చేసుకోవాలి.


వాలంటీర్లు పంపిణీ చేయు సమయంలో మొబైల్ యాప్ లో eKYC తీసుకునే విధానం :

ముందుగా గ్రామ లేదా వార్డు వాలంటీర్లు సచివాలయంలో కింద తెలిపిన లెటర్లను మీ మీ గ్రామా / వార్డు సచివాలయాలు నుండి తీసుకోవాలి.లెటర్ లొ కుటుంబ పెద్ద పేరు, చిరునామా, సచివాలయం పేరు ఉంటాయి. 

Step 1 : ముందుగా కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App కింద లింక్డౌ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి . 

Download Latest BOP App

Step 2 : Login పేజీ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసి Biometric / Irish / Face ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి .

Step 3 : Home Page లో HCM Letter Acknowledgement ( Final Year - Total Benefits Details ) అనే ఆప్షన్ పై టిక్ చేయాలి .

Step 4 : Select Cluster ID వద్ద వాలంటీర్ క్లస్టర్ ఐ డి ను ఏంచోకోవాలి . క్లస్టర్ లో ఉన్న అందరి పేర్ల లిస్ట్ చూపిస్తుంది .లబ్ధిదారుని పేరు , లబ్ధిదారుని ఆధార్ నెంబర్ , హౌస్ హోల్డ్ ఐ డి నెంబర్ చూపిస్తాయి .

Step 5 : లెటర్ ఎవరి కి ఇచ్చి eKYC తీసుకోవాలో వారి పేరు ను ఎంచివాలి . ఇంట్లో అందుబాటులో ఉండే వారి పేరు ఎంచువాలి . వారి eKYC తీసుకోవాలి .

Step 6 : మొత్తం 4  ప్రశ్నలు అడుగుతుంది . 

ప్రశ్న 1 : జగనన్న ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను రాబోయే ఐదేళ్లు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. మీకు, మీ కుటుంబానికి ఈ పథకాలతో మంచి జరిగిందనుకుంటున్నారా?

ప్రశ్న 2 : జగనన్న ప్రభుత్వం మీ ఇంటివద్దకే సేవలందించేందుకు ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు వాలంటీర్లను, సచివాలయాల వ్యవస్థను మున్ముందు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. ఈ వ్యవస్థ వల్ల మీకు మంచి జరిగిందనుకుంటున్నారా?

ప్రశ్న 3 : మన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న సురక్ష, నాడు నేడు పాఠశాలలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది. ఇది జగనన్న మాట. ఈ కార్యక్రమాలతో మీరు, మీ కుటుంబం ప్రయోజనాలు పొందారా?

ప్రశ్న 4 : జగనన్న నవరత్నాలు. ఇతర అన్ని పథకాలు ఇలాగే కొనసాగేందుకు, జగనన్నకు మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

HCM message :

  • మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులతో ఈ ఐదేళ్లు మీ బిడ్డ మీ ఊర్లోనూ మీ ఇంట్లో ఏమి మేలు చేశాడన్నది మీ కళ్లముందే కనిపిస్తోంది. ప్రతీ గ్రామానికి, ప్రతీ పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. (చదివి వినిపించండి)

అన్ని పప్రశ్నలు ప్రజలకు విమీపించి వారి నుంచి వచ్చే సమాధానం అవును / కాదు లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి . 

Step 7 : చివరగా ముందు సెలెక్ట్ చేసుకున్న వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి eKYC Biometric / Irish / Face ఆప్షన్ ద్వారా eKYC పూర్తి చేయాలి . 



వాలంటీర్ల సర్వే రిపోర్ట్ :

Volunteers eKYC Survey Report

PS / WAS Acknowledgement of Number of HCM letters received by the Secretariat 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App డౌన్లోడ్ చేసుకోవాలి .

Download New BOP App

Step 2 : PS / WAS వారి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి, ఆధార్ Authentication ద్వారా Beneficiary Outreach App లాగిన్ అవ్వాలి .



Step 3 Beneficiary OutReach App లాగిన్ అయిన తరువాత ఈ కింద విధంగా  స్రీన్ కనిపిస్తుంది .

 


Step 4 : మీరు Home స్రీన్ లో HCM Letter Received Status (Final year -Total Benefits Details) మీద క్లిక్  చేసిన తరువాత, మీకు ఈ కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .



Step 5 : ఇక్కడ మీరు Secretariat Code ని select చేసుకునుంటే మీకు కింద విధంగా  కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .


Step 6 : ఇక్కడ 

  • Secretariat Code, 
  • Number of HouseHolds, 
  • Number of HCM Letters Received upto Today,
  •  Number of HCM Letters Received Now, 
  • Date of Received . 

వివరాలు Display అవుతాయి. 

ఇక్కడ  Number of HCM Letters Received Now కి సంబందించి HCM Letters కౌంట్ ని enter చేయవలసి ఉంటుంది. Date of Received కి Date ని select చేసుకున్న తరువాత submit button ని click చేస్తే Data Saved Successfully అని మెసేజ్ Display అవుతుంది.




HCM Letters Received Status (Final year -Total Benefits Details)  Report :

Two Page Letters Received Report


HCL Letter Final Year Total Benefits Details ( Cheppadante Chestadante ) Letter Model 

Distribution of 2 pages letter with variable data in back to back to be given to every household in the state Circular   


మరింత సమాచారం >>
close