Register Complaint in Andhra Pradesh Process
ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఫిర్యాదులు చేయుటకు ప్రభుత్వం ఒక కార్యక్రమమును నడుపుతున్నది. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం Spandana Program పేరుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక / PGRS - Public Grievance Redressal System గా మార్చడం జరిగినది .
ప్రజల నుంచి ఫిర్యాదులను ఆనులైనులో స్వీకరించుటకు గాను ప్రభుత్వం కొత్తగా వెబ్సైటు కూడా ప్రారంభించడం జరిగినది . ప్రస్తుతం వెబ్సైటు పనిచేస్తున్నది. అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ప్రభుత్వం అందించే సేవలు , ప్రభుత్వం ద్వారా అందవలసిన ప్రయోజనాలు , పథకాలు , ఇతర అన్ని రకముల ప్రభుత్వ కార్యక్రమాలు లో ఎటువంటి సమస్యలు ఉన్న , ప్రభుత్వ కార్యాలయంలో ఎటువంటి ఇబ్బందులు పడిన , మీ గ్రామంలో పారిశుద్ధ్యం , త్రాగునీరు సమస్యలు ఇతర సమస్యలు ఉన్న ఈ వెబ్సైట్లో మీరు ఫిర్యాదును పంపవచ్చు.
Meekosam Portal Complaint Registration Process in Andhra Pradesh
ఆనులైన్లో ఫిర్యాదు చేయు విధానము
ముందుగా కింద ఇవ్వబడిన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో Meekosam Portal వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Citizen Login చేసుకోండి . ఆధార నెంబర్ ఎంటర్ చేసి Get eKYC OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను Enter OTP ఎంటర్ చేసి Verify eKYC OTP పై క్లిక్ చెయ్యండి .
Grievance Registration పై క్లిక్ చెయ్యండి .
తరువాత కింద అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
Do You Want to Change Mobile No? - Yes / No
Personal Information
- Name
- C/O Name
- DOB
- District
- Mandal
- GS/WS Name
- House No
- Habitation
- Gender
Type Of Grievance Individual/ Community
- Individual
- Community
Location of the Grievance
- District
- Mandal
- GS/WS Name
Grievance Information
- Search for a Sub Subject
- Search for a Sub Subject
- Department
- HOD
- Subject
- Sub Subject
- Source Type
Remarks
Submit Grievance పై క్లిక్ చెయ్యాలి . అర్జీ నెంబర్ SMS రూపం లో వస్తుంది .
PGRS Complain Status Checking Link
కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Meekosam Complain Status Link పై క్లిక్ చెయ్యండి .
Grievance No వద్ద మీ అర్జీ నెంబర్ ఎంటర్ చేయాలి , పక్కన Captcha Code వద్ద నెంబర్ ఎంటర్ చేసి Get Details పై క్లిక్ చేయాలి .
మీ అర్జీ యొక్క స్టేటస్ తెలుస్తుంది .