Kotak Kanya Scholarship 2024-25
Kotak Kanya Scholarship 2024-25 Aim
- దేశంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్యలో తోడ్పాటు అందించేందుకు కోటక్ మహీంద్ర సంస్థ చేయూతనిస్తోంది.
- 'కోటక్ కన్యా స్కాలర్‌షిప్' Kotak Kanya Scholarship 2024-25 పేరుతో కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ ఉపకారవేతనాలను అందిస్తోంది.
- మహిళా విద్యార్థులను శక్తివంతం చేయడం, వారిని ఉన్నత విద్యను అభ్యసించడానికి తోడ్పాటు అందించడం ఈ స్కాలర్‌షిప్ యొక్క ప్రధాన లక్ష్యం.
- Kotak Kanya Scholarship 2024-25 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 సెప్టెంబర్ 30 .
Kotak Kanya Scholarship 2024-25 Eligibility
కోటక్ కన్యా స్కాలర్‌షిప్ ఎవరు అర్హులు
- కింద తెలిపిన కోర్స్ లు చదివే విద్యార్థినులు అర్హులు
- Engineering,
- MBBS,
- BDS,
- ఇంటిగ్రేటెడ్ LLB (5 సంవత్సరాలు),
- B.Pharm.,
- BSC
- నర్సింగ్,
- ఇంటిగ్రేటెడ్ BA-MS/BA-రిసెర్చ్,
- ఐసర్,
- IISC(బెంగళూరు)
- లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు (డిజైన్, ఆర్కిటెక్చర్, మొదలైనవి)
- కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
- కళాశాల ప్రవేశ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
- కోటక్ సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
Kotak Kanya Scholarship 2024-25 Amount
కోటక్ కన్యా స్కాలర్‌షిప్ స్కాలర్‌షిప్ ఎంత..?
ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్, పుస్తకాలు, స్టేషనరీ ఖర్చుల కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు.
Kotak Kanya Scholarship 2024-25 Documents
కోటక్ కన్యా స్కాలర్‌షిప్ కావాల్సిన డాక్యుమెంట్లు.
- ఇంటర్ మార్కుల మెమో
- తల్లిదండ్రులు/సంరక్షల ఆదాయ ధ్రువీకరణ
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్
- కళాశాల ఫీజు వివరాలు
- విద్యార్థుల బోనఫైడ్ సర్టిఫికేట్, కళాశాల లెటర్
- కళాశాలలో సీటు కేటాయింపు ధ్రువీకరణ లెటర్
- కళాశాల ప్రవేశ పరీక్ష స్కోరుకార్డు
- ఆధార్ కార్డు
- బ్యాంకు పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్
- డెజెబిలిటీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)
- పేరెంట్ డెత్ సర్టిఫికేట్ (సింగిల్ పేరెంట్/అనాదలు)
- ఇంటికి సంబంధించిన ఫొటోగ్రాఫ్
Kotak Kanya Scholarship 2024-25 Application Process
కోటక్ కన్యా స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానం
Step 1 : స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మొదట దిగువ ఇవ్వబడిన లింక్ ఓపెన్ చెయ్యండి .
Step 2 : అక్కడ హోంపేజీలో Kotak Kanya Scholarship 2024-25 లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3 : స్కాలర్‌షిప్ వివరాల తర్వాత కింది భాగంలో కనిపించే ‘Apply Now’ బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 4 : ‘Online Application Form Page’ పేజీలో తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
Step 5 : మొదటిసారి దరఖాస్తు చేసుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్, ఫోన్ నెంబరు, జీమెయిల్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 6 : రిజిస్ట్రేషన్ పూర్తికాగానే.. ‘Kotak Kanya Scholarship 2024-25’ దరఖాస్తు పేజీలోకి వెళ్లాలి.
Step 7 : దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ‘Start Application’ బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 8 : స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫామ్‌లో అవసరమైన వివరాలన్నీ నమోదుచేయాలి.
Step 9 : అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
Step 10 : ‘Terms and Conditions’ అన్ని ఆమోదించి ‘Preview’ బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 11 : దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.