GSWS Employees Transfers 2024 Guidlines GSWS Employees Transfers 2024 Guidlines

GSWS Employees Transfers 2024 Guidlines

 

Grama Ward Sachivalayam Employees Transfers 2024 Guidlines

Grama Ward Sachivalayam Employees Transfers 2024 Guidlines


  • ప్రస్తుతం జరుగుతున్న గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలలో ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న పనుల నుంచి ఇబ్బంది కలగకుండ కొందరిని బదిలీల నుండి మినహాయించడం జరిగినది. మినహాయింపబడిన ఉద్యోగులు 
    • విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II)
    • విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
    • విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
    • పశుసంవర్ధక సహాయకుడు
    • విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
    • ANM Gr-III/వార్డ్ ఆరోగ్య కార్యదర్శి.

  • సెప్టెంబర్ నెల 2024 పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ బదిలీలలో బదిలీ అయిన గ్రామ వార్డు సచివాలయ  ఉద్యోగులకు వారి ప్రస్తుత స్థానం నుంచి విడుదల చేస్తూ రిలీవింగ్ లెటర్ ఇవ్వవలసిందిగా విడుదలైన ఉత్తర్వులు.


GSWS Employees Transfers Guidlines 2024 

  1. ఈ బదిలీలు కేవలం అభ్యర్థన మేరకు [ Request Based Transfers ] ఉండనున్నాయి  . తప్పనిసరిగా బదిలీ అవ్వవలసిన అవసరం లేదు. 
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మరియు ఉద్యోగుల అప్పాయింటింగ్ అథారిటీ వారు అందరు ఉద్యోగుల వారి వారి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన వివరాలను సచివాలయ ఉద్యోగుల  HRMS Portal లాగిన్ లొ పెట్టడం జరుగుతుంది. అన్ని గ్రామ వార్డు సచివాలయలలో నోటీస్ బోర్డ్ లో కూడా పెట్టడం జరుగుతుంది. 
  3. బదిలీలకు సంబంధించి జిల్లా అధికారులు దరఖాస్తు చేసిన దరఖాస్తులను Download చేసుకొని, వెరిఫై చెసి, కేటగిరీల వారీగా దరఖాస్తులను వేరు చేసి, ఉద్యోగి ర్యాంకు ఆధారంగా సీనియార్టీ ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఉంచడం జరుగుతుంది. 
  4. ప్రభుత్వ టైం లేని ప్రకారం ఉద్యోగుల అపాయింటింగ్ అథారిటీ వారు వారికి కుదిరిన తేదీలలో భౌతికంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఆగస్టు 31 తేదీ లోపు  పోస్టింగ్ ఆర్డర్లను ఉద్యోగులకు అందించవలసి ఉంటుంది. 
  5. అత్యవసర పరిపాలన అవసరాల రిత్యా గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్ అథారిటీ వారు ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని అయినా బదిలీ చేయుటకు అధికారం కలదు. 
  6. బదిలీ కొరకు దరఖాస్తు చేసిన ఉద్యోగుపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు / ACB కేసు లు / విజిలెన్స్ కేసులో ఉన్నచో వారి  బదిలీ రిక్వెస్ట్ రద్దు అవుతుంది.
  7. రిక్వెస్ట్ బేస్ మీద బదిలీ అయ్యే ఉద్యోగులకు ఎటువంటి బదిలీ సదుపాయాలు / TTA ఉండవు.  
  8. ఏ ఉద్యోగికి వారి వారి సొంత గ్రామపంచాయతీలో లేదా వార్డులో పోస్టింగ్ ఇవ్వరాదు.
  9. దరఖాస్తు సమయంలో ఎటువంటి తప్పుడు సమాచారం గానీ తప్పుడు డాక్యుమెంట్లు గాని సబ్మిట్ చేసిన ఉద్యోగపై  శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా విధించడం జరుగుతుంది. 
  10. ఈ బదిలీలలో ముఖ్యంగా మొదట ITDA ప్రాంతాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసిన తదుపరి మాత్రమే ITDA పరిధిలో లేని ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. 
  11. బదిలీల కొరకు ఆనులైనులో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్ కు  అటెండ్ అవ్వకపోతే వారి బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వారికి బదిలీలు జరగవు.
  12. అత్యవసర పరిపాలన అవసరాల రిత్యా గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్ అథారిటీ వారు ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని అయినా బదిలీ చేయుటకు అధికారం కలదు.


బదిలీ కొరకు దరఖాస్తు చేయాలనుకునేవారు కింద తెలిపిన లింక్ ద్వారా లాగిన్ అయ్యి బదిలీ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి బదిలీ కొరకు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 

GSWS Transfers Online Process  

ITDA Permisis Posting Guidlines

  • తప్పనిసరిగా ఉద్యోగుల వయసు 50 సంవత్సరాలు లోపు ఉండవలెను.  
  • ITDA పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ వారి సర్వీస్ కాలాన్ని ఎక్కువ నుండి తక్కువ ఆర్డర్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 
  • ముందుగా ఐటీడీఏ పరిధిలో పనిచేసి ప్రస్తుతం ఐటిడిఏ దాటి ఎవరైనా బదిలీ అయినచో ముందుగా వారు కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ ఆర్డర్ లేదా జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రస్తుత ఐటిడిఏ పరిధి నుండి కదిలే విధముగా జిల్లా కలెక్టర్లు మరియు అపాయింట్మెంట్ అథారిటీ వారు చూడవలెను.  
  • ప్రస్తుతం Non ITDA నుండి ITDA ప్రాంతంలో ఉండే సచివాలయ కు బదిలీ అయ్యే ఉద్యోగులు  ఆర్డర్ వచ్చిన వెంటనే సంబంధిత ITDA సచివాలయాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా రిపోర్టింగ్ చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. 
  • ఉద్యోగుల రిలీవింగ్ చేయు సమయంలో అపాంటింగ్ అథారిటీ వారు తప్పనిసరిగా ఆయా ఉద్యోగుపై రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చే సమయానికి ఎటువంటి  బకాయిలు గాని లీగల్ కేసులు గాని ఉండరాదు. 
  • ITDA పరిధిలో లేనటువంటి ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ ఖాళీలు ఉంటాయో ఆ ప్రదేశంలో ముందుగా బదిలీల పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 

    ITDA పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలలో రెండు సంవత్సరాల సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వారికి నచ్చిన ప్రదేశంలో  బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 



Transfers Helpline Numbers of GSWS Employees 

ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే ఫోన్ చేయుటకు అవుతుంది. 


Counselling Order - Required Documents :

 కౌన్సిలింగ్ సమయంలో ప్రాధాన్యత నిచ్చే క్రమము   - వెరిఫై చేయు ఒరిజినల్ సర్టిఫికెట్లు  

  • అందులు - జిల్లా హెల్త్ బోర్డు వారి నుండి లేదా రాష్ట్ర హెల్త్ బోర్డు వారి నుండి మెడికల్ సర్టిఫికెట్  +  No Dues Certificate 
  • మానసిక వికలాంగులు అయినటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు - జిల్లా హెల్త్ బోర్డు వారి నుండి లేదా రాష్ట్ర హెల్త్ బోర్డు వారి నుండి మెడికల్ సర్టిఫికెట్  +  No Dues Certificate 
  • గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీసు చేసిన ఉద్యోగులు  - డ్యూటీ సర్టిఫికేట్  + No Dues Certificate 
  • 40% లేదా ఎక్కువ ఉన్న దివ్యాంగులు - సదరం సర్టిఫికెట్  + No Dues Certificate 
  • మెడికల్ గ్రౌండ్ పై ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసిన ఉద్యోగులు [ Cancer, Open Heart Operations, Neurosurgery, Kidney Transplantation etc ] - జిల్లా హెల్త్ బోర్డు వారి నుండి లేదా రాష్ట్ర హెల్త్ బోర్డు వారి నుండి మెడికల్ సర్టిఫికెట్  +  No Dues Certificate 
  • కారుణ్య నియామకంపై  ఉద్యోగం పొందిన మహిళా ఉద్యోగులు  - కారుణ్య నియామక ఆర్డర్ + No Dues Certificate  
  • Spouse Ground - మ్యారేజ్ సర్టిఫికెట్ + Spouse సర్టిఫికెట్ + Employees Authorization Latter With Employees ID, Spouse Aadhaar + No Dues Certificate   
  • Mutual - No Dues Certificate   

Download All Certificate

GSWS Employees Transfers Schedule 

  • 27-08-2024 : ఆను లైన్ లో దరఖాస్తు చేయుటకు చివరి తేదీ  
  • 28-08-2024 : దరఖాస్తులను సీనియార్టీ ప్రాప్తికి కేటగిరీల వారీగా అమర్చుటకు చివరి తేదీ  
  • 29-08-2024 & 30-08-2024 : కౌన్సిలింగ్ తేదీ మరియు బదిలీ ప్రొసీడింగ్ ఇచ్చుట 
  • 30-08-2024 Onwards : బదిలీలపై అర్జీల నమోదు.