AP Employees General Transfers 2024 Guidelines
AP Govt Employees Transfers Updates
- రాష్ట్ర ప్రభుత్వం 15 శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం ఇచ్చింది . బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని 2024 ఆగస్టు 19 నుంచి 31 వరకు ఎత్తివేసింది.
- ఉపాధ్యాయులు, వైద్యులకు ఇందులో బదిలీలకు అవకాశం లేదు .
- గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన బదిలీల అవకాశం .
- ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబరు 5 నుంచి 15 వరకు బదిలీలకు వీలు కల్పించింది.
- సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉపాధ్యాయులతోపాటు విద్యా శాఖలో ఇతర ఉద్యోగులకూ బదిలీల్లేవు. వైద్య ఆరోగ్య, వ్యవసాయ అనుబంధ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించలేదు.
AP Employees General Transfers 2024 Guidelines
- 2024 జులై 31 నాటికే ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అన్ని క్యాడర్లు, పోస్టుల్లో చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పని చేశారనేది లెక్కించాలి.
- ఐదేళ్లు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాలనా అవసరాలు, వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయొచ్చు.
- సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్లీ యథాస్థానాలకు మార్చింది. ఆ ఉత్తర్వులు, ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోరు.
- అంధులు, మానసిక వైకల్యమున్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో ఆ ప్రదేశానికి బదిలీ కోరుకుంటే వారికే అధిక ప్రాధాన్యం.
- గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పని చేసినవారికి, 40 శాతానికి మించి వైకల్యమున్న ఉద్యోగులకు ధ్రువీకరణపత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యం.
- తొలుత ఐటీడీఏల పరిధిలో, ఏజెన్సీ ప్రాంతాల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. బాగా వెనుకబడిన ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న ఖాళీలను బదిలీల సమయంలో తొలుత భర్తీ చేయాలి. ఇందుకు ఆయా ప్రభుత్వశాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలి.
- గిరిజన ప్రాంతాలకు (ఐటీడీఏల పరిధిలోకి) బదిలీ చేసే క్రమంలో ఆ ఉద్యోగి వయసు 50 ఏళ్ల కన్నా తక్కువై ఉండాలి. ఐటీడీఏల పరి పని చేయకుండా బయటి ప్రాంతాల్లో సుదీర్ఘ సర్వీసున్న వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతం నుంచి ఒక ఉద్యోగి బదిలీ అయితే ఆ పోస్టులోకి మరొకరి నియామకం జరిగితే తప్ప వారిని ఆ పోస్టు నుంచి రిలీవ్ చేయకూడదు. గిరిజన ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ణీత వ్యవధిలోగా ఆ పోస్టులో చేరకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
- అంధత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చని పేర్కొంది.
- భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులయితే వీలైనంత వరకు ఒకేచోటకు లేదా సమీప ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
- ఉద్యోగి/జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యమిస్తారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్య అవసరాలు ఉన్నవారికే మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత వైద్యం అందుబాటులో ఉండే ప్రదేశాలకు వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది.
- భర్తను కోల్పోయి కారుణ్య నియామకం పొందిన ఉద్యోగినులకు బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది.
- ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలు, ఇచ్చిన రాయితీలు దుర్వినియోగం కాకుండా నిశితంగా పరిశీలించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాట చేయాలి.
- గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్ల బదిలీల విషయంలో 2022 జూన్ 15న సాధారణ పరిపాలనాశాఖ ఇచ్చిన ఉత్తర్వులే వర్తిస్తాయి. ఆఫీసు బేరర్ గా ఒకేచోట 9 సంవత్సరాలు పని చేసేందుకు వీలు కల్పిస్తారు. పాలనా సౌలభ్యం కోసం అవసరమైతే ఈ మినహాయింపు కూడా వర్తించదు.
- తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీసు బేరర్ల జాబితాను గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు జిల్లా కలెక్టర్ ద్వారా, రాష్ట్ర స్థాయి సంఘాలు సాధారణ పరిపాలనాశాఖ ద్వారా సంబంధిత విభాగాధిపతులకు అందజేయాలి. మిగిలిన ఏ రూపాల్లో ఆ జాబితా అందినా పరిగణనలోకి తీసుకోకూడదు.
AP Employees General Transfers 2024 Employees Caterogies
- రెవెన్యూ (భూ పరిపాలన)
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్
- పురపాలక, పట్టణాభివృద్ధి
- గ్రామ, వార్డు సచివాలయాలు
- పౌరసరఫరాలు
- గనులు, భూగర్భవనరులు
- దేవాదాయ
- రవాణా
- అటవీ- పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలు.
- పరిశ్రమలు
- ఇంధనశాఖ
- స్టాంపులు రిజిస్ట్రేషన్లు
- వాణిజ్య పన్నులు
- ఎక్సైజ్
- అన్ని శాఖల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది
ఈ శాఖల్లో అన్ని క్యాడర్లలోనూ బదిలీలకు వీలు కల్పించారు.
Grama Ward Sachivalayam Employees Transfers 2024 Latest Update
- ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో జూలై 31 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీలు తప్పనిసరి అని పేర్కొన్నారు.
- రాష్ర్టంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి అవుతుంది.
- ఒకవేళ ప్రభుత్వం కటాఫ్ తేదీన జూలై 31 కి కాకుండా అక్టోబర్ 31 నాటికి పరిగణిస్తే,దాదాపు అందరికీ 5 ఏళ్ల సర్వీసు పూర్తి అవుతుంది.ఎక్కువ మంది బదిలీలకు అవకాశం ఉంటుంది.
- జూలై 31 కటాఫ్ తీసుకోవడం 4 సంవత్సరాల 10 నెలలు సర్వీసు పూర్తి చేసిన వారు అవుతారు. ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల సర్వీస్ ని ఎస్టిమేషన్ ఫిగర్ ఐదు సంవత్సరాలుగా బదిలీలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అందరికీ ఐదు సంవత్సరాల కచ్చితమైన డేట్ ని ఇవ్వలేరు కాబట్టి సచివాలయం ఎంప్లాయిస్ కి సంబంధించిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలాన్ని ఐదు సంవత్సరాల క్రింద కన్సిడర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చాలామంది సచివాలయ ఉద్యోగుల మనవి.
- అలా కాకుండా ఇచ్చిన జీవో ప్రకారం చేయాలి అంటే చాలామంది ఉద్యోగులు తప్పనిసరి బదిలీ చేస్తే తప్ప బదిలీ అయ్యే అవకాశం లేదు.