Toilet Photo Duty to Grama Ward Sachivalayam Employees
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి Toilet Photo తీసి, IMMS Mobile App యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది.
ఆయా సచివాలయాల్లోని వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
Download Toilet Photo Duty Circular
దీనికిగాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన IMMS App లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం IMMS User Name - Password కల్పించింది. అలాగే బుధ, గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు సమగ్రశిక్ష ఎస్పీడీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.
మరుగుదొడ్ల ఫొటోలను అప్లోడ్ చేసే బాధ్యతను గతంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు(హెచ్.ఎం) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, తాము చదువు చెప్పేందుకు వచ్చామని, మరుగుదొడ్ల ఫొటోలు తీసేందుకు కాదని హెచ్.ఎంలు గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం వారిని ఆయా పనుల నుంచి తీసి ఈ నిర్ణయం ప్రభుతం తీసుకుంది .
Waht is TMF Toilet Maintenance Fund ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి టాయిలెట్లు, మూత్ర విసర్జన గదులు , డ్రెస్ మార్చుకునే గదులు , వాష్ బేసిన్లు మరియు టాయిలెట్లకు సంబంధించిన ఇతర వస్తువులకు నిర్వహణ కొరకు ప్రభుత్వం Toilet Maintenance Fund TMF టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగినది. వీటి నిర్వహణ కొరకు ప్రభుత్వం IMMS Mobile App అనే మొబైల్ యాప్ ను కూడా డిజైన్ చేస్తే ప్రస్తుతం రన్నింగ్ చేస్తూ ఉన్నది.
Roles Of HM , WEA , WES and SMS Member
Role Of Head Master in Toilet Maintenance Fund
- IMMS Mobile App లో ఇక ఫోటో తీసి అప్లోడ్ చేయనవసరం లేదు .
- IMMS Mobile App లో సర్వే ఫారం ఉంటుంది ఆ ఫారం లో డేటా అప్డేట్ చేయాలి .
- పప్రతీ రోజు సాయంత్రం సర్వే ఫారం లో డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది .
Roles Of Welfare & Education Assistant and Ward Education Secretary
- సందర్శన సమయంలో IMMS APP / CR APP లో Toilet Photo అప్లోడ్ చేయాలి .
- వారానికి రెండు సార్లు సోమవారం , గురు వారం నాడు పాఠశాలలను విసిట్ చేయాలి .
- ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి టాయిలెట్లు, మూత్ర విసర్జన గదులు , డ్రెస్ మార్చుకునే గదులు , వాష్ బేసిన్లు మరియు టాయిలెట్లకు సంబంధించిన ఇతర వస్తువులకు నిర్వహణ పరిశీలించాలి .
- IMMS APP / CR APP లో రెమర్క్ ను ఎంటర్ చేయాలి .
Roles Of SMC School Management Commitee Members
- SMC సబ్యులకు మరియు చైర్మన్ కు IMMS Mobile App లో లాగిన్ ID మరియు పాస్వర్డ్ లు ఇవ్వటం జరిగింది .
- SMC సబ్యులు పాఠశాలలను ప్రతి బుధవారం మరియు శుక్ర వారం నాడు సందర్శించాలి .
- IMMS Mobile App లో టాయిలెట్ ఫోటో ను అప్లోడ్ చేయాలి .
What Toilet Photo Duty Circular Contains
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్రశిక్ష ఎస్పీడీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు.
దీనికిగాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం కల్పించింది. అలాగే బుధ, గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్, సభ్యులు కూడా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని సూచించింది. దీంతో, గత ప్రభుత్వ హాయంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించిన ఈ ఫొటోల బాధ్యతను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఇక నుంచి ప్రతీ వారం కొత్త బాధ్యతలను సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సి ఉంటుంది.