Aadhaar Training Material in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ & వార్డు సచివాలయాలలో ఆధార్ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసినదే . ఆధార్ సేవలను ఆధార్ ఆఫీసర్ అయినటువంటి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ & వార్డులో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు ఆధార్ సేవలను అందిస్తున్నారు .
ఆధార్ సేవలు చేసిన తరువాత ఎటువంటి రిజెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఆధార్ ఆఫీసర్లకు ఆధార్ పై తగిన అవగాహన తప్పనిసరి . అందుకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం ఆధార్ ఆఫీసర్లకు ఆధార్ సమస్యలపై , ఆధార్ పై ఉన్నటువంటి లేటెస్ట్ విషయాలపై ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు . ఈ ట్రైనింగ్ ద్వారా ఆధార్ ఆఫీసర్లు ఆధార్ సేవలు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా , రిజెక్ట్ అయ్యే పర్సంటేజ్ తక్కువ ఉండేలా ఎక్కువ సర్వీసులు చేసే విధముగా ట్రైనింగ్ ఉంటుంది .
ఈ పోస్టులో ఆధార్ సర్వీసులు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, రిజెక్ట్ అవ్వకుండా ఆధార్ ప్యాకెట్ పూర్తి అయ్యేందుకు తీసుకోవలసిన పూర్తి జాగ్రత్తల కోసం చూద్దాం.
Aadhaar Errors - Penalties :
Biometric Update :
- ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయు సమయంలో ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ స్క్రీన్లో గ్రీన్ మార్క్ లో 60 % మించి రిజల్ట్ వచ్చినప్పుడు , ముందు చేసి అసంపూర్తిగా ఉండి , ఎరుపు రంగులో ఉన్నటువంటి పాత వాటిని డిలీట్ చేయవలెను.
- 1st Attempt లోనే మొత్తం గ్రీన్ వచ్చి , 60% మించి రిసల్ట్ వస్తే ఒక సారి బయో మెట్రిక్ తీసుకుంటే సరిపోతుంది . 100% వస్తే చాలా మంచిది . రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది .
Photo Capture Need :
- గతంలో బయోమెట్రిక్ అప్డేట్ కు కేవలం బయోమెట్రిక్ మరియు ఐరిష్ మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు కానీ ఇప్పుడు ఫోటో కూడా పరిగణ లోకి తీసు కుంటున్నారు కావున ఫోటో తీసేటప్పుడు ఎక్కువ పర్సంటేజ్ వచ్చేలా ఫోటోలు క్లియర్గా తీయవలెను.
- గతంలో అప్లికేంట్ యొక్క ఫోటోకు మరియు ఇప్పుడు తీస్తున్న ఫోటోకు మ్యాచింగ్ అయ్యేలా ఉండవలెను .
- ఒకవేళ గతంలో తీసిన ఫోటో ఇప్పుడు తీస్తున్న ఫోటోకు ఎక్కువ సంవత్సరాలు గ్యాప్ ఉన్నట్టయితే అప్పుడు ఫోటో కరెక్ట్ గా తీస్తూ బయోమెట్రిక్ & ఐరిస్ ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి .
Mobile Number Link :
- మొబైల్ నెంబర్ అప్డేట్ కు కూడా అప్లికేంట్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిష్ తో పాటుగా ఫోటో కూడా గతంలో ఉన్న డేటాతో మ్యాచ్ అవ్వవలెను.
Voter Card :
- ఓటర్ కార్డును POI మరియు POA ఉపయోగించే సమయంలో ఓటర్ కార్డు నెంబరు AP సిరీస్తో మొదలైనట్టయితే వాటిని వీలైనంతవరకు Accept చెయ్యకండి .ఎందుకంటే వాలిడేషన్ సమయంలో AP తో మొదలైన వాటి నెంబర్ కొట్టినట్లు అయితే కొత్త ఓటర్ కార్డు నెంబర్ Ex. BFX XXXX , RYZ XXX ఇలా ఇలా జనరేట్ అవ్వాలి, అవ్వకపోతే అవి రిజెక్ట్ అవుతాయి. కావున వీలైనంతవరకు కొత్త ఓటర్ కార్డు ను మాత్రమే Accept చెయ్యండి .
- ఓటర్ కార్డును తప్పనిసరిగా రెండు వైపులా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి .
- ఓటర్ కార్డును ఉపయోగించి చిరునామాను మార్చినట్లయితే ఓటర్ కార్డులో చిరునామా ఎలా ఉందో అలానే క్లైంట్ యాప్ లో నమోదు చేయాలి , ఎటువంటి మార్పులు చేయరాదు . డోరు నెంబరు 000 ఉంటే క్లైంట్ లో కూడా అదే విధంగా 000 నమోదు చేయాలి . కొత్తగా ఎటువంటి వివరాలు ఓటర్ కార్డులో లేనివి Add చెయ్యకూడదు .ఓటర్ కార్డు లో Street అని ఉంటె SC Street అని నమోదు చేసిన Reject అవుతుంది . కేవలం Locality సెక్షన్ లో మాత్రమే ఏదైనా సెక్షన్ Add చేసుకోవచ్చు .
Join GSWS Helper WhatsApp Channel
Birth Certificate :
- CRS / Mee Seva Site ఇచ్చిన ఒరిజినల్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ను మాత్రమే యాక్సెప్ట్ చేయాలి.
- చేతితో రాసినటువంటి / Manual Birth Certificate లను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించరాదు .వాటిని రిజెక్ట్ చేయాలి.
- CRS ద్వారా ఇచ్చినటువంటి సర్టిఫికెట్ను మొబైల్ స్కానర్ లో స్కాన్ చేసినట్లయితే అధికారిక కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ అయినటువంటి crsorgi.gov.in నుంచి సమాచారం చూపించాలి. అదే మీ సేవా సర్టిఫికెట్ అయినట్లయితే మీసేవ పోర్టల్ లో మీసేవ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు చూపించాలి .
PAN Card :
- PAN Card ను POI గా వాడి పేరు కర్రెచ్షన్ చెయ్యవచ్చు .
- పాత PAN Card POI గా వాడినట్లు అయితే తప్పనిసరిగా కార్డు పై హాలోగ్రామ్ ఉండాలి.
- e PAN కార్డు వాడితే తప్పనిసరిగా Digital Sign Success అయ్ ఉండాలి .
Driving Licence :
- డ్రైవింగ్ లైసెన్స్ ను POI గా వాడాలి .
- డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు తేదీ వెనుక వైపు ఉంటుంది, అది చూసి చెల్లుబాటులో ఉంటే మాత్రమే కార్డును ప్రూఫ్ కింద స్వీకరించాలి.
- రెండు వైపులా స్కాన్ చేయాలి .
New Enrollment :
- కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ? కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .
- ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.
- బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .
- బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే : ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.
- తల్లి లేదా తండ్రి ఆధార్లో పేరు మరియు పుట్టిన తేదీ సర్టిఫికెట్ లో పేరు తప్పనిసరిగా మ్యాచ్ అయి ఉండాలి . మరీ ముఖ్యంగా బిడ్డ C/O ఎవరి పేరు రావాలో వారి ఆధార్ లో ఉన్న పేరు మరియు పుట్టిన తేదీ సర్టిఫికెట్ లో ఉన్న పేరు ఒకేలా ఉండాలి .
- బిడ్డతో తల్లి వచ్చినట్టయితే బిడ్డ పుట్టిన తేదీ సర్టిఫికెట్ లో తల్లి యొక్క అత్తగారి ఇంటి పేరు ఉండి తల్లి ఆధార్ కార్డులో పుట్టింటి వారి ఇంటిపేరు ఉంటే అటువంటిది రిజెక్ట్ అవుతాయి . అటువంటి సందర్భంలో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లో మరియు తల్లి ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండాలి లేదా అందుబాటులో ఉన్నట్టయితే, తండ్రితో కొత్తగా ఆధార్ కార్డు చేయిస్తే సరిపోతుంది . కూడా తండ్రి యొక్క ఆధార్ కార్డు లోని పేరు పుట్టిన తేదీ సర్టిఫికెట్ లోని పేరు ఒకేలా ఉండాలి .
- బిడ్డతో తల్లి లేదా తండ్రి వచ్చినట్టయితే ఎవరి పేరు ద్వారా నమోదు చేస్తున్నారో వారి యొక్క Mandatory Biometric Update [ MBU ] తప్పనిసరిగా పూర్తి అయి ఉండాలి .చెక్ చేయటం కోసం ఆధార్ క్లయింట్ లో ఆధార్ ఎంటర్ చేస్తే సరిపోతుంది . ఒకవేళ MBU పూర్తి అయి లేకపోతే కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఆపి , ముందుగా MBU పనిని పూర్తి చేయాలి .
- తప్పనిసరిగా తల్లి / తండ్రి ఆధార్ Active లో ఉండాలి . దానికి Aadhaar Validation Portal లో ఆధార్ నెంబర్ ఇంతే చేసి చేసి చెయ్యగలరు .
Marriage Certificate :
- Marriage Certificate ను పేరు మార్పు & చిరునామా మార్పు కోసం వాడుకోవచ్చు .
- Grama Ward Sachivalayams Marriage Certificate లో Panchayti Secretary / Ward Admin Secretary వారు ఇచ్చే Marriage Certificate ను Accept చేయరాదు . వాటికి ఆధార్ లో మార్పులకు చెల్లుబాటు లేదు .
- Marriage Certificate కేవలం Marriage Registrar ద్వారా ఇచ్చినవి మాత్రమే చెల్లుబాటు అవుతాయి . మిగతా Khadi [ Muslim Marriage ] ,Chruch Marriage Certificate వంటి సర్టిఫికెట్స్ ఆధార్ లో మార్పులకు చెల్లవు .
- Marriage Certificate With Photo : Name Correction కోసం - కేవలం ఆడవారి ఇంటి పేరు మార్పు మాత్రమే అవుతుంది, పూర్తి పేరు మారదు . చిరునామా ను HOF బయోమెట్రిక్ ద్వారా మార్చుకోవచ్చు , ఆ సమయం లో HOF ఫోటో కాకుండా కేవలం దరఖాస్తు దారుని ఫోటో మాత్రమె తీయవలెను . కేవలం Marriage Certificate మాత్రమే Upload చేస్తే సరిపోతుంది .
- Marriage Certificate With Out Photo : Name Correction కోసం - కేవలం ఆడవారి ఇంటి పేరు మార్పు మాత్రమే అవుతుంది, పూర్తి పేరు మారదు . చిరునామా ను HOF బయోమెట్రిక్ ద్వారా మార్చుకోవచ్చు , ఆ సమయం లో HOF ఫోటో కాకుండా కేవలం దరఖాస్తు దారుని ఫోటో మాత్రమె తీయవలెను . Marriage Certificate తో పాటు దరఖాస్తు దారుని POI కూడా Upload చేయాలి . అంటే ఒరిజినల్ PAN / Voter / Ration Card / SSC etc.. POI లో పేరు తో పాటు ఫోటో కూడా ఉండాలి .
- భర్త ఆధార్ కార్డును ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకూడదు చేసినచో రిజెక్ట్ అవుతుంది.
Marks Memo :
- Marks Memos అనగా SSC / Inter / Degree / B.Tech etc Original Documents అని అర్ధము .
- పేరు & పుట్టిన తేదీ లో మార్పు చేసుకోవచ్చు .
- DOB Correction - Marks Memo పై ఫోటో లేక పోయిన పర్వాలేదు . కానీ ఆధార్ లో ఉన్న పేరు & Marks Memo పై ఉన్న పేరు ఒకేలా ఉండాలి మరియు C/O సరి పోవాలి .
- DOB Limit Cross అయితే Marks Memo ద్వారా అవ్వదు . DOB ద్వారా మాత్రమే అవుతుంది .
- లిమిట్ అవకాశం ఉండి , Marks Memo తో DOB Correction చేయాలి అంటే తప్పనిసరిగా దరఖాస్తు దారుని వయసు ఎన్రోల్మెంట్ తేదీ నాటికి Marks Memo ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఉండాలి .
- పేరు మార్చుకోటానికి వయసు తో సంబంధం లేదు . Marks Sheet లో తప్పనిసరిగా ఫోటో ఉండాలి . పాత Marks Sheet వస్తే అందులో ఫోటో ఉంటేనే Accept చేయాలి .
- Open School / Other Institutes Marks Memos are Not Accepted ❌
Standard Document :
- కేవలం POA గా మాత్రమే ఉపయోగించాలి .
- Download Standard Document pdf
- NACO Aids Officials & Medical Officer [ Civil Sergen / DMHO / Dpty. Director of Health Department ] వారు ఇచ్చిన Standard Document మాత్రమే POI & POA గా వాడవచ్చు .
- Standard Document కలర్ అవసరం లేదు . Black & White Paper అయినా పర్వాలేదు .
- సెర్టిఫైర్ పైన ఉన్న Ticks అన్ని కూడా టిక్ చేసి ఉండాలి. ఎవరు సర్టిఫై చేసుచేస్తున్నారో టిక్ చేయాలి .
- ఫోటో తప్పనిసరిగా లేటెస్ట్ అయి ఉండాలి . పాత ఫోటో పెట్టరాదు .
- అన్ని వివరాలు తప్పనిసరిగా Capital Letters లో వ్రాయాలి .
- జిల్లా , రాష్ట్రము , గ్రామం పేర్లు ఏవి కూడా షార్ట్ కట్ లో వ్రాయ రాదు . Ex. SRIKAKULAM కు SKLM అని , ANDHRA PRADESH కు AP అని రాయకూడదు .
- కొట్టి వెతలు ఉండరాదు . వైట్నర్ వాడరాదు . చిరగకూడదు . ఎటువంటి సంబంధం లేని వివరాలు రాయకూడదు . ఇన్క్ పడకూడదు .
- క్లయింట్ లో ఒకరి పేరు సెలెక్ట్ చేసి , అప్లోడ్ ఇంకోరిది అప్లోడ్ చేయరాదు . Ex . Client లో Village Sarpanch సెలెక్ట్ చేసి Other Than Sarpanch Like NACO , MPDO , HM వారివి అప్లోడ్ చేయరాదు .
- School HM కేవలం అతని పాఠశాల విద్యార్థులకు మాత్రమే Standard Document ఇవ్వాలి . వేరే విద్యార్థులవి రిజెక్ట్ అవుతాయి .
Ration Card :
- Ration Card POI & POA గా వాడవచ్చు , కానీ షరతులు ఉన్నాయి .
- రేషన్ కార్డులో పూర్తి వివరాల లేకుండా చిరునామా మార్పుకు POA గా వాడరాదు.
- రేషన్ కార్డు పై ఫోటో క్లియర్గా ఎవరిది అయితే కనిపిస్తుందో వారికి మాత్రమే రేషన్ కార్డును POI గా ఉపయోగించి పేరులో మార్పుకు అవకాశం ఉంటుంది.
- రైస్ కార్డును కేవలం ముందు వైపు ఎవరిదైతే ఫోటో ఉంటుందో వారికి మాత్రమే పేరు మార్పుకు ఉపయోగించవచ్చు మరియు చిరునామా మార్పుకు ఉపయోగించవచ్చు. తప్పనిసరిగా రైస్ కార్డు వెనుక వైపు పూర్తి చిరునామా ఉండాలి, అసంపూర్తిగా పూర్తిగా ఉంటే అటువంటివి రిజెక్ట్ అవుతాయి.
Bank Passbook :
- బ్యాంకు పాస్ బుక్ లను కోవాలం POA గా ఉపయోగించాలి .
- బ్యాంకు పాస్ బుక్లు బ్యాంకు ఆధారం గా రెండు విధాలుగా ఉంటుంది . ఒకటి Private Bank రెండు Public Sector [ Govt ] Bank .
- Private Bank Passbook లో ఫోటో + సీల్ + సంతకం ఉంటె చిరునామా మార్చ వచ్చు .eKYC Document అవసరం లేదు .
- Govt Bank Passbook అయితే తప్పనిసరిగా పాసుబుక్ తో పాటు Bank వారు ఇచ్చే eKYC డాక్యుమెంట్ ఉండాలి . రెండు స్కాన్ చేయాలి .
Govt Banks List In India As Per RBI |
Date Of Birth Limit Cross :
- పుట్టిన తేదీ కలెక్షన్ కు లిమిట్ పూర్తయిన వారికి నేరుగా మరల అప్డేట్ చేస్తే రిజెక్ట్ అవుతుంది . Aadhaar Update History ద్వారా లేదా My Aadhaar Portal ద్వారా లిమిట్స్ ను ముందుగా చెక్ చేసి లిమిట్ పూర్తయ్యాయి అని నిర్ధారించుకోవాలి . ఎప్పుడు చెప్పబోయే విధానం పనిచేస్తుంది .
- Limits పూర్తయిన వారికి కేవలం Date Of Birth ద్వారా మాత్రమే పుట్టిన తేదీలో మార్పు చేయవలెను మరి ఏ ఇతర డాక్యుమెంట్లు అనగా SSC Marks Memo లాంటివి ఉపయోగించరాదు . అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన రసీదు మరియు సెల్ఫ్ డిప్లరేషన్ ఫారంతో RO Hydrabad ఆఫీస్ కు పోస్ట్ ద్వారా గాని లేదా కొరియర్ ద్వారా గాని పంపించవలెను. వారు వెరిఫై చేసిన తర్వాత ప్యాకెట్ విజయవంతం అవుతుంది.
GPS :
- Aadhaar Camps సమయంలో కాకుండా రోజువారి ఆధార్ సర్వీసులు చేసేటప్పుడు GPS ను క్యాప్చర్ చేసే ప్రదేశం నుండి తప్పనిసరిగా 15 నుండి 20 మీటర్ల పరిధిలో మాత్రమే క్యాప్చర్ చేయాలి. లేనియెడల GPS Based Rejection అయ్యే అవకాశం ఉంది.
- Aadhaar Camps సమయంలో ముందుగా GPS క్యాప్చర్ చేసినప్పటికీ క్యాంపు ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మరలా GPS క్యాప్చర్ చేయవలసి ఉంటుంది.
- ఒకే రోజు ఎక్కువ ప్రదేశాలలో ఆధార్ సర్వీసులు చేయవలసి వచ్చినప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లిన ప్రతీసారి GPS క్యాప్చర్ చేసి సర్వీస్ లను స్టార్ట్ చేయవలసి ఉంటుంది.
- ఒకే రోజు పోస్ట్ ఆఫీస్ పరిధి దాటి వేరే వద్ద సర్వీసులు చేసినట్లయితే తప్పనిసరిగా GPS Capture చేసి సర్వీసులు చేయవలసి ఉంటుంది .
Aadhaar Services Combinations :
- ఒకేసారి ఎప్పుడూ కూడా అన్ని సర్వీసులు కలిపి చేయకూడదు అలా చేసినతో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది .
- ముందుగా దరఖాస్తుదారునికి Mandatory Biomeetric Update [ 5-7 & 15-17 Yrs Age ] తప్పనిసరి బయోమెట్రి అప్డేట్ ఉన్నదో లేదో చెక్ చేసి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ఉన్నచో దానితోపాటు మొబైల్ నెంబర్ లింక్ మాత్రమే చేసుకోవటానికి అవకాశం ఉంటుంది వాటితో ఇతర డెమోగ్రాఫిక్ అప్డేట్ చేసినచో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది , కావున దయచేసి అన్ని కలిపి చేయకండి.
- డెమోగ్రాఫిక్ అప్డేట్ కూడా అనగా పేరు + చిరునామా మార్పులు అన్ని కలిపి ఒకేసారి చేయకండి, ఒక్కొక్కటిగా విజయవంతమైన తర్వాత చేస్తే అన్ని విజయవంతం అవుతాయి .
Twins New Enrollment :
- కలవ పిల్లల కొత్త ఆధార్ కార్డు నమోదు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించవలెను లేనిచో రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- కలవ పిల్లలు వచ్చిన తో మొదట ఒకరికి మాత్రమే నమోదు చేసి అది విజయవంతంగా పూర్తి అయిన తర్వాత మాత్రమే మిగతా వారికి ఒక్కొక్కరిగా నమోదు చేయాలి.
- రెండవ వారి నమోదు రిజెక్ట్ అయినతో దానికి సంబంధించిన రసీదు మరియు పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో ఆర్వో ఆఫీసుకు పంపించవలసి ఉంటుంది పోస్ట్ ద్వారా గాని లేదా కొరియర్ ద్వారా గాని పంపించాలి /
Address Exception Case :
- Address అప్డేట్ చేసే సమయంలో Address Exception Caser కోసం తెలుసుకొని అప్డేట్ చేయవలసి ఉంటుంది.
- దరఖాస్తుదారుడు తెచ్చిన POA కు దరఖాస్తు ఫారం పై వ్రాసిన చిరునామాకు PIN Code + VTC మ్యాచ్ అయినట్టయితే జిల్లా ,మండలం ,డోర్ నెంబర్ , వీధి పేరు వేరుగా ఉన్నప్పటికీ చిరునామాలు మార్పులు చేయవచ్చు .
- దరఖాస్తుదారుడు తెచ్చిన POA కు దరఖాస్తు ఫారం పై వ్రాసిన చిరునామాకు VTC + District / Sub District మ్యాచ్ అయినట్టయితే ఏరా వివరములు సరిపోనప్పటికీ చిరునామా మార్పుకు దరఖాస్తు స్వీకరించవచ్చు .
Name Correction :
- అధికారిక ప్రభుత్వ Gazzet ద్వారా మాత్రమే ఒక వ్యక్తి యొక్క పూర్తి పేరు మార్చటానికి అవకాశం ఉంటుంది. ఇతర డాక్యుమెంట్ ద్వారా పూర్తి పేరు మార్చలేము .
- పెళ్లి అయిన ఆడవారి ఇంటిపేరు మార్చాలి అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా మార్చే అవకాశం ఉంది .
- ఒక వ్యక్తి యొక్క పేరులో Spelling మార్చాలి అనుకుంటే ఏదైనా POI డాక్యుమెంట్ ద్వారా మార్చవచ్చు . పేరులో Spelling మార్చుటకు తప్పనిసరిగా Phonitic ఆధారంగా మార్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు
Date Of Birth Correction :
- కొత్తగా ఆధార్ నమోదు చేసే సమయంలో ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా పుట్టిన తేదీ Approximate గా వేసినట్లయితే తరువాత ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి DOB ఎన్ని సంవత్సరాల కైనా అప్డేట్ చేసుకోవచ్చు .
- అదే ఆధార్ నమోదు సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్తో DOB ఉన్నట్టయితే తరువాత మార్చుకోవాలి అంటే ముందు ఉన్న DOB కన్నా కేవలం మూడు సంవత్సరాల ఎక్కువ లేదా మూడు సంవత్సరాలు తక్కువ వరకు మాత్రమే అప్డేట్ చేయుటకు అవకాశం ఉంది .
Blank Receipt Print Case :
- ప్రతి ఐదు నుంచి ఆరు సర్వీస్ లు చేసిన తర్వాత RUN కమాండ్ లో %temp% ను రన్ చేస్తూ డేటాను క్లియర్ చేస్తూ ఉంటే ఈ సమస్య రాదు.
Common Things to Concentrate :
- ఆధార్ క్లయింట్ 188/189 వెర్షన్ లోకి అప్డేట్ చేసుకోవాలి . దానికి RAM 32 GB అవసరం ఉంటుంది కావున , Virtual Memory ఉపయోగించుకోవాలి .
- దరఖాస్తుదారుడు తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్ను ఒకటికి రెండు సార్లు పూర్తిగా స్కాన్ చేసి వివరాలను అన్ని సరిగా చూసుకున్న తర్వాత మాత్రమే ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేయాలి .
- దరఖాస్తుదారుని ఆధార నెంబరు పనిచేస్తుందో లేదో మై ఆధార్ పోర్టల్ లో ఆధార్ వాలిడేషన్ లో చెక్ చేసిన తర్వాత మాత్రమే నమోదు లేదా అప్డేట్ చేయగలరు.
- డెమోగ్రాఫిక్ అప్డేట్ లో ముఖ్యంగా పేరు మరియు పుట్టిన తేదీ మార్పులకు సంబంధించి లిమిట్ను చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్డేట్ చేయగలరు .
- బయోమెట్రిక్ అప్డేట్ కోసం మాత్రమే వచ్చేవారికి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నదో లేదో చెక్ చేసి లింక్ లైన్ తో వీలైనంతవరకు మొబైల్ నెంబర్ లింక్ చేయుటకు ప్రయత్నించగలరు .
- దరఖాస్తు గారిని ఫోటోకు ఫోటో తీసి ఎట్టి పరిస్థితుల్లో నమోదు లేదా అప్డేట్ చేయకూడదు.
- సరి అయిన ప్రూఫ్ లేకుండా ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేయకూడదు .
- స్టాండర్డ్ డాక్యుమెంట్తో నమోదు చేసే సమయంలో క్లైంట్ లో సరియైన ఆప్షన్ ఎంచుకొని మాత్రమే డాక్యుమెంట్ను అప్లోడ్ చేసి ప్యాకెట్ను ఫార్వర్డ్ చేయాలి.
- బయోమెట్రిక్ లు ఐరిష్ ఫోటో వీలైనంతవరకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చేంతవరకు ప్రయత్నించి నమోదు లేదా అప్డేట్ చేయాలి .