August 2024 Aadhaar Camps In Andhra Pradesh
ఆధార్ సర్వీస్ లో ఎక్కువ మోతాదులో రిజెక్ట్ అవుతున్నందువలన ఆధార్ ఆపరేటర్లుకు ఆన్లైన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ క్యాంపులు జరుగును. తదుపరి తేదీలు ఇంకను ప్రకటించలేదు.
ఏ రోజు ఎక్కడ ఆధార్ క్యాంపులు జరుగుతుందో సంబంధిత MPDO / MC వారు ముందుగా షెడ్యూల్ వేయడం జరుగుతుంది . దానికి అనుగుణంగా సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ / వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారు క్యాంపు లను నిర్వహిస్తారు. ముఖ్యంగా కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును.
Join GSWS Helper WhatsApp Channel
క్యాంపు సమయంలో PS Gr-VI ( DA ) / WEDPS పని చేస్తున్నటువంటి సచివాలయాలలో పనులకు ఆటంకం కలగకుండా వారి స్థానంలో అదే సచివాలయ సిబ్బందిని In-Charge వేస్తారు. ఎక్కడైతే క్యాంప్ ఉంటుందో ఆ సచివాలయ పరిధిలో ఇద్దరు సచివాలయ సిబ్బంది PS Gr-VI (DA) / WEDPS వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు గాను సహాయపడతారు. క్యాంపు సమయంలో జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరూ ఆధార్ PS Gr-VI(DA) / WEDPS వారిని డిప్యూటేషన్ నుండి విడుదల చేస్తారు.
Aadhaar Updation Application Forms
Aadhaar Services Available in Andhra Pradesh
ఆధార్ క్యాంపు లో అందించే సేవలు :
- కొత్త ఆధార్ నమోదు / బాల ఆధార్ ఆధార్
- మొబైల్ లింక్ ఆధార్
- e మెయిల్ లింక్
- ఆధార్ లో ఫోటో మార్పు
- ఫింగర్ ప్రింట్ అప్డేట్
- ఐరిష్ అప్డేట్
- పేరు లో మార్పు
- చిరునామా లో మార్పు
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్
- లింగము లో మార్పు
- ఆధార్ ప్రింట్
- తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
Aadhaar Service Charges in Andhra Pradesh
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - ఉచితం
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఉచితం
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - 50/-
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - 50/-
- డాక్యుమెంట్ అప్డేట్ - 50-
- పేరు మార్పు - 50/-
- చిరునామా మార్పు - 50/-
- పుట్టిన తేదీ మార్పు - 50/-
- లింగము అప్డేట్ - 50/-
- ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ - 100/-
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - 100/-
Aadhaar Services Documents Required
- పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ - బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్
- 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- ఆధార్ - మొబైల్ నెంబర్ లింక్ - ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్
- ఆధార్ - ఇమెయిల్ లింక్ - ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి
- పేరు మార్పు - ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు - Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్నవారికి
- చిరునామా మార్పు - ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు - ఫోటో ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు - ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document
- పుట్టిన తేదీ మార్పు - ఆధార్ కార్డు + [ For Age Above 18 years - SSC / Inter / Degree / Other Original Memo ] or [ For Age Below18 years - పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
- లింగము అప్డేట్ - ఆధార్ కార్డు
- బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) - ఆధార్ కార్డు
- 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ - ఆధార్ కార్డు
- డాక్యుమెంట్ అప్డేట్ - ఆధార్ కార్డు + POI + POA
Documents Required For Document Update
POI అనగా Proof Of Identity అంటే మీ గుర్తిపు కు సంబందించిన ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు, ఫోటో తప్పనిసరిగా ఉండాలి. POA అనగా Proof Of Address అంటే మీ చిరునామాకు సంబందించి ఏ ఆధారం ఉన్న దానిని ప్రూఫ్ గా తీసుకోవచ్చు.వీటిలో మీ పేరు మరియు భారత దేశ చిరునామా ఉండాలి.
List Of POI Accepted Documents in Telugu
- భారతీయ పాస్ పోర్ట్
- పాన్ కార్డు
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్సు
- పెన్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు
- రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పై చదువులకు సంబంధించి ఒరిజినల్ మార్క్స్ సీటు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- ఆధార్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మేట్
- పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంటు
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POI వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క పేరు మరియు ఫోటో ఆధార్ కార్డులో ఉండేలా ఉండాలి. గ్రూపు ఫోటోతో ఉన్న పరవాలేదు.
List Of POA Accepted Documents in Telugu
- భారతీయ పాస్ పోర్ట్
- రేషన్ కార్డు
- ఆరోగ్యశ్రీ కార్డు
- ఓటర్ కార్డు
- వికలాంగుల కార్డు
- డొమెసేల్ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రము
- ఉపాధి హామీ జాబు కార్డు
- లేబరు కార్డు
- ట్రాన్స్ జెండర్ ఐడెంటిటీ కార్డు
- విద్యుత్ బిల్లు
- టెలిఫోన్ ల్యాండ్ లైన్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ బిల్లు
- రిజిస్టర్ ఆఫీసులో ఇచ్చినటువంటి వాలెట్ రిజిస్ట్రేషన్ సేల్ అగ్రిమెంటు లేదా గిఫ్ట్ డిడ్
- గ్యాస్ కనెక్షన్ బిల్లు
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పిఎస్యు లేదా రెగ్యులేటరీ బాడీస్ లేదా స్టాట్యూచరి బాడీస్ ఇచ్చినటువంటి వసతి కేటాయింపు పత్రము
- లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ
- పెన్షనర్ యొక్క ఇండక్షన్ డాక్యుమెంట్
- ఇతర కేంద్ర లేదా రాష్ట్ర రుజువు పత్రము
Note : POA వాడే రుజువు పత్రంలో తప్పనిసరిగా వ్యక్తి యొక్క చిరునామా, ఆధార్ కార్డులోని చిరునామా దగ్గరగా ఉండాలి ఉండాలి.
How To Check Aadhaar Document Update Status
Aadhaar Document Update Status In Telugu
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అయ్యిందా లేదా అని స్టేటస్ ను మొత్తం మూడు విధాలుగా తెలుసుకోవచ్చు.
- ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా
- రసీదు నెంబర్ ద్వారా
- మై ఆధార్ సైట్ ద్వారా
1. ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా తెలిదుకునే విధానం :
Step 5 : Check Your Aadhaar Update History పేజీ ఓపెన్ అవుతుంది.
Step 6 : ఫోన్ లొ అయితే Screenshot లేదా కంప్యూటర్ లొ అయితే Cntl+P ద్వారా ప్రింట్ కామెండ్ ఇవ్వవాలి.
- Destination - Save as PDF
- Pages - All
- Layout - Portrait
- Paper Size - A4
- Pages Per Sheet - 1
- Margins - None
గా పెట్టుకోవాలి.
Step 7 : Scale ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అన్ని ఒకే పేజీ లొ కావాలో, రెండు పేజీ లొ కావాలో సరి పోయేట్టుగా నెంబర్ ఇవ్వాలి తరువాత Save పై క్లిక్ చేయాలి.
Step 8 : కొత్తగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ విజయవంతం అయినవి కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ లొ చూపిస్తుంది. Type లొ Demographic Update గా అప్డేట్ అవుతుంది. గమనించగలరు.ఆధార్ అప్డేట్ హిస్టరీ ఓపెన్ చేసిన తర్వాత చివరి రెండు అప్డేట్ లలో ఎటువంటి మార్పులు లేకపోతే వారికి డాక్యుమెంట్ అప్డేట్ అయినట్టు అర్థము.
2. రసీదు నెంబర్ ద్వారా :
ఆన్ లైన్ లో లేదా ఆధార్ సేవా కేంద్రం లొ లేదా గ్రామ వార్డు సచివాలయ ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు అనగా కొత్త ఆధార్ కార్డు, బాల ఆధార్ మరియు ఆధార్ లొ మార్పులకి సంబందించిన సేవలు పొందిన తరువాత రసీదు ఇస్తారు.
రసీదు ను Enrolment Receipt అంటారు.ఆ రసీదు లొ మొత్తం రెండు బాగాలు ఉంటాయి.
- మొదటిది నమోదు నెంబర్ 14 నెంబర్ లు ,
- రెండవ భాగం లొ తేదీ, సమయం కలిపి 14 అంకెలు ఉంటుంది.
నమోదు నెంబర్ ఉదా.1234/56789/01234 గా ఉంటే తేదీ 15/05/2023 (రోజు/నెల/సంవత్సరం) , సమయం 16/35/18(గంటలు/నిముషాలు/సెకనులు) అయితే అప్పుడు Enrolment ID అనేది రెండు సెక్షన్ లు కలిపి 28 నెంబర్ లు ఉంటాయి. ఈ సందర్భం లొ 1234567890123420230515163518 (ఇక్కడ సంవత్సరం, నెల ఆ తరువాత రోజు ను వేయాలి ).
ఈ విధానంలో కింద తెలిపిన సేవల స్టేటస్ లు తెలుసుకోవచ్చు
- బాల ఆధార్
- కొత్త ఆధార్ (5 సంవత్సరాలు పైబడి)
- ఆధార్ లొ వివరాల అప్డేట్
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (SRN నెంబర్ ద్వారా)
- ఆధార్ PVC కార్డు ఆర్డర్ (SRN నెంబర్ ద్వారా)
- ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( Enrolment ID ద్వారా)
ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానము
Step 1 : ముందు గా కింద లింక్ ఓపెన్ చెయ్యండి.
Step 2 : Enter Enrollment ID, SRN or URN వద్ద 14 అంకెల నమోదు నెంబర్ లేదా 28 అంకెల Enrollment ID లేదా 14 అంకెల SRN నెంబర్ ను ఎంటర్ చేయాలి. Enter Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Submit పై క్లిక్ చేయాలి.
Step 3: కింద చూపిన విధంగా గా Completed అని చూపిస్తూ, Your Aadhaar has been generated. While your Aadhaar is being printed and posted to you, please download eAadhaar from www.UIDAI.gov.in అని వస్తే సర్వీస్ పూర్తి అయినట్టు. సర్వీస్ పూర్తి అయితే Aadhaar Card Download చేసుకోవచ్చు. లేదా ఆధార్ కార్డును Aadhaar PVC Card రూపంలో లొ అనగా ATM కార్డుల ఉండే విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు.
Step 4 : కింద చూపించినట్టు Validation Stage చూపించి, Your request has been rejected due to data/process error. If you do not already have an Aadhaar number from any prior enrolment, please re-enrol at an authorized enrolment center. List of enrolment centers available on official website www.UIDAI.gov.in అని వస్తే రిజెక్ట్ అయ్యింది అని అర్థము. అటువంటి అప్పుడు కారణాలు తెలుసుకొని మరలా నమోదు / అప్డేట్ చేసుకోవాలి.
3. మై ఆధార్ సైట్ ద్వారా :
Step 4 : My Aadhaar పోర్టల్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసి ఉంటె వారికి మాత్రమే కింద చూపిన విధంగా కంప్లీటెడ్ వాలిడేషన్ స్టేజ్ (Completed Validation Stage) అని చూపిస్తుంది ఆలా వస్తే వారికి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అయి నట్టు అర్థము . Pending అని వస్తే వారికి ఇంకా అవ్వ లేదు అని అర్థము .
Note : ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసి 3 నెలలు పూర్తి అయినా పూర్తి అవ్వక పోతే అప్పుడు వారు ఆధార్ సేవ కేంద్రాల్లో ఆధార్ డాక్యూమెంటర్ అప్డేట్ చేసుకోవాలి .
Aadhar Services in Grama/Ward Sachivalayam
- Aadhaar - Mobile Link Status
- Aadhaar - Bank Link Status
- Aadhaar Card Download Link
- Aadhaar PVC Card Order Link
- Aadhaar Update Status Link
- Aadhaar - PAN Card Linking Link
- Aadhaar Document Update Link ( Free )
- Aadhaar - Vote Card Link Process
- Aadhaar Address Update Process
- Find Lost Aadhaar Number Link
- Aadhaar Biometric Lock - Unlock Process
- Aadhaar Update History Link
- Find Near By Aadhaar Center Link
- Complain Aadhaar Link
- Aadhaar Working or Not Link