Check Sadarem Status Online
AP Sadarem Certificate Slot Booking
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యంగులు గుర్తింపు సర్టిఫికెట్ పొందుటకు ముందుగా సదరం కొరకు దరఖాస్తు చేసుకోవాలి .దరఖాస్తు చేసుకొని , రసీదులో ఇచ్చిన తేదీ నాడు ఆసుపత్రికి వెళ్తే అక్కడ దరఖాస్తు దారుణ్ని డాక్టర్లు పరిశీలించి ఎంత % వైకల్యం ఇచ్చారో నమోదు చేస్తారు . అక్కడికి 5 - 10 రోజుల్లో దరఖాస్తు దారులు Sadarem Certificate Receipt రసీదు తో వారికీ దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయంలో లేదా మీ సేవ లో సదరం సర్టిఫికెట్ ను ప్రింట్ తీసుకోవచ్చు . Sadarem Slot Book Charge - 40/- మరియు Sadarem Certificate Print Charge - 40/- . స్లాట్ బుక్ చేసుకోవటానికి ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు స్లాట్ లు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది . స్లాట్ బుక్ చ్చేసుకోవాటాకి ఆసుపత్రికి వెళ్లనవసరం లేదు . దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయంలో లేదా మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది . స్లాట్ బుక్ చేసుకోటానికి ముందు ఎన్ని స్లాట్ లు ఏ ఏ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయో ఎప్పటికి అప్పుడు GSWS Helper Telegram గ్రూప్ లో పోస్ట్ చెయ్యటం జరుగును .
సదరం స్లాట్ బుకింగ్ విధానం , కావాల్సిన డాక్యూమెంట్లు
Sadarem Certificate Slot Booking లో రెండు రకములుగా రసీదులు వస్తాయి , ఒకటి ఏ రోజు , ఎన్ని గంటలకు వెళ్లాలో వివరాలు ఉంటాయి , రెండు WL వెయిటింగ్ లిస్ట్ అని ఉంటుంది . WL అని ఉన్న వారు తదుపరి ప్రభుత్వం Sadarem Certificate Slots విడుదల చేసే వరకు వేచి ఉండాలి . విడుదల చేసాక స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు Sadarem Certificate Slot బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపం లో ఏ రోజు , ఎంత సమయాకు ఆసుపత్రికి వెళ్లాలో వస్తుంది . ఆలా మెసేజ్ రాని వారు , కింద చూపిన విధానంలో ఎప్పటికి అప్పుడు మీ Check Sadarem Status Online చూసుకోవచ్చు . మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు .
Check Sadarem Status Online Process
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి Sadarem Status Online Link పై క్లిక్ చెయ్యండి .
Step 2 : కింద చూపినట్టుగా పేజీ ఓపెన్ అవుతుంది .
Step 3 : Sadarem ID వద్ద మీ వద్ద ఉన్న రసీదులో ఉన్నటువంటిని 17 అంకెల SADAREM ID ను ఎంటర్ చేసి , Captcha కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చెయ్యండి .