SwarnAndhra 2047 Vision - Suggestions , Survey Link, Certificate Download
స్వర్ణాంధ్ర @ 2047 విజన్
100 సంవత్సరాల స్వాతంత్య్ర శతాబ్ది వేడుకులకు వేదికగా మారే 2047వ సంవత్సరం ప్రతి భారతీయుడికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ నూరు సంవత్సరాల దేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలకు రాబోయే 25 సంవత్సరాల కాలం ఎంతో గణనీయమైంది, గుణాత్మకమైంది. ఈ సమయాన్ని దేశం అమృత్ కాల్ గా పరిగణిస్తూ, రాబోయే పాతికేళ్లలో దేశం శరవేగంగా, సంపూర్ణ వృద్ధి సాధించాలని, 2047 సంవత్సరానికల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించిన దేశంగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళుతోంది.
2047కు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలచే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ భూమిక పోషించే క్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, తన పౌరులకు అత్యున్నతమైన నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం అన్ని రంగాలకు అవసరమైన సమగ్రప్రణాళిక కొరకు, అన్ని రంగాల వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలనే సదాశయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 విజన్ [ SwarnAndhra 2047 Vision ] పత్రాన్ని రూపొందించే పనుల్లో నిమగ్నమైంది. ఈ విజన్ డాక్యుమెంటు మన రాష్ట్రం సాధించాలనుకున్న లక్ష్యాలు, ఉద్దేశ్యాలు, కోరుకున్న ఫలితాలు సాధించడానికి అవసరమైనటువంటి ఒక మూలాధార ప్రణాళికారచనకు దోహదపడుతుంది.
సుస్థిరమైన సామాజిక-ఆర్థికాభివృద్ధి సాధనకు కీలకాంశాలు
2047కు సాధించదలచిన విజన్ కొరకు, సామాజిక-ఆర్థికాభివృద్ధి, వ్యూహాత్మక ఆర్థిక ప్రాథామ్యాలతో సహా కింద కనబరచని అన్ని అంశాలపైనా ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తోంది.
అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను, ఆవిష్కరణలను ప్రోత్సహించి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రతి సంవత్సరం సగటు 15% వృద్ధి రేటుతో అత్యధిక ఆర్థికాభివృద్ధి సాధించడం.
2029 కల్లా తలసరి ఆదాయం రెండింతలు చేయడం.
- ప్రపంచ అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పన, ఇండస్ట్రియల్ కారిడార్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, సరకు రవాణా టెర్మినళ్లలతో సహా రాష్ట్రమంతటా కూడా మల్టీ-మోడల్ కనెక్టివిటీ కల్పించడం.
- రాష్ట్రానికున్న 975 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, డీప్ సీ మైనింగ్, ఆక్వా కల్చర్, టూరిజం, ఇతరత్రా అవకాశాలతో ఈ తీర ప్రాంతాన్ని ఒక బ్లూ ఎకానమీగా అభివృద్ధి చేయడం.
- భావితరాలకు సంబంధించిన అంశాల్లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, పరిశోధన, ఆవిష్కరణలతో సుసంపన్నమైన నాలెడ్జి ఎకానమీ సాధించడం.
- జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయీకరణ ప్రయాణంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, భారతదేశంలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతిలో అత్యధిక ఎగుమతులు సాధిస్తున్న రాష్టంగా ఎదగడం.
- భారతదేశానికి, ప్రపంచానికి సాంప్రదాయేతర ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందడం
- రిలిజియస్, స్ప్రీచ్యువల్, కోస్టల్, ఎకలాజికల్ మరియు వెల్‌నెస్ అనుభూతి పర్యాటకులకు కలిగిస్తూ అగ్రగామి పర్యాటక థామంగా రూపొందించడం.
రాష్ట్ర వ్యూహాత్మక ప్రాథమ్యాలు
- వీటికి అధనంగా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో, ప్రజలందరి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంపై దృష్టి సారించడంతో పాటు, కింద కనబరచిన వ్యూహాత్మక ప్రాథమ్యాలపైన కూడా రాష్ట్రం దృష్టి కేంద్రీకరిస్తోంది.
- పేదరిక రహిత రాష్ట్రం, పేదరిక రహిత గ్రామాల సాధన (జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజెస్)
- ప్రభావాత్మకమైన, ఉత్పత్తి సామర్థ్యాయుతమైన వయసు కలిగిన జనాభా కొరకు సమర్థవంతమైన జనాభా నిర్వహణ (డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్)
- పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు మధ్య అసమానతలను రూపుమాపి, సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటానికి పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4 విధానం) అమలు చేయడం.
- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుని, రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవడం.
- విభిన్నరంగాల్లో సంపూర్ణమైన నైపుణ్య అవకాశాలను కల్పించడం ద్వారా 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం.
- సమాజంలోని అన్ని వర్గాలకు తాగునీరు, విద్యుత్తు, క్లీన్ ఎనర్జీ లాంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సుఖమయ జీవనం సాగించే స్థితి సాధించడం.
- కమ్యూనిటీ ప్రమేయం, సాంకేతిక వినియోగం మరియు సమర్ధవంతమైన అనుసరణ మరియు ఉపశమనానికి సహజ వనరుల విస్తరణ ద్వారా ‘వాతావరణం-మొదటి ప్రాధాన్యత’ అనే విధానం ద్వారా అభివృద్ధివైపు పయనించడం.
- సత్వర న్యాయ వ్యవస్థతోపాటు, సాంకేతికత అందిపుచ్చుకుని ఫలితాల ఆధారిత పాలన అందించడం.
- సంగ్రహంగా, ఈ సమగ్ర విధానం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి, జీవన ప్రమాణాల్లో ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలపడానికి దోహదపడుతుంది.
ప్రజలకు విన్నపం
ప్రజలందరి ఆకాంక్షలు ప్రతిఫలించేలా ఒక విజన్ డాక్యుమెంటు రచించడానికి, ఈ Link ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరి సలహాలు సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తుoది . 5 అక్టోబర్ ,2024 వ తేదీ లోపు పౌరులందరూ తమ ఆలోచలను, తమ అభిప్రాయాలను అందజేయాల్సి ఉంటుంది. 2047కు వివిధ రంగాల్లో స్థిరమైన, సమానమైన అభివృద్ధి సాధించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట భవిష్యత్తు చిత్ర రూపకల్పనకు ప్రజలందరూ భాగస్వామ్యం వహించి, కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాం.
How to Give SwarnAndhra 2047 Vision Suggestions Link
ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వ్యక్తుల డేటా సబ్మిట్ చేయాలి అనుకున్నప్పుడు కంప్యూటర్లో అయితే మల్టిపుల్ ట్యాబ్ ఓపెన్ చేసి డేటా సబ్మిట్ చేయవచ్చు. వర్కింగ్ గంటల్లో సైట్ చాలా స్లోగా ఓపెన్ అవుతుంది. డేటా సబ్మిట్ చేశాక సర్టిఫికెట్ కొరకు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.
ముందుగా కింద లింక్
Swarna Andhra 2024 Suggestions Link
ఓపెన్ చేయండి .తెలుగు / English లో ఒక భాష ను ఎంచుకోండి .కింద తెలిపిన ప్రశ్నలు అడుగుతుంది .
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్* స్వర్ణాంధ్ర@2047 సాధనకు సంబంధించి క్రింద కనబరచిన వాటిలో ఏది మీ దృష్టిలో ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
- ఏ. ఆరోగ్య మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం
- బీ. స్వర్ణాంధ్ర: భరోసాతో కూడిన భవిష్యత్తుకు సాధికారతనివ్వడం
- సీ. ఆంధ్రప్రదేశ్ పరివర్తన, జీవితాల పరివర్తన
- డీ. జనులందరి సమృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కొరకు
2. ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు* ఆర్థికాభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన రంగాలు ఏవి?( క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
- ఏ. వ్యవసాయం మరియు ఉద్యాన రంగం
- బీ. చేపల పెంపకం మరియు రొయ్యల సాగు
- సీ. ఐటీ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం
- డీ. స్థిరాస్తి రంగం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి
- ఈ. పరిశ్రమ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) మరియు స్టార్టప్లతో కలిపి
- ఎఫ్. ఇంధన రంగం సంప్రదాయ ఇంధనంతో కలిపి
- జీ. పర్యాటక రంగం
3. జీవన ప్రమాణాల పెంపు * ఆంధ్రప్రదేశ్‌లో జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మీరు ఏవి అత్యంత ప్రాధాన్యమైనవని అనుకుంటున్నారు? (కింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
- ఏ. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండటం
- బీ. ప్రపంచ అత్యుత్తమ విద్య, అభ్యాసన పద్దతులు
- సీ. పరిశ్రమ - ప్రపంచ జాబ్ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించడం
- డీ. నిరంతరాయ విద్యుత్తు, శుద్ది నీరు, పారిశుద్ధ్యం, అత్యుత్తమ రవాణా వ్యవస్థ
- ఈ. నేరాల శాతం తక్కువగా ఉండే భద్రతతో కూడిన సమాజం
4. సుస్థిర మరియు పర్యావరణానుకూలమైన వృద్ధి* సుస్థిర, పర్యావరణానుకూల, మరియు సమ్మిళిత వృద్ధి సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
- ఏ. స్వచ్ఛమైన హరిత వనరులను అందిపుచ్చుకోవడం
- బీ. ప్రకృతి పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించడం
- సీ. మెరుగైన వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్ విధానాలు పాటించడం
- డీ. సమర్థవంతమైన ప్రజా రవాణ వ్యవస్థను ఏర్పాటు చేయడం
- ఈ. విపత్తులను ఎదుర్కోవడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం
- ఎఫ్. వాతావరణ విపత్తుల (వరదలు, కరవు, తుపాన్లు తదితరాలు)ను ధీటుగా ఎదుర్కొని నిలవగలిగేలా మౌలిక సదుపాయాలు కల్పించడం
- ఏ. రిమోట్ మరియు సాంకేతికతో కూడిన ఉద్యోగాల కొరకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించడం
- బీ. ఉద్యోగార్థుల సంసిద్ధతను మరింత పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం
- సీ. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Al), మెషిన్ లెర్నింగ్ (ML) మరియు ఎమర్జింగ్ టెక్నాలజీల కొరకు శిక్షణ ఇవ్వడం
- డి. అంకుర పరిశ్రమలు (స్టార్టప్ లు) మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం
- ఈ. సమాచార, సాంకేతిక, తయారీ మరియు సేవల రంగంలో ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వడం
- ఎఫ్. వ్యవసాయాధారిత పరిశ్రమల ద్వారా గ్రామీణ ఉద్యోగాల కల్పనకు తోడ్పడటం
- జీ. క్రీడలు, కళలు మరియు సంస్కృతిలో మరిన్ని అవకాశాలు కల్పించడం
- ఏ. పారదర్శకత మరియు జవాబుదారీతనంతో కూడిన పాలన
- బీ. ప్రజా సేవలు సత్వరం అందించడం
- సీ. సాంకేతికత ఆధారిత పాలన (ఈ-గవర్నెన్స్)
- ఏ. నాణ్యమైన విద్యకు అవకాశం
- బి. ఆర్థిక స్వేచ్ఛ
- సీ. మెరుగైన ఆరోగ్య సంరక్షణ
- డీ. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చట్టాలు మరియు భద్రతా చర్యలు ఈ. అన్ని రంగాల్లో సమానావకాశాలు
- ఎఫ్. నాయకత్వం మరియు నిర్ణయాత్మక పాత్రల్లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించడం
- జీ. పిల్లల సంరక్షణ మరియు కుటుంబ మద్దతు వ్యవస్థలను అందుబాటులో ఉంచడం
- ఏ. నేరుగా మార్కెట్లో విక్రయించుకొనే సదుపాయం కల్పించడం
- బీ. ఆధునిక వ్యవసాయ సాంకేతికత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ), డ్రోన్లు కల్పించడం
- సీ. పంటలకు న్యాయమైన మరియు పారాదర్శకతతో కూడిన ధరల వ్యవస్థ
- డీ. అత్యుత్తమ నీటిపారుదల మరియు నీటి నిర్వహణ వ్యవస్థ
- ఈ. సుస్థిరమైన మరియు వాతావరణ పరిస్థితులకు తట్టుకునేటటువంటి సాగు పద్దతులు
- ఎఫ్. వ్యవసాయాధారిత పరిశ్రమలకు బలమైన తోడ్పాటు అందించడం
- ఏ. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందేలా చేయడం
- బీ. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం
- సీ. బలహీన వర్గాలకనుగుణంగా తగిన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం
- డీ. చట్టబద్దమైన రక్షణ బలోపేతం చేయడం మరియు సాధికారిక హక్కుల కల్పన
- ఈ. గృహ మరియు కనీస అవసరాలు సమానంగా కల్పించడం
- ఏ. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కు అగ్రగామి కేంద్రంగా విలసిల్లడం
- బీ. భారతదేశ ఆహార భద్రతకు ప్రధాన భూమిక పోషించడం
- సీ. శుద్ధ ఇంధన ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడం
- డీ. ప్రధానమైన పర్యాటక మరియు సంస్కృతి సంప్రదాయ కేంద్రంగా నిలవడం
- ఈ. అంతర్జాతీయ విపణి, వాణిజ్యంలో ముఖ్యమైన పాత్రపోషించడం
స్వర్ణాంధ్ర @2047 - గ్రామ సభ (ప్రజావేదిక) నిర్వహణపై ముఖ్య సూచనలు
- సదరు కార్యక్రమమును పురస్కరించుకొని అన్ని గ్రామాల్లో తే. 20.09.2024ది నుండి తే.26.09.2024 వరకు గ్రామ సభలు నిర్వహించవలెను.
- ప్రతీ గ్రామమునకు ఒక మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించవలెను.
- గౌరవ శాసన సభ్యుల నుంచి వారి యొక్క పర్యటన / సందర్శన వివరములు సదరు తేదీలకు గాను ముందస్తుగా సేకరించవలెను.
- ప్రతి కుటుంబమును అపాదించబడిన గ్రామ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా సందర్శించి సదరు కుటుంబమునకు ప్రభుత్వం వారిచే పంపబడిన నాలుగు పేజీల పాంప్లేట్ అందజేసి సదరు కుటుంబమునకు పొందుపరచిన అంశములపై వివరణ ఇచ్చునట్లుగా సచివాలయ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వవలెను.
- ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జరుగుతున్న గ్రామ సభల (ప్రజావేదిక) యందు ప్రభుత్వం వారిచే నిర్దేశించబడిన "స్వర్ణాంధ్ర @2047" అను అంశంపై ఆరు పేజీల సమాచారంపైచర్చజరపవలెను. మరియు సదరు ఆరు పేజీల సమాచారంను పంపిణి చేయవలెను.
- ప్రభుత్వం వారిచే నిర్దేశించబడిన రెండు నిమిషాల నిడివిగల వీడియోను అన్ని గ్రామసభల్లో చూపుటకు తగు ఏర్పాట్లు చేయవలెను.
- మండల స్థాయిలో అన్ని శాఖాధిపతులతోనూ మరియు స్వచ్చంద సంస్థలు, విద్యావేత్తలు, ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం నిర్వహించి స్వర్ణాంధ్ర @2047 లక్ష్యం చేరుటకు తగు సూచనలు సేకరించి సంబంధిత సూచనలను క్రోడీకరించి జిల్లా యంత్రాంగం (CPO) నకు పంపవలెను.
- ప్రభుత్వం వారిచే పంపబడిన పోస్టర్లును (QR కోడ్ కలిగిన) ప్రతీ గ్రామములో ముఖ్య ప్రదేశములు, కూడళ్ళ యందు మరియు ప్రభుత్వకార్యాలయాలు, విద్యాలయాల వద్ద అతికింపవలెను.
- ప్రభుత్వం వారు నిర్దేశించిన QR కోడ్ మరియు URL అనుసందానిత ప్రశ్నావళిని గ్రామ/వార్డ్ సభలలో అధిక సంఖ్యలో సంబందిత వెబ్ సైట్ నందు పూరించినట్లుగా చూడవలెను.