3 Free Gas Cylinders Scheme
Free Gas Scheme Latest Update
- ఆధార్, తెల్ల రేషన్కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
- సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS వెళుతుందని ఆయన వెల్లడించారు.
- బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు.
- డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమవుతుందని తెలిపారు.
- 2024 అక్టోబర్ 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించిన ప్రభుత్వం. ఎవరికైనా పథకం అందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చని సూచించింది.
- మొదటి గ్యాస్ సిలిండర్ను ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
- 2వ సిలిండర్ ఏప్రిల్ 1-జులై 30, 3వ సిలిండర్ ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ బుక్ చేసుకోవచ్చంది.
3 Free Gas Cylinders Scheme 2024
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగమైనటువంటి దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందించడం జరుగుతుంది. ఈ దీపం పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లను (free gas cylinder scheme Andhra Pradesh) పొందాలంటే అసలు అర్హతలు ఏంటి, ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు, ఎవరికి వర్తిస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఇంకా పేమెంట్ ఎలా చేస్తారు అని పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
'
Deepam Scheme 2024 Details
పథకం పేరు | 3 Free Gas Cylinders Scheme |
ప్రారంభించినది | రాష్ట్ర ప్రభుత్వం |
ప్రారంభం | అక్టోబర్ 31 , 2024 |
లబ్దిదారులు | రాష్ట్ర ప్రజలు |
దరఖాస్తు విధానం | Offline |
దరఖాస్తు మొదలు | ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లో |
ప్రయోజనాలు | పేదలకు |
దరఖాస్తు ఫీజు | ఉచితం |
సమాచార వెబ్సైట్ | www.gswshelper.com |
3 Free Gas Cylinders Scheme అంటే ఏమిటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరియు పేదవారికి సిలిండర్లపై ఆర్థిక భారం తగ్గించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకమే దీపం పథకం. ఈ పథకాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అమలు చేయగా అయితే అప్పట్లో కేవలం గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రెండవ దశ కూటమి ప్రభుత్వంలో ఈ పథకాన్ని ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో అనుసంధానం చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేద మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుంది. సూపర్ సిక్స్ పథకాల లో భాగమైనటువంటి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీపావళి రోజు అనగా అక్టోబర్ 31న ప్రారంభిస్తారు.
3 Free Gas Cylinders Scheme 2024 at a glance
- Scheme Name: Deepam Scheme 2024 [ Free Gas Cylinder scheme Andhra Pradesh ]
- Booking Date for First Cylinder: 24 October 2024 (delivers on 31 October)
- Deepam Scheme launch date: 31 October 2024
- Number of Free Gas Cylinders per year: 3 [1 Every Four months]
- Deepam Scheme Schedule - 1 free Cylinder can be availed between 31st October to March 2024. From the next financial year 2025-2026, 3 cylinders every four months can be availed.
- Deepam Scheme Application Process: All eligible white ration card holders
- Deepam Scheme Payment Status: Applicable subsidy amount will be transferred in 48 hours to beneficiary bank account
- Deepam Scheme eligible gas agencies: Indane, HP, Bharat Gas connections
3 Free Gas Cylinders Scheme Eligibility 2024-25
- దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే కింది అర్హతలు కలిగి ఉండాలి.
- సదరు లబ్దిదారుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- బిపిఎల్ అనగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- ఇండేన్, హెచ్ పి. భారత్ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
- లబ్దిదారుడు సరైన ఆధార్ కార్డు, గ్యాస్ పుస్తకం, ఆధార్ కార్డుకి మరియు గ్యాస్ పుస్తకానికి (ekyc) లింక్ మరియు ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కి కూడా ముందుగా లింక్ చేసుకొని ఉండటం మంచిది.
- నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ మాత్రమే ఉచితం.
3 Free Gas Cylinders Scheme 2024-25 Schedule
ప్రస్తుతం అక్టోబర్ 31 నుంచి మార్చి 2025 వరకు ఒక సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా 2025-26 నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 లోపు మూడు ఉచిత సిలిండర్లను పొందవచ్చు.
3 Free Gas Cylinders Scheme 2024 Application Process and Required documents
దీపం పథకం అప్లికేషన్ ప్రాసెస్ మరియు కావాల్సిన డాక్యుమెంట్లు Deepam Scheme 2024 Application Process and Required documents దీపం పథకాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేస్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న డేటాని గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత గ్యాస్ ఏజెన్సీ లతో ఒప్పందం చేసుకుంది.
Documents Required For 3 Free Gas Cylinders Scheme in AP
దీపం పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
- బిపిఎల్ అనగా తెల్ల రేషన్ కార్డ్ (రైస్ కార్డు),
- గ్యాస్ కనెక్షన్ పుస్తకం (Indane, HP. Bharat Gas),
- మహిళ పేరు పైన బ్యాంక్ పాస్ పుస్తకం,
- ఆధార్ కార్డు,
- మొబైల్ నెంబర్,
- ఆధార్ మొబైల్ అనుసంధానం మరియు
- ఆధార్ తో బ్యాంక్ ఖాతా మరియు గ్యాస్ కనెక్షన్ అనుసంధానం కలిగి ఉండాలి.
3 Free Gas Cylinders Scheme Amount and Payment Status
దీపం పథకం అమౌంట్ ఎలా చెల్లిస్తారు, స్టేటస్ ఎలా చూడాలి - Deepam Scheme Amount and Payment Status దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందిన వెంటనే సదరు లబ్దిదారుడు సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి తప్పనిసరిగా ప్రస్తుతం చెల్లిస్తున్నట్లుగానే అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమౌంట్ చెల్లించిన తర్వాత 48 గంటల్లో సంబంధిత లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతాలో డిబిటి (DBT) పద్ధతిలో అమౌంటును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 825-850 వరకు గ్యాస్ సిలిండర్ కి అమౌంట్ ను వసూలు చేస్తున్నారు. ఈ పూర్తిగా అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు ఖాతాలో డెలివరీ చేసిన 48 గంటల లో నేరుగా జమ చేస్తుంది..
3 Free Gas Cylinders Scheme Booking Apps
- Indane Gas - Click Here
- HP Gas - Click Here
- Bharat Gas - Click Here