Aadhaar Name Update with Doctor's Certificate in Telugu
దరఖాస్తుకు ఏం కావాలి ?
ఆధార్ కార్డులో డాక్టర్ సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్తో పేరు మార్చడానికి ఉండాల్సినవి
- దరఖాస్తుదారిని ఆధార్ కార్డు
- అప్లికేషన్ ఫారం Download
- డాక్టర్ సంతకం చేసి ఇచ్చే పేపరు Standard Document
- అప్లికేషన్ చేయువారు తప్పనిసరిగా ఆధార్ సెంటర్ కు వెళ్లాలి .
- ఆధార్ కార్డు యాక్టివ్ లో ఉండాలి .
- ఆధార్ కార్డు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అయి ఉండాలి .
- ఆధార్ లో పేరు మార్పుకు లిమిట్ ఉండాలి .
డాక్టర్ సంతకం చేసి ఇచ్చే పేపరు ఎలా ఉండాలి ?
డాక్టరు సంతకం చేసి ఇచ్చే పేపర్ ని ఆధార్ స్టాండర్డ్ డాక్యుమెంట్ Aadhaar Standard Document అని అంటారు . పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది . ప్రింట్ తీసుకోవాలి . కింద తెలిపిన విధంగా వివరాలు నమోదు చేయాలి .
ఫారం ను రాసేటప్పుడు కొట్టివేతలు, దిద్ది వేతలు , రాసిన దానిపై మరల రాయడం,చిరగడం , వాటర్ పడడం ,నలగడం ,వైట్నర్ వాడినట్టు అయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాపిటల్ లెటర్లతో , ఆంగ్లములో రాయాలి .
Date : ఫారం ను ఫిల్ చేస్తున్న తేదీ నమోదు చేయాలి నమోదు చేసిన తేదీ నుంచి 3 నెలల వరకు ఈ ఫారం పని చేస్తుంది
Resident : ✔ [ భారతీయులయితే టిక్ చేయాలి ]
Update Request : ✔ [ అప్డేట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయాలి ]
Aadhaar Number : అప్లికేషన్ చేసేవారి ఆధార్ నెంబర్
Full Name : పేరు ఎలా మారాలో ఆలా రాయాలి
C/O : ఆధార్ లో ఉన్నట్టు నాన్న / భర్త పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
House No / Bldg / Apt : ఇంటి నెంబర్ / బిల్డింగ్ పేరు / అపార్ట్మెంట్ పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Street / Road / Lane : వీధి / రోడ్ / లేన్ వివరాలు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Land Mark : ల్యాండ్ మార్క్ రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Area / Locality / Sector : లొకాలిటీ రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Village / Town / City : గ్రామము పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Post Office : పోస్ట్ ఆఫీస్ పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
District : జిల్లా పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
State : రాష్ట్రము పేరు రాయాలి [ ఆధార్ ప్రకారం ]
PIN Code : పిన్ కోడ్ రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Date Of Birth : పుట్టిన తేదీ రాయాలి [ ఆధార్ ప్రకారం ]
Signatur Of Resident / Tumb : దరఖాస్తు చేస్తున్న వారి సంతకం / బొటనివేలు వేయాలి
Photo : దరఖాస్తు చేస్తున్న వారి లేటెస్ట్ ఫోటో అంటించాలి
Certifier Details :
ఈ సెక్షన్ లో కేవలం Civil Surgeon / Gazetted Officer at NACO / State Health Department/Project Director of State AIDS Control Society డాక్టర్ వారి యొక్క పేరు, డాక్టర్ యొక్క హోదా , డాక్టర్ యొక్క అడ్రస్ , డాక్టర్ యొక్క ఫోన్ నెంబరు, Check List Tick ను డాక్టర్ వారు రాస్తారు . ఈ సెక్షన్ లో ఇచ్చినటువంటి బాక్సులో డాక్టర్ వారి యొక్క స్టాంపు మరియు సంతకం చేస్తారు అదేవిధంగా పైన ఫోటోలో చూపించినట్టుగా ఫోటోపై డాక్టర్ వారి స్టాంపు మరియు క్రాస్ సంతకం చేస్తారు
అప్లికేషన్ ఫారం ను ఎలా రాయాలి ?
పైన ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం అనేది వయసు ప్రకారం మారుతుంది 5 సంవత్సరాల లోపు వారికి, ఐదు నుండి 18 సంవత్సరాలు మధ్య ఉన్నవారికి, 18 సంవత్సరాలు పూర్తయిన వారికి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది . అప్లికేషన్ చేస్తున్న వారి వయసు ప్రకారం అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూపించిన విధంగా అప్లికేషన్ ఫారం ను మీరు రాయాల్సి ఉంటుంది.
ఏదైనా మీకు అప్లికేషన్ ఫారం లో రాయడంలో సమస్య ఉంటే కింద ఇచ్చిన Youtube Videoని ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తుంది .
ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి ?
ఆను లైన్ లో సొంతంగా ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి అవ్వదు. కేవలం దగ్గర్లో ఉన్న ఆధార సెంటర్లో మాత్రమే ఆధార్ కార్డులో పేరును మార్చుకోవడానికి అవుతుంది. అనులైన్ లో కేవలం ఆధార్ కార్డులోని చిరునామా మార్పు , కుటుంబ పెద్ద ఆధారంగా చిరునామా మార్పు వంటి సేవలు మాత్రమే అవుతాయి. ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం , ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదని చెక్ చేయడం , ఆధార్ కార్డు లోని ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకోవడం ఇటువంటి సేవలు ఆన్లైన్లో అవుతాయి తప్ప నేరుగా ఆధార్ కార్డులను పేరు మార్చడానికి ప్రస్తుతానికైతే ఆన్లైన్లో అవకాశం లేదు.
అప్లికేషన్ ఫీజు ఎంత ?
ఆధార్ కార్డులో డాక్టర్ సంతకం చేసి ఇచ్చే డాక్యుమెంట్ Aadhaar name update with Doctor's Certificate తో పేరు అప్డేట్ చేసుకోవడాని కి అప్లికేషన్ ఫీజు ఆధార్ సెంటర్లో కేవలం 50 రూపాయలు మాత్రమే.
ప్రాసెస్ ఎలా ఉంటుంది ?
మొదటగా అప్లికేషన్ చేయువారు ఆధార్ సెంటర్ పైన చెప్పిన విధంగా ఉన్నటువంటి డాక్టర్ సంతకం చేసి ఇచ్చే డాక్యుమెంట్ మరియు దరఖాస్తు ఫారం ను తీసుకొని వెళ్ళాలి.
⏬
దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి . [ ఫిల్ చేయు విధానము ]
⏬
ఆధార్ ఆపరేటర్ వారు అప్లికేషన్ చేస్తున్న వారి ఫోటో మరియు ఐరిష్ లేదా బయోమెట్రిక్ తీసుకుంటారు .
⏬
డాక్టర్ సంతకం చేసి ఇచ్చే డాక్యుమెంట్ ఒరిజినల్ స్కాన్ చేస్తారు .
⏬
సర్టిఫికెట్ లో ఉన్నటువంటి పేరును నమోదు చేస్తారు.
⏬
ఆపరేటర్ వారి బయోమెట్రిక్ వేసి దృవీకరణ చేస్తారు .
⏬
చివరగా రసీదు ప్రింట్ వస్తుంది . రసీదు పై ఆపరేటర్ మరియు దరఖాస్తుదారుని సంతకం చేసి అప్లోడ్ చేస్తారు .
⏬
50 రూపాయల ఫీజు తీసుకుంటారు.
⏬
ఆధార్ ఆపరేటర్ వారు రసీదును అప్లికేట్కు ఇస్తారు .
ఎన్ని రోజుల్లో పేరు అప్డేట్ అవుతుంది ?
సాధారణంగా ఆధార్ కార్డులో పేరు అప్డేట్ అవ్వటానికి రెండు రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుంది డాక్యుమెంట్లో ఏదైనా సమస్య ఉన్న లేదా బయోమెట్రిక్ సమస్య ఉన్న పది రోజులకు మించి 90 రోజుల వరకు సమయం పడుతుంది .