AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly
ప్రజలు ఆఫీసుకు వెళ్లకుండానే వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను Manamitra WhatsApp Governance Servuice ను రాష్ట్రవ్యాప్తంగా January 30, 2025 నుండి ప్రారంభించడం జరిగినది .
సర్వీస్ Government Services కు అవసరమయ్యే Application Forms అప్లికేషన్ వివరాలను నింపడం , Payment Process పేమెంట్ చేయడం , AP WhatsApp Governance Certificate Download సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా WhatsApp App లోనే అయిపోతాయి. సిటిజన్ సర్టిఫికెట్ కొరకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు . దీనికి కేవలం ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్ మరియు వాట్సాప్ లో ఖాతా ఉంటే సరిపోతుంది . పేమెంట్ కొరకు WhatsApp UPI Pay వాట్సప్ పే అవసరం లేదు మొబైల్ లో ఉన్న ఏ UPI Payment App పేమెంట్ యాప్ ద్వారా అయినా పేమెంట్ చేసేయవచ్చు .
List of AP WhatsApp Governance Services: Get All Govt Services on Your Mobile
ప్రస్తుతానికి మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా Mana Mitra - AP WhatsApp Governance లో భాగంగా మొత్తంగా 161 సర్వీస్ లను రాష్ట్ర ప్రభుత్వం WhatsApp App లో పొందుపరచడం జరిగినది . ఇందులో ముఖ్యమైన సర్వీసులు కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి .
1.దేవాలయ బుకింగ్ సేవలు
- శ్రీశైలం
- కాణిపాకం
- సింహాచలం
- విజయవాడ
- అన్నవరం
- ద్వారకాతిరుమల
- శ్రీకాళహస్తి
2.PGRS ఫిర్యాదు పరిష్కరణ సేవలు
- ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడం
- ఫిర్యాదు పై అభిప్రాయాన్ని షేర్ చేయడం
3.APSRTC సేవలు
- బస్ టికెట్ బుకింగ్
- బస్ టికెట్ క్యాన్సిల్
4.ఎనర్జీ సేవలు
- బిల్ పేమెంట్ ఫిర్యాదు
- సర్వీస్ రిక్వెస్ట్ స్థితి
- సర్వీస్ రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్
- కొత్త సర్వీస్ స్టేటస్
- కొత్త సర్వీస్ ఫీడ్ బ్యాక్
- మీ సర్వీస్ వివరాలు తెలుసుకోవడం
- డిమాండ్ నోటీస్ డౌన్లోడ్ చేసుకోవడం
5.CMRF సేవలు
- స్టేటస్ తెలుసుకోవడం
- ఫిర్యాదు లేదా అభిప్రాయాన్ని తెలుపటం
- అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం
6.CDMA సేవలు
- ఆస్తి పన్ను
- నీటి చార్జీలు
- మురుగునీటి కనెక్షన్
- ట్రేడ్ లైసెన్సు
- వివాహ నమోదు
7.రెవెన్యూ సేవలు
- Agriculture Income Certificate
- Family Member Certificate
- OBC Certificate
- EWS Certificate
- No Earning Member Certificate
- Water Tax
- Title Deed Cum PPB With Photo
- Title Deed Cum PPB Certificate
- Marriage Certificate [ WIth in 2 Months ]
- ROR 1B
- Computerized Adangal
- Income Certificate Re Issuanced
- Integrated Caste Certificate
- Re Issuance
8.ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుల సేవలు
- అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం
- కార్డులో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం
- కార్డులో వివరాలను ఫోటోతో సహా అప్డేట్ చేయటం
9.పోలీసు సేవలు
- పత్రాలు / వస్తువులు కోల్పోవడం తప్పిపోవటం మరియు
- క్యారెక్టర్ సర్టిఫికెట్ అప్లికేషన్ చేయటం
Official AP WhatsApp Governance Helpline Number for Citizen Services
రాష్ట్ర ప్రజలు WhatsApp App ద్వారా Services నేరుగా మొబైల్లో పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక మొబైల్ నెంబర్ను ఇవ్వడం జరిగినది . అన్ని సేవలు కూడా ఈ మొబైల్ నెంబర్ ద్వారానే ప్రజలు పొందవచ్చు .వాట్సాప్ నెంబర్ ను కింద మీకు ఇవ్వడం జరిగినది .
How to Get Government Services Through WhatsApp: A Step-by-Step Guide
Andhra pradesh WhatsApp Governance ద్వారా సర్వీసెస్ పొందాలి అంటే ముందుగా పైన మొబైల్ నెంబర్ పై టాప్ చేసినట్లయితే నేరుగా మీయొక్క వాట్సాప్ ఓపెన్ అయ్యి ఆ నెంబర్కు మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
మీకు నచ్చిన మెసేజ్ అంటే Hi లేదా ... లేదా నచ్చింది ఏదైనా సరే మెసేజ్ పంపించండి. వెంటనే కింద చూపిన విధంగా రెస్పాన్స్ వస్తుంది .
సెవను ఎంచుకోండి పై టిక్ చేయాలి . వెంటనే కింద ఇవ్వబడినట్టుగా సిచూపిస్తుంది .
దయచేసి ఒక సేవను ఎంచుకోండి పై క్లిక్ చేస్తే అన్ని డిపార్టుమెంట్ల లిస్ట్ వస్తుంది .AP WhatsApp Governance Certificate Validity: Government Approval & Recognition
చాలామందికి ఈ WhatsApp Governance ద్వారా పొందే సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందా కాదా అని డౌట్ అయితే ఉండి ఉంటుంది . అయితే ఈ సర్వీస్ ద్వారా పొందిన సర్టిఫికెట్ 100% ఆమోదయోగ్యమైనది ఎందుకంటే ఈ సర్టిఫికెట్ పై వచ్చే QR Code ద్వారానే సర్టిఫికెట్ యొక్క Validity అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ WhatsApp Governanceసర్వీస్ ద్వారా పొందుతున్న ప్రతి సర్టిఫికెట్ పై QR Code ని ఇస్తుంది . ఆ యొక్క QR Code స్కాన్ చేసినట్టు అయితే సర్టిఫికెట్ Valid or Not ? ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో తెలుస్తుంది . ఉదాహరణకు ఒక Income Certificate Application Processs Through WhatsApp Governance ఎలా తీసుకోవాలో కింద వీడియోలో చెప్పడం జరిగింది ఒక్కసారి ప్రాసెస్ చూడండి.
How to Scan QR Code on AP WhatsApp Governance Certificate: Step-by-Step Guide
పైన చూపించిన వీడియో ఫాలో అవుతూ మీరు పైన ఇవ్వబడిన WhatsApp Governance Services List సర్వీసులలో ఏ సర్వీస్ నైనా పొందిన తర్వాత ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా మీ మొబైల్ లో ఆ సర్టిఫికెట్ ఉన్నట్టయితే సర్టిఫికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లేదా ప్రింట్ తీసుకొని పేపర్ పై సర్టిఫికెట్ ఉన్నట్టయితే ఆ క్యూర్ కోడ్ ను కింద చూపిన ప్రాసెస్ లో స్కాన్ చేయండి.
సర్టిఫికెట్ పై ఇక్కడ చూపించినట్టుగా QR Code ఉంటుంది
మీ మొబైల్ లో సర్టిఫికెట్ ఉన్నట్టయితే QR Code దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి అదే పేపర్ పై ప్రింట్ తీసుకొని ఉన్నట్టయితే QR Code దగ్గరగా మీ మొబైల్ లో ఉన్న Google Lans / Goole App ఓపెన్ చేసి ఫోటో తీసి దగ్గరగా పెట్టండి .
కింద చూపిన విధంగా వెబ్సైట్ లింకు కనిపిస్తుంది నెట్ ఆన్ లో ఉంచుకొని ఆ లింక్ పై క్లిక్ చేయాలి
ఆ లింకు ఆంధ్ర ప్రదేశ్ అధికారిక వెబ్సైట్ కు రీ డైరెక్ట్ అవుతుంది . ఫోటోలో చూపిస్తున్నట్టుగా వెబ్సైట్ చివరన ap.gov.in అని ఉన్నట్లయితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక వెబ్సైట్ అని అర్థము . ఆ వెబ్సైట్లో ఆ సర్టిఫికేట్ గాని కింద చూపిస్తున్నట్టుగా చూపించిందంటే అది 100% ఆమోదయోగ్యమైన జెన్యూన్ సర్టిఫికెట్ అని అర్థము .
How to check my obc certificate application status apply from watsapp
ReplyDelete