PM Internship Scheme FAQ: Everything You Need to Know
దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ప్రభుత్వ & ప్రైవేట్ పరిశ్రమలలో మరియు ఇతర ముఖ్యమైన కంపెనీలలో సగం రోజులకు పైగా క్లాస్ రూమ్ బయట అనుభవంతో కూడిన శిక్షణ ఇస్తూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రోగ్రాం పేరే PM Internship Scheme ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం . ఈ పోస్ట్ లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం లో తరుచు అడుగుతున్నా PM Internship Scheme FAQ ప్రశ్నలు - సమాదానాలు చూద్దాం .
యువత PM Internship Scheme ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంకి దరఖాస్తు చేసేముందు కింద ఇవ్వబడిన ప్రశ్నలు మరియు సమాధానాలను చదివి అర్థం చేసుకొని తరువాత మాత్రమే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసే విధానం కూడా ఈ పోస్ట్ కింద ఇవ్వడం జరిగింది . ఈ పోస్టులో లేనటువంటి ఏదైనా సమస్య మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి .
Subscribe Youtube Channel
1.వయసు ఎంత ఉండాలి ?
దరఖాస్తు చేసే సమయానికి 21 - 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
2.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?
జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు .
3.బయట దేశం వారు దరఖాస్తు చేసుకోవచ్చా ?
అవకాశం లేదు
4.ప్రభుత్వ ఉద్యోగి / ఫుల్ టైం ప్రైవేటుగా ఉద్యోగం / ఫుల్ టైం ఎడ్యుకేషన్ చేస్తున్నవారు అర్హుల ?
కాదు
5.ఆన్లైన్ లో లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారు అర్హుల ?
అవును అర్హులు
6.ఏ కోర్సులు చేసిన వారు దీనికి అర్హులు ?
తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి దానిపై Polytechnic , ITI , BA , BSC , BPharm, BBA వంటి ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు.
7.కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి ?
కుటుంబంలో ఉన్న అందరి ఆదాయం కలుపుకొని సంవత్సరానికి 8 లక్షల లోపు ఉండాలి
8.కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే విద్యార్థి అర్హుడా ?
అనర్హులు
9.గతంలో ఏదైనా కేంద్రాల లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో Skill, Apprenticeship, Internship or Training Programme పొంది ఉన్నవారు అర్హుల ?
అనర్హులు
10.CA, CMA, CS, MBBS, BDS, MBA, PhD, లేదా ఇతర మాస్టర్స్ లేదా పై డిగ్రీ చేసిన వారు అర్హుల ?
అనర్హులు
11.IITs, IIMs, National Law Universities, IISER, NIDs, IIITs వంటి యూనివర్సిటీలలో చదివిన వారు అర్హుల ?
అనర్హులు
12.ఈ ఇంటర్న్ షిప్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి ?
నేరుగా ఆనులైన లింకు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిపై క్లిక్ చేసి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు
PM Internship Application Link
13.అప్లికేషన్ చేయడానికి ముందుగా ఏమి సిద్ధం చేసుకోవాలి ?
- 10th Certificate + Other Qualification Certificate [ Below 7MB , PDF Format ]
- Aadhaar Card Number
- Aadhaar Linked Mobile Number [ For OTP ]
- DigiLocker PIN [ If Aadhaar Verification Not Worked ]
- Smartphone / PC For e-Mail ID verification
- Age 21-25 [ As on Application Date ]
14.Digi Locker ఎకౌంటు లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదా?
Digi Locker అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ అవుతుంది అప్పుడు కేవలం ఆధార్ ధ్రువీకరణ ద్వారా మాత్రమే అవుతుంది .
15.రిజిస్ట్రేషన్ సమయంలో ఈమెయిల్ ఓటీపీ తప్పనిసరి ఉండాలా ?
అవును ఉండాలి .
16.పదవ తరగతి పాస్ అవ్వని వారి పరిస్థితి ఏమిటి?
వారు అనర్హులు
17.దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ తెలుస్తుంది ?
పైన ఇవ్వబడిన వెబ్సైట్లో లాగిన్ అయినట్టు అయితే అందులో అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
18.అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ?
మొత్తం మూడు స్టెప్స్ ఉంటాయి మొదటగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయడం తరువాత కంపెనీకి అప్లై చేయడం తర్వాత కంపెనీ వారు ఆమోదించడం .
19.సెలెక్ట్ అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది ?
కంపెనీ వారు మీరు దరఖాస్తు చేసిన వివరాలను మరియు వారి అవసరాల నిమిత్తం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత మీ లాగిన్ లో అప్లికేషన్ స్టేటస్ లో మీకు చూపిస్తుంది
20.ఇంటిమేషన్ లెటర్ అదే జాయినింగ్ ఆర్డర్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ?
జాయినింగ్ ఆర్డర్ కాపీ ఆన్ లైన్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలి
21.జాయిన్ అయినప్పుడు ఏదైనా డబ్బులు పడతాయా ?
అవును పడతాయి. జాయిన్ అయినారు అని చెప్పి కంపెనీ వారు ప్రభుత్వానికి వారి వెబ్సైట్ ద్వారా నివేదించిన వెంటనే ఎవరైతే జాయిన్ అవుతారో వారి ఆధార్ కార్డు లింక్ అయినా బ్యాంకు ఖాతాలో అక్షరాల 6000 క్రెడిట్ అవుతుంది.
మీ ఆధార్ కు ఈ బ్యాంకు లింక్ ఉంది ?
22.ప్రతి నెల ఎలా క్రెడిట్ అవుతుంది ఎంత క్రెడిట్ అవుతుంది ?
ఇంటర్నె షిప్ చేస్తున్న అభ్యర్థి నెలసరి హాజరు మరియు పనితీరు ప్రకారం కంపెనీ వారు 500 రూపాయలు క్రెడిట్ చేస్తారు క్రెడిట్ చేసిన విషయాన్ని ప్రభుత్వానికి నివేదించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మిగిలిన 4500 అభ్యర్థి ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఇలా మొత్తంగా నెలకు 5000 రూపాయలు క్రెడిట్ అవుతాయి.
23.ఒక నెల చేసి , ఒక నెల మానేస్తే మనీ క్రెడిట్ అవుతుందా ?
ఏ నెల నుంచి అయితే మానేస్తారో ఆ నెల నుంచి మనీ క్రెడిట్ అవ్వడం ఆగిపోతుంది
24.ఇంటర్న్ షిప్ ఎన్ని నెలలు ఉంటుంది ?
ఇంటర్ షిప్ మొత్తం 12 నెలలు అంటే ఒక సంవత్సరం ఉంటుంది
25.బీమా సదుపాయం కల్పిస్తారా ?
అవును ఇంటర్న్ షిప్ లో జాయిన్ అయిన తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రభుత్వం అభ్యర్థి పేరుపై ప్రారంభిస్తుంది.
26.సంవత్సరం తర్వాత బీమా జీవితాంతం కంటిన్యూ అవుతుందా ?
లేదు .కేవలం ఇంటర్ షిప్ చేస్తున్న ఒక సంవత్సరం కాలం మాత్రమే ఈ బీమా సదుపాయం ఉంటుంది
27.అసలు ఈ ఇంటర్సిటీ పథకం వలన ఉపయోగం ఏంటి ?
ఇంటర్నె షిప్ పథకం వలన ఎవరైతే అభ్యర్థి ఉంటారో వారి నెలసరి ఖర్చుల కింద 5000 రూపాయలు జాయిన్ అయిన వెంటనే 6000 రూపాయలు ఇలా సంవత్సరానికి 66వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమవుతాయి అదే విధంగా ఇంటర్నె షిప్ పూర్తి అయిన వెంటనే వారికి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ను తదుపరి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలకు దరఖాస్తు చేసే సమయంలో అప్లోడ్ చేసినట్లయితే అభ్యర్థికి ప్రాధాన్యత ఉంటుంది .
29.మిగిలిన ఇంటర్ షిప్ ప్రోగ్రాం తో కంపేర్ చేస్తే ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
ఈ ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది మరియు ఈ ప్రోగ్రాం లో సగానికి పైగా ఇంటర్షిప్ మొత్తం క్లాస్ రూమ్ బయట మాత్రమే ఉంటుంది అంటే రియల్ టైం లో అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం అభ్యర్థికి తెలియజేస్తారు
30.ఏ ఏ కంపెనీలు ఇంటర్షిప్ కల్పిస్తున్నాయి ?
ఈ పథకం ద్వారా కింద తెలిపిన 500 కంపెనీలు ఇంటర్షిప్ కల్పిస్తున్నాయి.
31. ఇంటర్న్ షిప్ సమయంలో రూమ్ , ఫుడ్ కోసం మనీ ఇస్తారా ?
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నగదు ఇవ్వదు . మొదట్లో కేవలం 6,000 నెల నెల ఇవ్వాల్సివని ఇస్తుంది . అభ్యర్థి జాయిన్ అయ్యే కంపెనీ పాలసీ ప్రకారం రూమ్ , ఫుడ్ అనేవి డిసైడ్ అవుతాయి .
32. దరఖాస్తుకు చివరి తేదీ అప్పుడు ?
మర్చి 31,2025
ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరియు టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Laste date for pm internship scheme application form
ReplyDelete