PM Internship Scheme 2025 Telugu
PM Internship Scheme 2025 Telugu
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం PM Internship Scheme 2025 Telugu అనేది భారతదేశంలోని టాప్ 500 కంపెనీలలో Download 500 PM Internship Companies List యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడానికి భారతదేశ ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం . ఈ కార్యక్రమం ద్వారా దేశ యువత నిజ జీవిత వ్యాపార వాతావరణ అలవాటు చేసుకోవడం, విలువైన నైపుణ్యాలను నేర్చుకోవటం , పని అనుభవాన్ని తక్కువ కాలంలో ఎక్కువ పొందడానికి చాలా ఉపయోగపడుతుంది . ఈ PM Internship Scheme 2025 Telugu పథకం ద్వారా రానున్న 5 సంవత్సరాలలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ ను ప్రభుత్వం అందించనుంది . దరఖాస్తుకు చివరి తేదీ మర్చి 31 , 2025
Eligibility
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం PM Internship Scheme 2025 Telugu Eligibility అర్హతలు
- భారతీయులై ఉండాలి.
- అప్లికేషన్ చేసే సమయానికి సర్టిఫికెట్ ప్రకారం వయసు 21 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు.\
- ఫుల్ టైం ఉద్యోగిగా ఎక్కడ ఉండకూడదు .
- ఫుల్ టైం ఎడ్యుకేషన్ ప్రస్తుతం చేస్తూ ఉండకూడదు.
- ఆనులైన్లో లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారు అర్హులు .
- SSC, Polytechnic , ITI , BA , BSC , BPharm, BBA వంటి ఏదైనా డిగ్రీ ఉండాలి
Ineligiblity
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం PM Internship Scheme 2025 Telugu Ineligibility అనర్హులు
- దరఖాస్తు చేసే సమయానికి అప్లికేషన్ చేయు వారి వయసు 21 కన్నా తక్కువ 24 కన్నా ఎక్కువ ఉండకూడదు .
- ప్రభుత్వ ఉద్యోగి అయిన వారు అనర్హులు .
- ఫుల్ టైం ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు .
- ఫుల్ టైం ఎడ్యుకేషన్ కోర్సు ప్రస్తుతం చేస్తున్న వారు అనర్హులు.
- IITs, IIMs, National Law Universities, IISER, NIDs, IIITs వంటి యూనివర్సిటీలలో చదివిన వారు అనర్హులు .
- CA, CMA, CS, MBBS, BDS, MBA, PhD, లేదా ఇతర మాస్టర్స్ లేదా పై డిగ్రీ చేసిన వారు అనర్హులు .
- రాష్ట్రా లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో ఏదైనా Skill, Apprenticeship, Internship or Training Programme పొంది ఉన్నవారు అనర్హులు .
- NATS , NAPS లో గతంలో ఇంటర్ షిప్ చేసి ఉంటే వారు అనర్హులు .
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబ ఆదాయం 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటే వారు అనర్హులు .
- కుటుంబ సభ్యులు ఎవరైనా అంటే తల్లి లేదా తండ్రి పెళ్లయితే భర్త లేదా భార్య లేదా స్వతహాగా దరఖాస్తు చేసిన వారు ప్రభుత్వ ఉద్యోగి అయితే వారు అనర్హులు.
Benefits
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం PM Internship Scheme 2025 Telugu Benefits లబ్ది
- అర్హత సాధించిన వారికి జాయినింగ్ ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా 6,000 నేరుగా ఆధార్ కార్డు లింక్ అయినా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
- ఇంటర్న్ షిప్ ప్రారంభమైన తర్వాత ప్రతి నెల ఏ కంపెనీ లో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ద్వారా 500 రూపాయల నగదు ఇంటర్నన్షిప్ చేస్తున్న వారి బ్యాంకు ఖాతాలో జమ అయిన తరువాత కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగిలిన 4500 నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది .మొత్తం ఒక నెలకు 5000 రూపాయలు నగదు బ్యాంకు ఖాతాలో ఇంటర్షిప్ చేస్తున్న వారి కాంతాలో జమ అవుతుంది.
- జాయిన్ అయిన సంవత్సరం కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన & ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రెండు కూడా సెలక్ట్ అయిన వారి పేరుపై ప్రభుత్వం ఆటోమేటిగ్గా మొదలు పెడుతుంది ,ఇది ఒక సంవత్సరకాలం పొడుగునా ఆ యొక్క ఇంటర్నెట్ షిప్ చేస్తున్న వారిపై ఉంటుంది .
- ఒక సంవత్సరం పూర్తి అయిన తర్వాత కంపెనీ వారిచ్చే సర్టిఫికెట్ తో కేంద్ర రాష్ట్ర జాబులకు ఈ సర్టిఫికెట్ అప్లోడ్ చేసినట్లయితే ప్రాధాన్యత ఉంటుంది.
Application Process
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం PM Internship Scheme 2025 Telugu Application Process దరఖాస్తు విధానం .
అప్లికేషన్ పూర్తి ప్రాసెస్ ఇలా ఉంటుంది
Registration in PM Internship Scheme Portal
⏬
Internship Application In PM Internship Scheme Portal
⏬
దరఖాస్తు చేసే ముందు కింద తెలిపిన వివరాలన్నీ కూడా సిద్ధం చేసుకుని కింద ఇచ్చినటువంటి మ్యానువల్ డౌన్లోడ్ PM Internship Application Process user Manual చేసుకొని మాన్యువల్ ఫాలో అవుతూ కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లికేషన్ను చేయవచ్చు .
- 10th Certificate + Other Qualification Certificate [ Below 7MB , PDF Format ]
- Aadhaar Card Number
- Aadhaar Linked Mobile Number [ For OTP ]
- DigiLocker PIN [ If Aadhaar Verification Not Worked ]
- Smartphone / PC For e-Mail ID verification
- Age 21-25 [ As on Application Date ]
PM Internship Application Link
Selection Process
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 500 కంపెనీలలో వారి యొక్క అవసరం మేరకు అప్లికేషన్ చేసే సమయంలో ఇచ్చేటువంటి వివరాల ప్రకారం కంపెనీ అవసరాల మేరకు ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ చేసిన వారిని సెలక్షన్ చేయడం జరుగుతుంది . సెలక్షన్ చేసిన తర్వాత ఎవరినైతే సెలక్షన్ చేస్తారో వారికి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలక్షన్ అయిన వారు నేరుగా వారి యొక్క లాగిన్ ఓపెన్ చేసి ఆన్లైన్ లోనే సెలక్షన్ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు . సొంత రాష్ట్రంలోనే దగ్గరలో ఉన్నటువంటి స్థానంలో కూడా దరఖాస్తు చేసే సమయంలో అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సెలక్షన్ అయిన ప్లేసులో వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
జాయిన్ అయినట్టు కంపెనీ వారు వారి యొక్క పోర్టల్ లాగిన్ లో తెలిపిన వెంటనే జాయిన్ అయిన వారి బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నుండి 6000 రూపాయలు నేరుగా జమవడం జరుగుతుంది. తరువాత నెలనెలా వాయిగా కంపెనీ వారు 500 రూపాయలు విడుదల చేసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగిలిన 4500 జమ చేయడం జరుగుతుంది ఇలా మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా 12 నెలలు పూర్తి చేసిన వారికి ప్రతి నెల 5000 చొప్పున 60 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది చివరగా సర్టిఫికెట్ కూడా సంబంధిత కంపెనీ వారు ఇవ్వడమైతే జరుగుతుంది .