AP Housing for All Scheme 2025 FAQs AP Housing for All Scheme 2025 FAQs

AP Housing for All Scheme 2025 FAQs

 

AP Housing for All Scheme 2025 AP Housing Scheme 2025 eligibility AP Housing for All Scheme FAQs AP Housing for All Scheme apply online AP Housing Scheme beneficiary list 2025 AP Housing Scheme latest updates AP Housing Scheme online application process AP Housing for All Scheme application status How to apply for AP Housing Scheme 2025 AP Housing Scheme documents required AP Government housing scheme 2025 AP Housing Scheme official website AP Housing for All application form 2025 Andhra Pradesh housing scheme latest news AP housing scheme selection process How to check AP Housing Scheme status AP Housing Scheme subsidy details Land allotment in AP Housing Scheme AP Housing Scheme income limit AP Housing for All eligibility criteria AP Housing Scheme land distribution AP Housing Scheme 2025 registration How much land is given in AP Housing Scheme? AP Housing for All land allotment status Andhra Pradesh housing scheme financial assistance AP Housing Scheme 2025 new beneficiary list AP Housing Scheme required documents Andhra Pradesh free housing scheme 2025 AP Housing Scheme approval process AP Housing Scheme construction guidelines AP Housing Scheme house size details Andhra Pradesh government free house scheme How to check AP Housing Scheme beneficiary list AP Housing Scheme application tracking AP Housing Scheme official notification AP Housing Scheme 2025 final list AP Housing Scheme eligibility check AP Housing Scheme grama sachivalayam AP Housing Scheme online application link AP Housing Scheme latest government orders AP Housing Scheme beneficiary selection process AP Housing Scheme allotment status check AP Housing Scheme 2025 district-wise list Andhra Pradesh housing scheme subsidy details AP housing scheme latest beneficiary updates AP Housing Scheme sanctioned list How to download AP Housing Scheme application form AP Housing Scheme Aadhaar verification AP Housing Scheme 2025 helpline number AP Housing Scheme required income proof

AP Housing for All Scheme 2025 FAQs


AP Housing for All Scheme Details in telugu 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి ఉచితంగా ఇంటి పట్టా Free Housesite Pattas అందించి పక్కా ఇల్లు ని,ర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇల్లు Housing for All Scheme అనే పథకాన్ని ప్రారంభించి దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల చేసినది. ఉత్తర్వులు విడుదలైన తర్వాత ప్రజలలో చాలా ప్రశ్నలు AP Housing for All Scheme 2025 FAQs అయితే ఉన్నాయి. ఆ ప్రశ్నలను అన్ని కూడా ఒకే దగ్గర క్రోడీకరించి ఇక్కడ పోస్ట్ చేయడమైతే జరిగింది . ఈ ప్రశ్నలలో మీకు సంబంధించిన ప్రశ్న ఎక్కడ లేకపోతే దయచేసి కింద కామెంట్ సెక్షన్ లో  తెలియజేయండి . 


AP Housing for All Scheme 2025 FAQs List 


1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం Housing for All Scheme 2025 ద్వారా ఎంత స్థలాన్ని కేటాయిస్తుంది ?

ఈ పథకం ద్వారా గ్రామాల్లో 3 సెంట్లు,  పట్టణాల్లో 2 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తుంది .


2. ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా ఇస్తుందా ?

అవును . కేటాయించిన స్థలానికి,  ఎవరి పేరు మీదైతే కేటాయింపు జరుగుతుందో వారు పేరు పై పట్టా Housesite Patta అనేది అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది .

3. పట్టా తీసుకున్న ఎన్ని రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి ?

ఇంటి స్థలానికి సంబంధించి పట్టా AP Housesite Patta అందుకున్న తర్వాత తప్పనిసరిగా 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది .


4. పట్టా తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలలో ఇంటి నిర్మాణం AP Housesite Constrction ప్రారంభించక పోతే ఏమవుతుంది ? 

ఆ పట్ట అనేది ఆ వ్యక్తి పేరు పై క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అంటే రద్దు అవుతుంది మరల కొత్తగా శాంక్షన్ అనేది తరువాత వచ్చే పథకాలపై ఆధారపడి ఉంటుంది .


5. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హత ఉంటుందా ? ఉండదా ? 

షన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హత ఉండదు. 


6. రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు లో ఉన్న వ్యక్తుల పేరుపై గతంలో ఎక్కడ అయినా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే హౌసింగ్ స్కీము కానీ హౌసింగ్ పట్టా గాని ఇల్లు గాని శాంక్షన్ అయి ఉంటే వారి ఇంట్లో మిగిలిన వారికి రావాలంటే ఏం చేయాలి ? 

తప్పనిసరిగా ఆ రేషన్ కార్డులో ఎవరైతే గతంలో  హౌసింగ్ స్కీము కానీ హౌసింగ్ పట్టా గాని ఇల్లు గాని శాంక్షన్ అయి ఉంటే వారు రేషన్ కార్డు నుంచి విభజన అయిన తరువాత , కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించిన వారు అవుతారు. కాబట్టి గతంలో ఎవరైతే రేషన్ కార్డు లో ఉండి హౌసింగ్ స్కీమ్ గాని పక్కా ఇలాగానే పొండి పొంది ఉంటారో వారు హౌసింగ్ రేషన్ కార్డులో విభజన అయిన తర్వాత మాత్రమే ఈ పథకానికి ఆ కార్డులో మిగిలిన వారు అర్హత పొందినవారు అవుతారు .


7. సొంత ఊర్లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే Housing for All Scheme Housesite Patta ఉంటే సొంత ఊరిలో Housesite Patta తీసుకోవడానికి అర్హుల ?

లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా సరే  Housesite Patta గాని సొంత ఇల్లు గానీ శాంక్షన్ అయి ఉంటే వారు సొంత ఊరిలో  Housesite Patta పొందడానికి అనర్హులు .


8. ప్రస్తుత ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో Housesite Patta శాంక్షన్ అయి ఉంటే వారు అర్హులా ?

లేదు. ఏ ప్రభుత్వంలో కూడా వారిపై Housesite Patta అనేది శాంక్షన్ అదే ఆమోదం అయి ఉండకూడదు.


9. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలంటే కుటుంబం మొత్తానికి వ్యవసాయ భూమి ఎంత ఉండాలి?

ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలి అంటే కుటుంబం మొత్తం కలుపుకొని వ్యవసాయ భూమి అనేది మాగానే అయితే 2.5 ఎకరాలు , మెట్ట భూమైతే 5 ఎకరాలు , రెండు కలుపుకొని 5 ఎకరాల లోపు భూమైతే ఉండాలి. ఈ లిమిట్ కి దాటి ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ కుటుంబం ఈ పథకానికి అనర్హులవుతారు.


10.  గతంలో ఇచ్చిన ఇంటి పట్టా స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం నచ్చకపోతే మరలా మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చా ? 

అవును . మరలా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఒక షరతు ఉంటుంది ఏంటంటే గతంలో ఇచ్చిన హౌస్ సైడ్ పట్టాలో మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఉండకూడదు మరియు అది మీ పేరుపై ఉండాలి .

11. అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది , ప్రారంభం అయ్యిందా ?

ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేసింది గాని ఇంకా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది అయితే ఇంకా ఎక్కడ కూడా చెప్పలేదు . దయచేసి తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఎటువంటి అధికారి సమాచారం వచ్చిన మన [ Telugu Helper Telegram Channe l లో వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది .


12. ఇంటి పట్టా వచ్చిన తర్వాత ఇల్లు సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టి ఇస్తుందా ?

సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టి ఇవ్వాలా అనేది ప్రజలకు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. సొంతంగా కట్టుకునే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి హౌసింగ్ పథకాల్లో [ AP HOUSING SCHEME ] వారి పేర్లు నమోదు చేసి విడతల వారీగా నగదును ఇవ్వటం జరుగుతుంది . అలా కాకుండా ప్రభుత్వమే కట్టి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కట్టివ్వడమైతే జరుగుతుంది పట్టణాల్లో అయితే ప్రభుత్వ ఏజెన్సీ లతో పాటుగా ఏపీ టెట్కో యూఎస్బీల ద్వారా కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది.


13. ఆధార్ కార్డులో అడ్రస్సు ఆంధ్రప్రదేశ్ దాటి ఉండి ఆంధ్రప్రదేశ్ లో నివాసితులై ఉంటే వారు అర్హుల ? 

వారు అర్హులు కారు . తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి ఆధార్ కార్డులు అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్ ది ఉండాలి .


14. ఆధార్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హుల ? 

ఈ పథకానికి దరఖాస్తు చేయాలన్న, లబ్ధిదారుల ఎంపిక జరగాలని తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి . ఆధార్ కార్డు పనిచేస్తూ ఉండాలి .


15. గతంలో స్మశాన వాటికలో లేదా ఊరు బయట లేదా ఊరికి చాలా దిగున ఇంటి స్థలం కేటాయించి ఉంటే వారు ఏం చేయాలి ?  

స్మశాన వాటిక దగ్గరగా ఇచ్చిన లేదా ఎక్కువ నీరు నిల్వ ఉండే ప్రదేశంలో ఇచ్చిన లేదా గ్రామానికి లేదా హాబిటేషన్కు బయట ఇంటి పట్టా ఇచ్చిన వారు ఆ పట్టాను రద్దు చేసి మరల కొత్త పట్టాను ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు.


16. ఈ పథకానికి దరఖాస్తు చేయాలి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ?

ఉచిత ఇళ్ల పట్టాల పథకానికి దరఖాస్తు చెయ్యాలి అంటే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వారి గ్రామ లేదా వార్డులో ఉన్నటువంటి రెవెన్యూ అధికారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.


17. ఇంట్లో ఎవరి పేరు మీదైనా కరెంటు మీటర్ ఉంటే ఆ ఇంట్లో వారు అర్హులా ?ఇంట్లో ఎవరు పేరుపై అయినా కరెంటు మీటరు ఉంటే ఆ ఇంట్లో అందరూ అనర్హులే .


18. ఇంట్లో ఎవరి పేరుపై అయినా హౌస్ టాక్స్ ఉన్నట్టయితే  అర్హులా ?

అనర్హులు .


19. ఇంట్లో ఎవరి పేరు పై అయినా నాలుగు చక్రాల వాహనం ఉంటే వారు అర్హులా ?

అనర్హులు. 


20. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే వారు అర్హులా ? 

అనర్హులు.


21. గతంలో ప్లాట్లు ఇచ్చిన వద్ద ఇంటి నిర్మాణం ప్రారంభమై మధ్యలో ప్లాటు ఖాళీగా ఉండి ఆ ప్లాటు లో ఇంటి నిర్మాణం చేపట్టమని లబ్ధిదారుడంటే దానిని రద్దు చేస్తారా ?

అవును రద్దుచేసి మరల కొత్త ప్లాటుని ఇచ్చే అవకాశం ఉంది .


22. లబ్ధిదారుల ఎంపికలో ఏవైనా అవకతవకలు ఉన్నాయి అని మీరు గమనిస్తే వాటిని ఎలా తెలియజేయాలి ?

లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత లబ్ధిదారుల వివరాలను తప్పనిసరిగా గ్రామసభను నిర్వహించి అందులో తెలపాల్సి ఉంటుంది . అందులో ఎటువంటి ఫిర్యాదులు వచ్చినట్టయితే ఫిర్యాదు వచ్చిన విషయంపై తనిఖీ నిర్వహించి నిజంగా ఫిర్యాదు నిజమని తేలితే తప్పనిసరిగా ఆ యొక్క లబ్ధిదారున్ని దరఖాస్తును రిజెక్ట్ చేయడం జరుగుతుంది .

23. గ్రామంలో ఇంటి పట్టా ఇవ్వటానికి ప్రభుత్వ స్థలం లేకపోతే అప్పుడు ఏమవుతుంది , ఎక్కడ ఇస్తారు ?

గ్రామంలో ఇంటి పట్టా ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం లేకపోతే సంబంధిత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్పెషల్ కేసులో దగ్గరలో ఉన్న గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో ఇంటి పట్టా ఇవ్వటం జరుగుతుంది.


24. తప్పుడు సమాచారంతో ఒకవేళ ఇంటి పట్టాను పొందినట్లయితే తప్పుడు సమాచారంతో తీసుకున్నట్టు రుజువైతే ఆ పట్టాను వెంటనే వేరే వారికి ఇచ్చే అవకాశం ఉన్నదా  ?

అవును. తప్పుడు సమాచారంతో ఇంటి పట్టాను తీసుకున్నట్లయితే అది రద్దు చేసి వెంటనే అర్హులైన వారికిచ్చే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.


25.  అందరికీ ఇల్లు పథకంలో పథకంలో ఇంటిపట్టాకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు ?

ఈ పథకం ద్వారా ఇంటి పట్టాకు దరఖాస్తు చేయడానికి ఈ పోస్ట్ రాసిన తేదీ నాటికి అప్లికేషన్ తేదీ ఇంకా ప్రారంభం అవ్వలేదు .ఎటువంటి అధికారం సమాచారం అందిన వెంటనే వాట్సాప్ ఛానల్లో [ Join Telugu Helper Whatsapp Channel ] పోస్ట్ చేయడం జరుగుతుంది కావున అందరూ ఛానల్లో జాయిన్ అవ్వండి .


26.  ఈ పథకం ద్వారా వచ్చినటువంటి ఇంటిపట్టాను అవసరం నిమిత్తం ఎవరికైనా అమ్ముకోవచ్చా ?

అమ్ముకోవచ్చు. కానీ ఒక షరతు ఉంటుంది పట్టా ఆమోదం పొందిన తేదీ నుండి కనీసం 10 సంవత్సరాలు సమయం తర్వాత మాత్రమే వేరొకరికి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే 100% హక్కు ఆ ఇంటి స్థలం పై వస్తుంది.


27. AP Housing for All Scheme సాంక్షన్ లిస్ట్ ఎలా తెలుసుకోవాలి ?

సాంక్షన్ లిస్ట్ విడుదలైన వెంటనే గ్రామా లేదా వార్డు సచివాలయంలో ప్రదర్శన నిమిత్తం నోటీస్ కోర్టులో పెట్టడం జరుగుతుంది.


28. AP Housing for All Schemeసంబంధించి అధికారిక ఉత్తర్వులు ఎలా పొందాలి ?

కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసినట్టయితే అధికారిక ఉత్తర్వులు ఉంటాయి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP Housing For All Scheme GO


29. AP Housing for All Scheme eligibility check ఎలా చేసుకోవాలి ?

మీయొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ వారికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వివరాలు సమర్పించినట్టయితే మీరు అర్హులా కాదని చెప్పి వెబ్సైట్లో చెక్ చేసి చెప్తారు.


30. AP Housing for All Scheme application tracking ఎలా చేయాలి ?

ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. లేదా సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వారికి అడిగిన అప్లికేషన్ స్టేటస్ను చెప్తారు.


31. AAP Housing for All Scheme required documents ఏమిటి ?

  • ఆధార్ కార్డుల జెరాక్స్ [ భార్య + భర్త ] సంతకాలతో 
  • రేషన్ కార్డు / బియ్యం కార్డు జెరాక్స్ 
  • బ్యాంకు అకౌంట్ జెరాక్స్ [ భార్య + భర్త ]
  • జాబ్ కార్డు జెరాక్స్ 
  • దరఖాస్తు దారుని పాస్ పోర్ట్ సైజు ఫోటో [ 2 ]
  • క్యాస్ట్ సర్టిఫికెట్ 
  • ఇన్కమ్ సర్టిఫికెట్ 
  • పనిచేస్తున్న మొబైల్ నెంబర్

అప్లికేషన్లు కావలసిన డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు మారొచ్చు కాబట్టి ఒకసారి మీ యొక్క సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారుల్ని కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి.


32. How much land is given in AP Housing for All Scheme ? 

గ్రామాలైతే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు భూమి ఇస్తారు


33. AP Housing Scheme income limit ఎంత ఉండాలి ?

సంవత్సర ఆదాయం 1,20,000 కు మించి ఉండకూడదు .


Post a Comment

2 Comments
  1. Aadar lo address Amma valladi,ration card lo address athinti valladi vunte parleda

    ReplyDelete
  2. Maku loan sanction aindhi but ma amma march 4 2025 ki heart stock valla chanipoyaru nenu ma brother nomini ga unnam but loan agipothundi antunaru memu yela approach avvali.

    ReplyDelete