Clustering Of Secretariats - Rationalisation Of AP GSWS Employees 2025 Clustering Of Secretariats - Rationalisation Of AP GSWS Employees 2025

Clustering Of Secretariats - Rationalisation Of AP GSWS Employees 2025

 

Clustering Of Secretariats - Rationalization Of GSWS Employees 2025


Clustering Of GSWS Secretariats 

Rationalisation Of GSWS Employees లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రెండు విభాగాలుగా విభజించనున్నారు. మొదటి విభాగంలో Multipurpose GSWS employess గా ,  రెండో విభాగంలో Technical GSWS Employees  గా సచివాలయం ఉద్యోగులు విభజన కానున్నారు . సచివాలయాలు కూడా 3 క్యాటగిరీలుగా మారనునున్నాయి . ఉద్యోగుల విభజనకు ముందు Clustering Of GSWS Secretariats అనేది ప్రభుత్వం చేపట్టనుంది. ప్రతి గ్రామాన్ని వాలంటీర్ల క్లస్టర్ గా ఎలా అప్పట్లో  విభజన చేసారో అదేవిధంగా మండల / మున్సిపాలిటీ స్థాయిలో పక్కపక్క ఉన్న సచివాలయాలను క్లస్టర్ల వారీగా MPDO / MC వారు కలపనున్నారు. ఆ తర్వాత ఉద్యోగులను కేటాయింపు అనేది జరుగుతుంది . ఈ ప్రక్రియ ద్వారా సచివాలయాలు తగ్గవు, అలా అని పెరగవు , అదే విధంగా స్థానం కూడా మారదు . కేవలం టెక్నికల్ ఉద్యోగుల కోసం మాత్రమే Clustering Of GSWS Secretariats పనిని ప్రభుత్వం ప్రారంభించింది . 


Multipurpose GSWS employess 

గ్రామ సచివాలయాల్లో...

  1. పంచాయతీ కార్యదర్శి Gr I - V
  2. డిజిటల్ అసిస్టెంట్
  3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 
  4. గ్రామ మహిళా కార్యదర్శి [ మహిళా పోలీస్ ] 

వార్డు సచివాలయాల్లో...

  1. వార్డ్ అడ్మిన్ సెక్రటరీ
  2. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  3. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ
  4. వార్డ్ మహిళా పోలీస్



Technical GSWS Employees 

గ్రామ సచివాలయాల్లో...

  1. గ్రామ రెవెన్యూ అధికారి 
  2. ANM 
  3. సర్వే అసిస్టెంట్ 
  4. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 
  5. అగ్రికల్చర్ / ఆర్టికల్చర్ / సెరికల్చర్ అసిస్టెంట్ 
  6. వెటర్నరీ / ఫిషరీస్ 
  7. ఎనర్జీ అసిస్టెంట్ 


వార్డు సచివాలయాల్లో...

  1. వార్డ్ రెవెన్యూ సెక్రెటరీ 
  2. వార్డ్ హెల్త్ సెక్రటరీ 
  3. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 
  4. వార్డ్ అమ్యూనిటీస్ సెక్రెటరీ  
  5. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ 
  6. వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్



Categories Of GSWS Secretariats  

  • కేటగిరి A అంటే 2500 కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి సచివాలయాల 
  • కేటగిరి B సచివాలయాలు అంటే 2051 నుండి 3500 జనాభా వరకు ఉన్నటువంటి సచివాలయాలు 
  • కేటగిరి C సచివాలయాలు అంటే 3501 నుండి దానికన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామ వార్డు సచివాలయాలు 


Clustering Of GSWS Secretariats Guidlines  

Clustering Of Secretariats Rules Guidlines - Rationalization Of GSWS Employees 2025


  • ప్రస్తుతం ఒక సచివాలయ పరిధిలో ఒక టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు . భవిష్యత్తులో రెండు సచివాలయాలను ఒక క్లస్టర్ గా చేస్తూ ఆ క్లస్టర్ కు టెక్నికల్ విభాగంలో ఉన్న ఒక సచివాలయ ఉద్యోగుని ను జోడించడం జరుగుతుంది. వారు ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న రెండు సచివాలయాలకు సేవలు అందిస్తారు.
  • జనాభా ఆధారంగా ఈ Clustering Of Secretariats ఉండదు కేవలం ప్రక్క ప్రక్కన ఉంటే సరిపోతుంది . 5 వేల జనాభా కలిగిన ఒక సచివాలయం పక్కనే ఇంకొక 5 వేల జనాభా కలిగిన సచివాలయం ఉన్నట్లయితే ఆ రెండు పక్క పక్కన ఉన్నట్లయితే వాటిని ఒక క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది అప్పుడు ఆ క్లస్టర్ పరిధిలో మొత్తం జనాభా 10 వేలు అవుతుంది .
  • జనాభా ఆధారంగా సచివాలయాలను 3 క్యాటగిరీలుగా విభజిస్తున్న విషయం తెలిసిందే అది కేవలం ఎవరైతే మల్టీపర్పస్ ఉద్యోగులు ఉంటారు వారిని ఉద్దేశించి మాత్రమే.  అంత జనాభా కు ఎంత మంది మల్టీపర్పస్ స్టాప్ అందుబాటులో ఉండాలి అని ఉద్దేశించి సచివాలయాలను మూడు క్యాటగిరీలుగా విభజన చేయడం జరుగుతుంది .
  • ఒక మండల లేదా మున్సిపాలిటీ పరిధిలో సచివాలయ సంఖ్య సరి సంఖ్య [ 10,12,14,16 etc... ] అయితే ప్రతి క్లస్టర్కు 2 సచివాలయాలు వస్తాయి. అదే సచివాలయాల సంఖ్య బేసి సంఖ్య అయితే [ 11,13,15,17,19etc... ] అప్పుడు ఒక క్లస్టర్లో మాత్రమే 1లేదా 3 సచివాలయాలను గ్రూప్ చేస్తూ క్లస్టర్ను ఏర్పాటు చేస్తూ మిగిలిన క్లస్టర్లలో రెండు సచివాలయాల చొప్పున  క్లస్టర్ చేయాల్సి ఉంటుంది . 
  • మండలము లేదా మున్సిపాలిటీలో బేసి సంఖ్య సచివాలయాలు ఉన్నప్పుడు ఒకటికి మించి ఎక్కువ క్లస్టర్లలో  ఒకటికి మించి ఎక్కువ క్లస్టర్లలో మూడు లేదా ఒకటి సచివాలయాలు ఉండడానికి లేదు.
  • గ్రామాల నుండి వార్డుకు షిఫ్ట్ అయినవి మరియు కోర్టు కేసులు ఉన్న సచివాలయాలను జిల్లా కోఆర్డినేటర్ వారి ద్వారా రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది.
  • Clustering Of Secretariat కు సచివాలయ పరిధిలో ఉన్న క్లస్టర్ లకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం సచివాల పరిధిలో ఉన్న క్లస్టర్లు పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా జనాభాపరంగా సర్దుబాటు చేయడానికి ఈ ఆప్షన్ ద్వారా అవకాశం ఉండదు . 
  • ఈ ప్రక్రియ ద్వారా సచివాలయాలు తగ్గవు, అలా అని పెరగవు , అదే విధంగా స్థానం కూడా మారదు

Clustering Of Secretariats User Manual 

Post a Comment

1 Comments