పేదలకు గుడ్ న్యూస్.. Govt Increases Funding For AP Housing Beneficiaries పేదలకు గుడ్ న్యూస్.. Govt Increases Funding For AP Housing Beneficiaries

పేదలకు గుడ్ న్యూస్.. Govt Increases Funding For AP Housing Beneficiaries

 

Govt increases funding for AP housing scheme beneficiaries, providing extra financial aid for home completion

Govt Increases Fundin For AP Housing Beneficiaries  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహాలను నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న AP Housing Scheme పేదల ఇళ్లను పూర్తి చేయడానికి వాటి యూనిట్ విలువకు మించి అదనపు సాయం అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు GORT No 9 విడుదల చేసింది. గతంలో PMAY(Urban), PMAY (Gramin), PM JANMAN Housing కింద SC,ST & BC లు, అత్యంత వెనుకబడిన గిరిజనుల (PVTG)కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయింది. కూటవి ప్రభుత్వం SwarnAndhra 2047 Vision లో భాగంగా 2029 నాటికి 'అందరికీ ఇళ్లు' నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

అదనపు సాయం ఉత్తర్వుల గురించి రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి కూడా అసెంబ్లీలో తెలియజే శారు. దీనితోపాటు 

  • డ్వాక్రా సభ్యులకు సున్నా వడ్డీపై రూ.35 వేల రుణ సౌకర్యం, 
  • ఉచిత ఇసుక సరఫరా, 
  • ఆ ఇసుక రవాణా కోసం రూ.15 వేల చొప్పున చార్జీలు అందజేత 
  • 3 లక్షల ఇళ్లను ఈ జూన్ లోపు పూర్తి చేయనున్నారు 
  • మిగిలినవి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు.


Additional Assistance for SC/ST/BC Beneficiaries:

AP Housing Scheme ప్రభుత్వం అందించే అదనపు సాయం కింద తెలిపిన విధంగా ఉండనుంది 

Extra Financial Aid for SC, ST & BC Beneficiaries: Boosting PMAY & PM JANMAN Housing Completion

  • SC లకు - రూ. 50 వేలు, 
  • BC లకు - రూ.50 వేలు, 
  • SC లకు - రూ. 75 వేలు, 
  • PVTG లకు - రూ. 1 లక్ష 

చొప్పున ఈ అదనపు సాయం అందించనుంది.  


అదనపు ఆర్థిక సహాయాన్ని పొందేందుకుగాను ప్రజలు వారు ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కాంటాక్ట్ అవ్వాలి లేని పక్షాన మండల స్థాయిలో హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్[ Housing AE ] వారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది


New Financial Assistance Scheme: Completing SC/ST/BC Homes Under PMAY & PM JANMAN 

AP Housing Scheme 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.53 లక్షల ఇళ్లకు పునాది కూడా తీయలేదు. వివిధ దశల్లో ఉన్న 7.35 లక్షల ఇళ్లలో, దాదాపు 2.58 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ లబ్దిదారులవని అంచనా. ఎస్సీలు 1.76 లక్షల మంది ఉండగా, వీరికి అందించే రూ.50 వేల అదనపు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం రూ.880 కోట్లు వెచ్చించనుంది. 

ఎస్టీలు 30 వేల మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వీరికి రూ.75 వేల చొప్పున చెల్లించేందుకు రూ.225 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. ఆదివాసీ గిరిజనులు (పీవీ జీటీలు) 44 వేల మందికి రూ. లక్ష చొప్పున రూ.440 కోట్లు చెల్లించనున్నారు. 8,494 మంది చేనేత కార్మికు లకు రూ.50 వేల చొప్పున మొత్తంగా రూ.42, 47 కోట్లు వ్యయం కానుంది. 

ఇతర బీసీ వర్గాల వారు 3.50 లక్షల వరకు ఉన్నారు. వీరికి కూడా రూ.50 వేల చొప్పున అందించేందుకు రూ.1,750 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం చేపట్టని 5. 53 లక్షల మంది ముందుకువస్తే వారికి కూడా ఈ అదనపు సాయాన్ని వర్తింపజేయనుంది.


స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంలో భాగంగా 2029 నాటికి అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1.25 లక్షల గృహాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో 7.35 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో జూన్ నాటికి మరో 3 లక్షల పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ప్రభుత్వ అదనపు ఆర్థిక సాయాన్ని వినియోగించుకుని లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.


Telugu helper Telegram Channel Link


AP Government Increases Funding for SC, ST & BC Beneficiaries in PMAY & PM JANMAN Housing GO Copy 

 

Post a Comment

0 Comments