Online Ration Card Status Check: Everything You Need to Know
AP Govt 2025 మే 7 నుండి పునః ప్రారంభించిన 7 Ration Card Services కు సొంత గ్రామ లేదా వార్డు సచివాలయంలో Apply చేసుకున్న తర్వాత అక్కడే Ration Card Receipt ప్రజలు పొందుతారు. Ration Card Apply చేసిన వెంటనే Ration Card eKYC కు పేర్లు రావటానికి సమయం పడుతుంది . పేర్లు వచ్చిన తర్వాత GSWS Employees App లోనే eKYC చేస్తారు . తర్వాత VRO వారి AP Seva Portal లో వచ్చే Six Step Validation Form లో అన్ని వివరాలు సరిచూసుకున్నాక MRO వారు ఆమోదం చేసినట్లయితే రేషన్ కార్డు వస్తుంది
ఈ మొత్తం ప్రాసెస్ జరగటానికి సర్వీసును బట్టి 21 నుండి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు చేసిన దరఖాస్తు ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది? ఎవరు ఎప్పుడు ఆమోదం చేశారు? ఎవరు ఆమోదం చేయాల్సి ఉంది? అని వివరాలు తెలుసుకునేందుకు మరియు దరఖాస్తు చేసిన తర్వాత ఈ కేవైసీ అనేది పూర్తి అయిందా లేదా అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే.
ఇప్పుడు Ration Card Apply చేసిన తర్వాత కింద చూపించినట్టుగా ఉండే రసీదు సిబ్బంది ఇస్తారు .
Ration Card Application Status Checking Process సొంతంగా మొబైల్లో ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ కింద ఇవ్వటం జరిగింది.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయండి.
Check Rice Card Application Status
Step 2 : Service request status check అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రసీసులో ఉన్న T నెంబర్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేస్తే Captcha Code ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
Step 3 : సర్వీస్ ను బట్టి ఒక్కోరికి ఒక్కోలా చూపిస్తుంది.
- Green Color = Accept అని అర్థము
- Orange Color = Pending అని అర్థము
- Red = Reject / Beyond SLA అని అత్తము
- SLA = ఎన్ని రోజుల్లో చేయాలి అని అర్థము